Maa Galiveedu Varthalu

Maa Galiveedu Varthalu Maa Galiveedu news Hub

ఇప్పుడైనా  పై అధికారులు మరియు ప్రభుత్వం చర్యలు తీసుకోరా ఈ వీఆర్ఏ పైన..???రెండు క్రితం ఈ వీఆర్ఏ పైన వచ్చిన కథనం -   https...
26/07/2023

ఇప్పుడైనా పై అధికారులు మరియు ప్రభుత్వం చర్యలు తీసుకోరా ఈ వీఆర్ఏ పైన..???

రెండు క్రితం ఈ వీఆర్ఏ పైన వచ్చిన కథనం - https://youtu.be/OgoH3JFMTtM

22-9-22 any one interested any locationsLakkireddy palli🚩Galiveedu🚩Koduru🚩Rajampeta🚩Sundupalli🚩Rayachoty🚩Please reach ou...
20/09/2022

22-9-22 any one interested any locations

Lakkireddy palli🚩
Galiveedu🚩
Koduru🚩
Rajampeta🚩
Sundupalli🚩
Rayachoty🚩

Please reach out — 8639347143

అన్నమయ్య జిల్లా రాయచోటి డిపో మేనేజర్ గారికి గాలివీడు మండలం విద్యార్థి విద్యార్థుల విన్నపం..ఈరోజు నుండి ఇంటర్ పరీక్షలు ప్...
06/05/2022

అన్నమయ్య జిల్లా రాయచోటి డిపో మేనేజర్ గారికి గాలివీడు మండలం విద్యార్థి విద్యార్థుల విన్నపం..

ఈరోజు నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయినవి కావున రాయచోటి డిపో మేనేజర్ గారు మా గాలివీడు ప్రాంతానికి ఉదయం మాకు రెండు స్పెషల్ బస్సులు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాము.

ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఆర్టీసీ బస్సు పైన ఆధారపడి ఉంది సమయానికి బస్సులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కావున మాపై దయ తలచి గాలివీడు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య స్పెషల్ గా ఒక రెండు బస్సులు ఇవ్వాల్సిందిగా గాలివీడు మండలం ప్రజలు విద్యార్థులు ప్రార్థన..

ఇట్లు
గాలివీడు మండల ప్రజలు విద్యార్థులు..

గాలివీడు మండలం ప్రజల తరపున  వరద బాధిత 50 కుటుంబాలకు గురువారం అనగా 25-11-2021 వరద బాధితులకు గాలివీడు మండలం ప్రజలుతరఫునుండ...
23/11/2021

గాలివీడు మండలం ప్రజల తరపున వరద బాధిత 50 కుటుంబాలకు గురువారం అనగా 25-11-2021 వరద బాధితులకు గాలివీడు మండలం ప్రజలు
తరఫునుండి సహాయం చేయబోతున్నాము.

ఒక్కొక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం ప్యాకెట్.ఆరు రకాల తో కూడిన నిత్యవసర వస్తువులు. కందిపప్పు. గోధుమపిండి. గోధుమ రవ్వ. చింతపండు. పసుపు ప్యాకెట్. నూనె ప్యాకెట్. తో కూడిన సరుకులు అందించబోతున్నారు.

వరద బాధిత ఒక్కొక్క కుటుంబానికి 750/-రూపాయలు విలువచేసే సరుకును అందించే చున్నాము ఇప్పటివరకు స్పందించిన దాతల సహకారంతో 50 కుటుంబాలకు సరుకులు బియ్యం సమకూర్చడం జరిగింది.

గాలివీడు మండలం లో గొప్ప మనసున్న వ్యక్తులు మానవతా మూర్తులు ఇంకా ముందుకు వచ్చి మీ తోచిన విధంగా సహాయం ఇస్తే మరి కొన్ని కుటుంబాలకు సేవ చేసేందుకు నిత్యావసర సరుకులు బియ్యం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం

వరద బాధితులకు మేము సైతం అంటూ ఇప్పటివరకు మానవతా దృక్పథంతో వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

గాలివీడు మండలం లో ఇంకెవరైనా వరద బాధితుల కోసం సహాయం అందించేవారు రేపు అనగా బుధవారం సాయంత్రం లోపు అందించ వచ్చును..

