09/10/2025
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సామాన్యులకు ఊరట – గూడూరులో గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఎగ్జిబిషన్
జీఎస్టీ చట్టంలో తాజాగా అమలులోకి వచ్చిన పన్ను రేట్ల మార్పుల ఫలితంగా అనేక వస్తువులపై ధరలు గణనీయంగా తగ్గాయి.
దీనివల్ల సాధారణ ప్రజల ఆర్థిక భారం తగ్గి, విజయదశమి, దీపావళి వంటి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించింది.
సామాన్య ప్రజలకు ఈ మార్పులపై అవగాహన కల్పించడం, అలాగే పన్ను రాయితీల వలన అందుబాటులోకి వచ్చిన వస్తువుల ధరల తగ్గింపును ప్రత్యక్షంగా చూపించేందుకు,
గూడూరు వాణిజ్య పన్నుల శాఖ నేతృత్వంలో,
ది గూడూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రదర్శన –
“సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ – గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఎగ్జిబిషన్”
నిర్వహించబడుతోంది.
స్థలం: జి.ఎస్. రాయల్ కళ్యాణ మండపం, బజారు వీధి, గూడూరు
తేదీలు: అక్టోబర్ 10 మరియు అక్టోబర్ 11, 2025
సమయం: ఉదయం 10 గంటల నుండి
ప్రారంభ కార్యక్రమంగా ఉదయం 10 గంటలకు గాంధీ బొమ్మ వద్ద నుండి ర్యాలీ నిర్వహించబడుతుంది.
అనంతరం వేదిక వద్ద పన్ను చట్టాలలో చోటుచేసుకున్న సంచలనాత్మక మార్పులు, వాటి ద్వారా వినియోగదారులకు లభిస్తున్న లాభాలు, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం మొదలైన అంశాలపై ఉపన్యాసం నిర్వహించబడుతుంది.
ముఖ్య అతిథులు:
గూడూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పాశం సునీల్ కుమార్ గారు
తిరుపతి రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అదనపు కమిషనర్ శ్రీ నాగేంద్ర గారు
గౌరవ అతిథి:
రాష్ట్ర జీఎస్టీ గూడూరు సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు
ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు కొత్త జీఎస్టీ చట్ట మార్పులపై స్పష్టమైన అవగాహనతో పాటు,
మార్కెట్‌లో ధరల పారదర్శకత పెరగడం, వ్యాపారులకు మరియు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అవగాహన సృష్టించడమే ముఖ్య ఉద్దేశ్యం.
సదరు కార్యక్రమంలో అందరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గూడూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు టాక్స్ ప్రాక్టీషనర్స్ సంఘం వినమ్రంగా ఆహ్వానిస్తున్నాయి.
“సమాజ అభివృద్ధికి పన్ను చట్టాల అవగాహన అవసరం – పన్ను చెల్లింపుదారుడే దేశాభివృద్ధికి పునాది!”
FOLLOW UP OUR DAILY UPDATES 🙂🙂
KINDLY SWITCH ON OUR PAGE NOTIFICATION AND WATCH THE DAILY POSTS
DISCLAIMER :
THE COPYRIGHT CREDITS GOES TO RESPECT OWNERS..
THIS VIDEO IS NOT USED FOR ILLEGAL SHARING OR PROFIT MARKETING.
IF ANY PROBLEM MSG US ON INSTAGRAM AND THE VIDEO WILL BE REMOVED..
NO NEED TO REPORT OR SEND STRIKE.
credit/removal
Dm
THANK YOU..............
HAS TAGS: #