20/03/2025
భీమోలు కేసుల్లో తీన్మార్ - ఒకే రోజు మూడు కేసుల్లో కీలక నిర్ణయం!
వనజాక్షి అక్రమ మ్యూటేషన్ కి సరిగ్గా నేటి కి ఒక ఏడాది!
- అక్రమ మ్యుటేషన్ కేసులో యంఆర్ఓ వనజాక్షీ పై కోర్టు దిక్కారణ కేసులో ప్రాధమిక ఆదారాలున్నాయని హైకోర్ట్ ధృవీకరణ
- తప్పుడు వీలునామతో చనిపోయిన జమీందారు భార్యానంటూ తెరమీదకొచ్చిన రత్నానికి చుక్కెదురు?
- యజమాని వారసుడు మరియు అక్రమ కౌలుదారుడు సర్వారాయుడు భీమోలు భూములపై వేసిన యధాతధ పిటీషన్ కొట్టివేత!
- సర్వం రాయుడే’ అంటూ అప్పట్లో జనశక్తి చెప్పిందే నిజం అయ్యింది. కేసుల్లో అక్రమ వాటాదారుడిగా వున్న కీలక న్యాయవాడి బంధువులపై 45 ఎకరాలు ముటేషన్ చేసిన వనజాక్షి కి చిక్కులు. న్యాయవాడి పై బార్ కౌన్సిలలో పిర్యాదు.
- కోర్టు తీర్పుకు విరుద్దంగా అమ్ముకున్న 169.2 ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం. నాటి అధికారులపై చర్యలు వుంటాయో లేదో? వేచి చూడాల్సిందేనా!
+++
గోపాలపురం, 20 మార్చి 2025: అర్దశతాబ్దం భీమోలు పంచాయితిలో నిజంగా ఈరోజు తీన్మార్ నిర్ణయాలు వచ్చాయి. ఒకే రోజు అటు గౌరవ హైకోర్ట్ ఇంకా తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో మరొకటి ఒకదానికొకటిగా విడివిడిగా కలివిడిగా అసలు భూ యజమానులకు అనుకూలంగా తీర్పులు రావడం నిజంగా తీన్మార్ అనిపించింది.
యంఆర్ఓ వనజాక్షీ కోర్టు దిక్కారణ కేసులో ప్రాధమిక ఆదారాలున్నాయి - అమరావతి హైకోర్టు:
భీమోలు భూయాజమానుల తరపున శ్రీమతి కరిబండి సూర్యకుమారి దాఖలు చేసిన రిట్ పిటీషన్ నెం. 6289/2024 తుది తీర్పు ప్రకారం అప్పటికే పలు వాజ్యాలలో కోర్టును అధికారులను తప్పు దోవ పట్టించి అప్పటి ఆర్డీవో మల్లిబాబు ద్వారా కవులుదారులమంటూ అక్రమ దఃఖలాలు పొందిన బీమోలు భూదొంగల ముఠా పోతిరెడ్డి సర్వారాయుడి బృందానికి గత 2024 మార్చ్ 12 నాడే చెక్ పెట్టింది. భీమోలు గ్రామం యొక్క Ac.360.0 భూమిని వివాదాస్పద భూముల ఖాతాగా గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అయితే దీనికి విరుద్దంగా నాటి గోపాలపురం యంఆర్ఓ వనజాక్షీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్ట్ నేడు ధృవీకరించడం ఒక ఎత్తైతే. ఆమె నిర్లక్ష్యానికి మూల్యంగా 169.2 ఎకరాలను అసలు యాజమాన్య హక్కులేలేని కవులుదారులు అమ్మేసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన వారం రోజుల తర్వాత సదరు అక్రమ కవులుదారులు ఏ పత్రాలు లేకుండా భూమిని సుమారు రూ. 30 కోట్లకు అమ్ముకోవడం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ వెను వెంటనే అక్రమంగా భూములు కొనుకున్న విజయ దుర్గా అగ్రీ నర్సరీ ఫారం, బీమోలు భూదొంగల ముఠా పోతిరెడ్డి సర్వారాయుడి కుమార్తె సుభద్ర పేరున ఏడు ఎకరాలు, ఇంకా ఇదే కేసులో కీలక న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వారి సమీప బందువుల పేరిట నలభై ఎకరాలు రిజిస్టర్ జరగడం విశేషం. మొత్తం అక్రమ అమ్మకాల్లో 16 సెల్ డీడ్ లు వెరసి 169.2 ఎకరాలు వేగేశ్వరపురం, కోవూరు మరియు కోరుకొండ అనే మూడు సబ్ రిజీస్ట్రార్ ఆయపీసుల్లో 2024 మార్చి 16 మరియు 18 నమోదు వెనుక సదరు రిజిస్ట్రేషన్ శాఖతో పాటుగా వనజాక్షి కూడా కీలకంగా అవినీతికి పాల్పడారన్నది జగమెరిగిన సత్యం. అంతటితో ఆగని వనజాక్షి ఆక్రమంగా భూమి కొన్న వారికి కూడా సహకరించారు. హత్య ఏడాది సరిగ్గా ఇదే రోజున కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అక్రమ కొనుగోలుదారులకు బూమిని ఆన్లైన్ చేసిపారేశారు. వనజాక్షి అవినీతిలో రెండు ముఖ్యాంశాలు (1) పిటీషన్ 6289 ప్రకారం కోర్టు ఆదేశం ప్రకారం సకాలంలో భూములను వివాదాస్పదంగా గుర్తించకపోవడం, మరియు (2) ఆ భూములను ఎటువంటి హక్కులు లేని విక్రయించడానికి కవులుదారులు విక్రయించదానికి సహకరించడం మరియు అక్రమ యజమానులకు రాత్రికి రాత్రే 169.2 ఎకరాలను తప్పుగా మ్యుటేషన్ చేయడం వంటివి. భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన వారితో కలిసి అవినీతికి పాల్పడిన ఈమెపై బి. వనజాక్షిపై కోర్టు ధిక్కార చర్యకు హైకోర్టు పిటీషన్ సిసి నెంబర్ 2035/2024 ను నమోదు చేసిన శ్రీమతి కరిబండి సూర్యకుమారి శ్రమ సరిగ్గా ఏడాది తర్వాత ఫలించింది. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 10 నుండి 12 మేరకు ఈమెపై చర్యలు తీసుకోవడానికి ప్రాధమిక ఆధారాలు వున్నవంటూ నేడు న్యాయమూర్తి ఆదేశాలివ్వడం భీమోలు భూ వివాదాల్లో కీలక మలుపు అనే చెప్పవచ్చు. నకిలీ రిజిస్ట్రేషన్లను ఇప్పటికైనా రద్దు చేస్తారా. లేక కోర్టు దిక్కరణ కేసులో వున్న వనజాక్షికి వత్తాసుగా రెవెన్యూ అధికారులు వస్తారో?.. వేచి చూడాల్సిందే!
నామొగుడు- నా భూమి పధకానికి బ్రేక్? జమీందారు రెండో పెళ్ళాన్ని అంటూ ఎకరాలు కొట్టేయబోయిన రత్నానికి బ్రేక్?
ఓ ప్రక్క భూ యజమానులు, అక్రమ కౌలుదారులు, నష్టపోయిన అసలు పట్టదారులు ఈ భూములు మాదంటే మాదని యాభై ఏళ్లుగా కొట్టుకు చస్తావుంటే అసలు జమీందారు మారెడ్డి బుచ్చిరాజు రెండో పెళ్ళాన్ని అంటూ ఆటలో అరటిపండులా కొన్నెకరాలకు నేనే వారసురాలినంటూ గండృతు రత్నం వూరఫ్ మారెడ్డి రత్నం వూరఫ్ భూపతి రత్నం అంటూ ఒకమే రంగంలోకి దిగి, తనకు తన మొదటి భర్తకు తాను రెండో భార్యను అంటూనే అతను చనిపోయే ముందు అతని మిగులు ఆస్తులన్నీ తనకే రాసారంటూ 2000 సవత్సరంలో ఓ నకీలీ వీలునామా సృష్టించి ఏకంగా 2009 లో 7.40 ఎకరాలకు పాస్ బుక్కునే పుట్టించి సదరు ఆస్తి అదే యజమాని వారసుడు మరియు అక్రమ కౌలుదారుడు సర్వారాయుడుకి 2009 లో అమ్మినట్లుగా రిజిస్టర్ చేయించారు. ఆతర్వాత వీరిద్దరికీ వచ్చిన విబేదాల్లో కోవూరు కోర్టులో ఓయస్ నెంబర్ 16/ 2011 ఇంకా ఓయస్ నెంబర్ 299/2011 ప్రకారం సదరు అమ్మకాని ఆపాలని సర్వారాయుడుతోనే కేసులు వేసి ఓడిపోవడం గమనార్హం. అసలు 1957/ 1984/ 2000 ఇలా పలుదఫాలుగా జమిందారీ వారసులు మారెడ్డి జగ్గారావు ఇంకా మారెడ్డి బుచ్చిరాజు తమ సంతాన వారసులకు