Andhra muchatlu

Andhra muchatlu Andhra Pradesh news| Andhra Updates | Andhra Muchatla its about andhra all news

16/03/2025

Watched Court movie. one of the best court drama with emotions. Everyone should watch. Sivaji garu as managapathi best in recent times. Priyadarshi garu as Teja as usual best performance and lead actors gave their best.
Actor Nani as a hero and as a producer never disappointed with his script selection.

16/03/2025

Any Godavari people🤩

    its show time
06/09/2020

its show time

09/08/2020
ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం. గుంటూరు రైల్వే స్టేషన్ లో నిలిపి వేత. 3 గంటలుగా ప్రయాణీకుల ఇక్కట్లు.భువన...
18/11/2019

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం.

గుంటూరు రైల్వే స్టేషన్ లో నిలిపి వేత.

3 గంటలుగా ప్రయాణీకుల ఇక్కట్లు.

భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడినట్లు గమనించదాంతో రైలు నిలిపి వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని అమర్చిన రైల్వే సిబ్బంది.

13/11/2019

విజయవాడ : ట్విట్టర్

దొంగ దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు..

దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపా పార్టీకే ఉన్నాయి

దొంగ దీక్షల బెస్ట్ డైరెక్టర్ గా మీకు అవార్డు కూడా వచ్చింది కదా విజయసాయి రెడ్డి గారు.

పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్,గ్రాఫిక్స్ లో జనం,ఏసీ బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా సాయి రెడ్డి గారు

మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా?

భవన నిర్మాణ కార్మికుల కష్టాలు,ఆత్మహత్యల పై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?..

_ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురం విద్యార్థినిబసవతారకం ఆసుపత్రిలో చి...
12/11/2019

క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ

ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురం విద్యార్థిని

బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

ధైర్యం చెప్పిన బాలయ్య

ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్న అనే విద్యార్థినికి నందమూరి బాలకృష్ణ ధైర్యవచనాలు పలికారు.

అనంతపురంకు చెందిన స్వప్న కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది.

ఆమె విషయం తెలుసుకున్న బాలకృష్ణ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం స్వప్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు పొందుతోంది.

తాజాగా, స్వప్నను బాలయ్య పరామర్శించారు.

ఎంతో ఆప్యాయంగా ఆ విద్యార్థినితో మాట్లాడిన ఆయన భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు.

డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు.

బాలయ్య ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.

కాగా, మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆమెను పరామర్శించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆయన స్వప్నకు పలు కానుకలు కూడా అందించారు.

ముంబైభారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అస్వస్థత కారణంగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరి, అనంతరం కోలుకున్నారని ఆమె కుటుంబ స...
11/11/2019

ముంబై

భారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అస్వస్థత కారణంగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరి, అనంతరం కోలుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.

ఇటీవలే సెప్టెంబరు 28న.. లతా 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు పలు భాషల్లో దాదాపు 1000కి పైగా పాటలు పాడారు. 2001లో భారతరత్న అవార్డును సొంతం చేసుకున్నారు.

లతా మంగేష్కర్.. చివరగా మార్చి 30న విడుదలైన 'సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కీ' అనే పాట పాడారు. ఆమె 75 ఏళ్ల వయసులో.. 2004లో 'వీర్-జారా' ఆల్బమ్​ ఆలపించారు.

1942లో ప్లేబాక్ సింగర్​గా మొదలైన లతా మంగేష్కర్ ప్రయాణం.. ఇప్పటివరకు ఎన్నో మధురమైన గీతాల్ని తన గొంతిచ్చారు. 1989లో ప్రఖ్యాత దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు.

11/11/2019

అమ‌రావ‌తి: ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనపాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, మాతృభాష కోసం పరితపించే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాసిన ఆర్టికల్ ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. అందరి కోసం అమ్మ భాష పేరుతో రాసిన ఈ ఆర్టికల్ లో మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యను ఏ భాషలో బోధించాలనే విషయమై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, వెంకయ్యనాయుడిగారు రాసిన ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వానికి ఒక కనువిప్పులాంటిదని ట్వీట్ చేశారు. దీనికి తోడు ఉప రాష్ట్రపతి రాసిన ఆర్టికల్ ను అప్ లోడ్ చేశారు.

11/11/2019

పశ్చిమ గోదావరి : లంచం తీసుకుంటూ.. రెవిన్యూ ఇన్స్‌స్పెక్టర్‌ సౌజన్య రాణి ఎసిబి అధికారులకు పట్టుబడిన వైనం సోమవారం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు తహసీల్దార్‌ ఆఫీస్‌లో ఆర్‌ఐ గా పనిచేస్తున్న సౌజన్య రాణి, భీమడోలు గ్రామానికి చెందిన చోడిశెట్టి దేవి వద్ద ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం రూ.3 వేల లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడింది.

11/11/2019

VOA లకు శుభవార్త

గౌరవ వేతనం 10 వేల రూపాయలు చేస్తూ జీఓ జారీ చేసిన ఏపి ప్రభుత్వం

Address

Rtc Colony Near Market Yard
Eluru
534001

Telephone

+919949062304

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra muchatlu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category