05/09/2025
ప్రమాదంలో జర్నలిజం వృత్తి
#ఎవరుజర్నలిస్టులు అన్న విషయానికి వస్తే.. ఆనాడు అనగా మీకు అవసరమైనప్పుడు ఏ అర్హత లేకున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి మీ బంధువులను, కులపొలన్ను తీసుకొచ్చింది ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుంది.
#పార్టీమీడియా, #కులంమీడియా, #ప్రాంతంమీడియా, #మతాలమీడియా గా విభజించి ప్రోత్సాహించిందెవరు?
మీ అవసరం కొద్ది విచ్చల విడిగా సొంత ఆర్గనైజేషన్ ల ద్వారా బ్యాచ్ లకు బ్యాచ్ లను తయారు చేసింది ఎవరు?
అలా తయారైన బ్యాచ్ లను యూజ్ అండ్ త్రో చేసింది ఎవరు?
ఏ #పత్రికలు, #మ్యాగజైన్ లకు #ప్రభుత్వయాడ్స్ ఇచ్చి పెంచి పోషిస్తోంది
విచ్చల విడిగా పుట్టుకొస్తున్న డిజిటల్ #ఎడిషన్ లలో వస్తున్న పత్రికల పరిస్థితేంటి?
సోషల్ మీడియాలో ఒక్కో జర్నలిస్టు ఒక కలం వీరుడై ప్రశ్నిస్తుంటే రీచ్ లేని, ముఖంలేని మెయిన్ స్ట్రీమ్ మీడియా తట్టుకోలేక జర్నలిస్టుల్లో అసలు #జర్నలిస్టులు, కొసరు జర్నలిస్టులు అని చీలిక తేవడం ఏంటో మరి విడ్డూరం
ఎవరు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు ? ఎవరు పార్టీలకు కొమ్ము కాస్తున్నారు? ఎవరు పెయిడ్ న్యూస్ రాస్తున్నారు అనేదే ఇక్కడ కొలమానం కావాలి
ఏం చేయాలి
#అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఏ సంస్థలో అయితే ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మీడియా సంస్థలో పనిచేసి ప్రస్తుతం దీనావస్థలో ఉన్నారో అటువంటి వారిని ప్రభుత్వం పింఛన్లు లేదా ఆర్థిక భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా #రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలి
ఆయా మీడియా సంస్థలు సకాలంలో #జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. #వేజ్ బోర్డు నిబంధనలు అమలు చేయని సంస్థలపై కొరడా ఝులుపించాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు? వారిలో స్వతంత్ర జర్నలిస్టుల సంఖ్య ఎంత? వృద్ధులు, మహిళా జర్నలిస్టుల జాబితా తయారు చేసి తగు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
#సోషల్ మీడియా, #ఎలక్ట్రానిక్ మీడియా, #ప్రింట్ మీడియా అండ్ #డిజిటల్ మీడియా( #వెబ్, డిజిటల్ ఎడిషన్ న్యూస్) లో పనిచేస్తున్న వారిని గుర్తించి వారిని ప్రత్యేక జర్నలిస్టులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది
#వెంకటేశ్వర్లుబోయ, #తెలంగాణజర్నలిస్ట్, హైదరాబాద్
An Urgent Appeal to the Government: Save the Soul of Journalism in India
Can you add your signature? ✍️
Proposal for a Comprehensive Journalist Registry and Welfare Scheme in Telangana & AP