సంప్రదించవలసిన నెంబర్

Sudhakar Vallepu 9052515959

Baskar Yadav 99122 53178

Ganesh Poola 9452338944

ఇట్లు
గాలివీడు యువత

*ఓం నమో వెంకటేశాయ*🙏🙏కడప జిల్లా, గాలివీడు పట్టణ నడిబొడ్డున ఉన్న బ్రాహ్మణ వీధి  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమును దర్శించినప్...
22/11/2021

*ఓం నమో వెంకటేశాయ*🙏🙏

కడప జిల్లా, గాలివీడు పట్టణ నడిబొడ్డున ఉన్న బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమును దర్శించినప్పుడు, ఆ స్వామి వారిపైన భక్తితో, స్వామి వారి వైభవాన్ని తెలుపుతూ *అన్నమాచార్యుల వారు రాసిన కీర్తన* మీకోసం. దాదాపు 700 సంవత్సరాల వెంకటేశ్వర స్వామి ఆలయం ను *జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన అతి మహిమాన్వితమైన శక్తివంతమైన ఆలయాలలో ఒకటి*.
రండి, దర్శించండి, తరించండి. ఆ స్వామి వారి కృపకు పాత్రులు కండి.

https://youtu.be/WRIHbuW6cWk

మా అధికారిక సోషల్ మీడియా URLలు:
ఫేస్బుక్: https://www.facebook.com/groups/257589969594248
ట్విట్టర్: https://twitter.com/GaliveduTemples

ఇట్లు,
*గాలివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి & శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ*,
రిజిస్ట్రేషన్ నెంబర్: 133/2021,
గాలివీడు - 516267
కడపజిల్లా. — with Chenchu Venugopal Reddy and 20 others.

The latest Tweets from Galiveedu Temples 🇳🇪 (). This account created to spread awareness about our ancient temples and the renovation activities under taken by committee. Galiveedu, Kadapa-516267

ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...అమరావతి : రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవ...
10/11/2021

ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...

అమరావతి : రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది... ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు కడప జిల్లాల్లో,, అతి భారీ వర్షాలు.... రేపు ప. గో.. కృష్ణ. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప చిత్తూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు... మృత్యు కారులు నవంబర్ 12 వరుకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు...

భారత్ మాతాకీ జై, జై జవాన్వీర జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి అమర్ రహేచిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మం...
07/11/2021

భారత్ మాతాకీ జై, జై జవాన్

వీర జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి అమర్ రహే

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం వేపూరికోట గ్రామం బంగారు వాండ్ల పల్లి కి చెందిన శ్రీమతి పెద్ద ఆవుల సరోజమ్మ & కీర్తిశేషులు స్వర్గీయ పెద్ద ఆవుల నారాయణ రెడ్డి(ఎక్స్ స్పిన్నింగ్ మిల్ ఉద్యోగి ) గారి కుమారుడు పెద్ద ఆవుల కార్తీక్ కుమార్ రెడ్డి దేశ సరిహద్దు భద్రతా దళం లో ఇంజనీరింగ్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తూ హిమాచల్ ప్రదేశ్ ఉదయపూర్ లో మంచు కొండలు వద్ద విధినిర్వహణలో ఉండగా మంచు చరియలు విరిగి నాలుగవ తేదీ అమరుడైనాడు అతని పార్థివ దేహాన్ని స్వగ్రామానికి పంపేముందు సైనిక లాంఛనాలు పూర్తి చేసి సరిహద్దుభద్రతాదళ అధికారులుఆర్మీ అధికారులు ఆర్మీ ఉన్నతాధికారులు సైనిక వందనం చేసి సహచర జవాన్లు కన్నీటి వీడ్కోలు పలికారు..

అమర్ హై కార్తీక్ కుమార్ రెడ్డి అమర హై

23/10/2021

గాలివీడు మండలం గాలివీడు గ్రామం పెద్దూరు కస్ప నందు రెండవ అంగన్వాడీ కేంద్రం బిల్లింగ్ శిథిలావస్థకు చేరింది చిన్న పిల్లలు రోజు అంగన్వాడి కేంద్రం వస్తూ ఉంటారు మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలు ఆడుకుంటారు.
చిన్న పిల్లలు బయట ఆడుకునేటప్పుడు పైకప్పు సిమెంటు పలకలు పడుతున్నాయి అని తల్లిదండ్రులు వాపోతున్నారు ఉన్నత మండలం అధికారులు దీనిపై దృష్టి పెట్టి అంగన్వాడి కేంద్రం మరమ్మతులు చేయవలసిందిగా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు..

ఇట్లు
గాలివీడు పెద్దూర్ గ్రామ ప్రజలు.

Please support to Maa Galiveedu Varthalu

Address

Galivedu

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Galiveedu Varthalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share