20/03/2025
హెల్త్ అసిస్టెంట్ మేల్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ..
వైద్య ఆరోగ్య శాఖ లో తొలగించిన కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ మేల్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ...
రాష్ట్రంలో గత 22 సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖ లో క్షేత్రస్థాయి లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న పనిచేస్తున్న 920 కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ మేల్ కోర్టు తీర్పు సాకుగా నిర్దాక్షిణ్యం గా తొలగించటం శోచనీయం ...
గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా తమ విధులను నిర్వహిస్తున్న 920 హెల్త్ అసిస్టెంట్ మేల్ ల కుటుంబాలను తొలగించి ఇటు వారి కుటుంబాలను అటు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం రోడ్డు న పడవేసింది ..
ఉమ్మడి రాష్ట్రలకు సంబంధించిన ఈ తీర్పు లో తెలంగాణ లో పనిచేస్తున్న 280 మందిని అక్కడ ప్రభుత్వం నేటికి తొలగించక పోవటంతో వాళ్లు వారి విధుల్లో కొనసాగుతున్నారు.
కోర్టు తీర్పు శిరోధార్యం అన్నట్లు ప్రచారం చేస్తున్న పాలకులు ,అధికారులు కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని ,సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన తీర్పు లను కోర్టు గతంలో ఎందుకు అమలు చేయడం లేదు .
29/11/2024 న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 1207 జివో లో వున్న తక్కువ మార్కులు డిమెరిట్ ఉద్యోగుల ను 90 రోజులు వ్యవధిలో తొలగించాలని ,తొలగించి వీరికంటే ఎక్కువ మార్కులు వున్న వారికి న్యాయం చేయాలని ఆదేశించారు ..అయితే ఈ తీర్పు ను ప్రక్క దోవ పట్టించే విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొలగించడం వారి నిరంకుశ పాలనకు నిదర్శనం .
ఉద్యోగుల ను తొలగించటానికి ప్రభుత్వం వద్ద సమయం వున్న అత్యుత్సాహం ప్రదర్శించి కోర్టు తీర్పు వచ్చిన 6 రోజుల లోపు డిసెంబర్ 5 వ తేదీన హెల్త్ అసిస్టెంట్ మేల్ లను తొలగించడం వలన వీళ్ల కుటుంబాలు క్రిష్టమస్ ,సంక్రాంతి వంటి పండుగ లను కూడా జరుపుకోలేని దుస్థితి నెలకొంది ...ప్రజాసంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ,విజన్ డాక్యుమెంట్ గురించి గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం 22 సంవత్సరాల పని చేసిన ఉద్యోగుల పట్ల తీరు బాధాకరం ..
రాష్ట్రంలో అధికమార్కు లతో వున్న ఉద్యోగుల ను తొలగించి న అధికారులు వీరికంటే తక్కువ మార్కులతో పనిచేస్తున్న వారిని కొనసాగించడం అధికారుల పని తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ...
వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను తొలగించడం ,తక్కువ మార్కులు వారిని కొనసాగించడం గురించి ప్రశ్నించగా అధికారులు పొంతనలేని సమాధానాలతో దాటవేయటం మరో కొసమెరపు ...l