18/09/2025
మూడు రోజుల క్రితం నల్గొండలో లారీ లోడ్ యూరియా.. అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోయింది అని చాలా పెద్ద రాద్దాంతం జరిగింది. రైతులకు చెందాల్సిన యూరియా.. ఎమ్మెల్యే గన్ మ్యాన్ లారీ లోడ్ మొత్తాన్ని వేరేచోటికి తరలించి అమ్మేసుకున్నాడని ఆందోళన చేపట్టారు రైతులు.
ఇవాళ అదే ఎమ్మెల్యే.. తన కొడుకు వివాహ వేడుకలకు అవుతున్న ఖర్చు.. రెండు కోట్ల రూపాయలను.. తన నియోజక వర్గంలో లక్ష మంది రైతులకు యూరియా బస్తాలను ఉచితంగా ఇవ్వాలని CM రేవంత్ కు అందజేశారు..
గన్ మ్యాన్ వల్ల జరిగిన ఇమేజ్ డ్యామేజ్ ను ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటున్నారు.. అని సోషల్ మీడియా వర్గాలు, ప్రతిపక్షాలు.. సదరు ఎమ్మెల్యేని దెప్పి పొడుస్తున్నాయి..