10/06/2026
ఏలూరు ఆటోనగర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి
జరిగిన అగ్నిప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా
కాలిపోయాయి. మరో కారు పాక్షికంగా దెబ్బతింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది
ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ
చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు
తెలియాల్సి ఉంది.