20/04/2024
నామినేషన్ వేసిన 24గంటల్లోపే దెందులూరులో వైసిపికి భారీ ఎదురుదెబ్బ - వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి భారీ ఝలక్ ఇచ్చిన సోదరుడు భరత్ భూషణ్.
- సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై దెందులూరు వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు, రాయన్న పాలెం గ్రామానికి చెందిన భరత్ భూషణ్ సంచలన కామెంట్స్..
- "ఈ వైసిపి నాయకుల తీరు సరికాదు - రాయి దాడి అంతా కల్పితం - వైసీపీలో ఇమడలేక పోతున్నాం"..అంటూ వైసిపి నాయకుల తీరుపై విసుగు చెంది వైసిపిని వీడి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరిన అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగొల్ల భరత్ భూషణ్..
- అదే విధంగా బాబు సూపర్6 పథకాలు నచ్చి, దెందులూరు అభివృద్ధి కోరుతూ పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన దాదాపు 15కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దుగ్గిరాలలో జరిగిన కార్యక్రమంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్..
వైసిపి పాలనతో విసుగుచెందిన వేలాది మంది దెందులూరు ప్రజలు రాబోయే ఎన్నికల్లో చింతమనేని గెలుపుకోసం స్వచ్చంధంగా కృషి చేస్తూ ఉండటంతో, వందలాధి మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇటీవల ఆ పార్టీని వీడి చింతమనేని నాయకత్వంలో టిడిపిలో చేరారు. తాజాగా అబ్బయ్య చౌదరి కుటుంబ సభ్యులు సైతం వైసిపి తీరుని తప్పు పట్టి టిడిపిలో చేరటం దెందులూరులో వైసిపి పార్టీ దుస్థితికి నిదర్సనం అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు....