10/08/2026
మాతా శిశు సంరక్షణే ప్రధాన లక్ష్యంగా గుంటూరు నగరంలోని శారదకాలనీ 22వ లైనులో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (UPHC) ఈరోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా UPHCలలో ప్రముఖ సీనియర్ ప్రైవేట్ వైద్యులు అందుబాటులో ఉండి ఉచిత సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం జరిగింది.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారు శారదకాలనీ UPHC వద్ద ఓపీ (OP) నిర్వర్తించి మహిళలకు వైద్య సేవలు అందించారు.శిబిరంలో ఆసుపత్రికి విచ్చేసిన మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు డాక్టర్ రాజకుమారి గారు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, సలహాలు, సూచనలు అందజేశారు. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహార ప్రాధాన్యత మరియు ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై సవివరంగా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి మహిళలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో UPHC వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.