బోవములు పంచిన రిజిస్టర్డ్ వీలునామాల్లో ఎవరెవరికి ఎంట భూమి పంచారో విపులంగా రాశారు. అయితే 2000 సంవత్సరంలో శ్రీమతి రత్నం సృష్టించిన వీలునామాలో మారెడ్డి బుచ్చిరాజు తన సంతకం కాకుండా వేలిముద్ర వేయడం విషయాన్ని ఈరోజు రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిగిన విచారణలో మెజిస్ట్రేట్ దృష్టి తీసుకొని వచ్చారు న్యాయసలహాదారు అన్నపరెడ్డి విజయభాస్కర రెడ్డి. అదేసమయంలో రత్నం తన పేరిట వున్న దన్న వీలునామాలో మిగిన ఆస్తులన్నీ అని అంటూనే, ఏ ఒక్క భూమి ఆస్తికి సంబందించిన సర్వే నెంబర్లు లేకపోవడాన్ని కూడా న్యాయవాది జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరిన్ని శాఖయాలు ఇవ్వడానికి సమయం కోరగా జాయింట్ కలెక్టర్ తదుపరి వాయిదాను ఏప్రిల్ 4 వ తేదీకి వేశారు. అసలు రత్నం హక్కుదారు కాదన్న విషయాన్ని తదుపరి వాయిదాలో తేల్చేయడంతో పాటుగా ఆమె జమిందారీ అక్రమ కవులుదారుడు సర్వారాయుడు చేసిన భూ భాగవతాలపై మరిన్ని వివరాలు అటు కలెక్టర్ కి ఇటు హైకోర్టుకు ఇస్తామని భూ యజమాని కాకర్ల గంగరాజు తెలిపారు. తన భార్య కు ఆమె తల్లిగారు ఇచ్చిన 5.60 ఎకరాల భూమిని ఆక్రమంగ కొట్టేయడానికి సర్వారాయుడు రత్నం చేసిన ఇరువురి ప్రయత్నాలను అడ్డుకోగలిగామని, అయినా వారు చేసిన ఫోర్జరీలు, అక్రమ పత్రాలపై పోలీసు కేసు నమోదు చేస్తామన్నారాయన. అలాగే ఓ ప్రక్క జమీందారుగా, మరోపక్క అక్రమ కవులుదారుడిగా కోట్ల రూపాయల భూమి అమ్మిన సర్వరాయుడు, డాక్టర్ చదువుతున్న తన కూతుర దా. సుభద్ర పేరుతో ఇదే వివాదాస్పద భూమిలోని 7.0 ఎకరాలు చేయడం వెనుక మతలబు కూడా బయటకు తీస్తామన్నారు.
అక్రమ భూములపై వేసిన యధాతధ పిటీషన్ కొట్టివేత!
ఓప్రక్క జాయింట్ కలెక్టరుకు ఈ 5.60 ఎకరాలు తనడంటూ రత్నం, తనకు అమ్మేసిందంటూ రత్నం వేర్వేరు పీటీషన్లతో గందరగోళం సృష్టించి లబ్దిపొందుదామనుకున్న ఈ ద్వయం అటు హైకోర్టులో కూడా తమ అక్రమణలపై చర్యలు వద్దంటూ మద్యంతర వుత్తర్వ్యూలను కోరుతూ ఈరోజే మరొక పిటీషన్ వేయటం గమనార్హం. అయితే రాజమండ్రిలో జాయింట్ కలెక్టరు కోర్టు జరుగుతున్న సమయంలోనే హైకోర్ట్ వీరి పిటీషన్ కొట్టివేసిందన్న విషయాన్ని అధికారులకు తెలిపిన న్యాయవాదులు సదరు వీరి ఆక్రమణ భూమిని వివాదాస్పద ఖాతాలోకి వెళ్ళకుండా అడ్డుకోగలిగారు.
ఇలా మూడు కీలక నిర్ణయాలతో భీమోలు భూముల తీర్పులు, నిర్ణయాలు ఆక్రమార్కులకు అడ్డకట్టవేయడం, అదికూడా యంఆర్ఓ వనజాక్షీ ఆక్రమార్కులకు దొంగ ముటేషన్ చేసిన అదే రోజున ఏడాది తర్వాత కేసులు కీలక మలుపు తిరగటం, ఒకే రోజు మూడు విజయాలు చూసిన భూయాజమానుల దీన్ని న్యాయ తీన్మార్ గా భావిస్తున్నారు. కేసుల్లో పిటిషనర్ కరిబండి సూర్యకుమారి ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. చివరగా ఈ రోజు ఉత్తర్వుతో, కవులుదారులు చేసిన అక్రమ ఆస్తుల అమ్మకాలకు రద్దుకు గీతం పాడినట్లేనా?.. వేచి చవడాల్సిందే.. మరింత పరిశోధనతో జనశక్తి మళ్ళీ మీ ముందుకు వస్తుంది.