apnoorbashamuslimmedia

apnoorbashamuslimmedia AP NOORBASHA MUSLIM MEDIA

28/02/2025

MYDCF యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ప్రొఫైల్ ని కంప్లీట్ చేయండి. ప్రొఫైల్ లో ఆధార్ కార్డు లో ఉన్న పేరును మాత్రమే నమోదు చేయండి . దాని ద్వారా మీకు లభించే 10 అంకెల DCF ID నెంబర్ మరియు కార్డు వల్ల మీకు వివిధ ప్రయోజనాలు కలిగే అవకాశాన్ని దూదేకుల కేర్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతోంది . ముఖ్యంగా కాస్ట్ సర్టిఫికెట్ అంశానికి శాస్వత పరిష్కారాన్ని ఇవ్వబోతోంది. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలను కలించే ప్రయత్నంలో ఉంది.
అలాగే business circle లో మీ వ్యాపారాన్ని నమోదు చేసుకోండి . తద్వారా మీ వ్యాపార అభివృద్ధి జరిగే అవాకాశం ఉంది.
రక్తదాతలు గా చేరండి , మన వాళ్ళ జీవితాలను మనమే కాపాడినవాళ్ళము అవుతాము
దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసిన MyDCF యాప్ దూదేకుల మేలు చేసేది మాత్రమే. అందుకే కేవలం 3 నెలల వ్యవధిలో అందరి మన్ననలను పొందుతోంది.
మీ ఆదరణతో DCF చేపట్టిన ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ... మీ హన్ను భాయ్ (ఫౌండర్ )

27/02/2025

డా. ఉమర్ ముక్తార్ సందేశం

నాకు ఊహ తెలిసే సమయానికి దుదేకుల అనేది కేవలం ఒక కులం కాకుండా ఒక ఉద్యమం అని తెలిసింది. ఎందుకంటే, నాన్నగారు దుదేకుల అనే సామాజికవర్గం ఎక్కువ శాతం పేదరికంతో ఇబ్బందులు పడటం, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడటం చూసి, ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అధికంగా ఉన్నారని గుర్తించి, అప్పటికే ప్రజలను సమీకరిస్తూ ఉద్యమాన్ని నడిపేవారు.

వామపక్ష భావాల నుండి వచ్చిన నాన్నగారు, తాను ఉన్నప్పటినుంచీ సామాజిక స్పృహ కలిగి ఉండడంతో, ఆ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామాల నుండి ఢిల్లీ స్థాయి వరకు ప్రజలను సమీకరించుకొని, ఈ స్థాయికి ఎదిగి, ఈ కులానికి ఒక గుర్తింపు, ఓ వైభవాన్ని తీసుకువచ్చారు.

ఈ విషయాలు చూస్తూ పెరిగిన నేను, నాన్న అకస్మాత్తుగా మరణించిన తర్వాత, మన కులం సామాజిక విలువ కోల్పోతుందని భావించాను. ఒక విద్యావంతునిగా, వైద్యుడిగా, వ్యాపారవేత్తగా, అన్నింటికంటే ముందుగా ఒక సహోదరుడిగా, మన సామాజికవర్గం అభివృద్ధి పథంలో నడవాలి. మనవారు ఇతర వర్గాలతో సమానంగా ఈ సమాజంలో ఉండాలి. ముఖ్యంగా, ముస్లింలతో కలిసిమెలిసి ఉండాలి. అలాగే, సమాజంలోని అన్ని వర్గాలతో సోదరభావంగా మెలగాలి.

దానికి అవసరమైనంత వరకు మన సామాజిక వర్గంలోని ప్రజలకు అవగాహన రావాలి. మన ధర్మాన్ని, మన ఇస్లాం నమ్ముతూ, ఇతర మతాలను గౌరవిస్తూ, విద్య, వైద్యం, ఉద్యోగం, వివాహం, జీవనోపాధి, వ్యాపారం—ఈ అన్ని రంగాల్లో దుదేకుల వర్గం స్థిరపడాలి.

దానికి తగిన హక్కులను సాధించే విధంగా నా అడుగులు కొనసాగుతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన కులాన్ని ఎదిగే విధంగా ఒక యువ నాయకుడిగా, ఆ మహామనిషి వారసునిగా నా వంతు పాత్రను పోషిస్తున్నాను. ఈ సౌవెనీర్ పుస్తకం ద్వారా పాఠకులకు తెలియజేస్తున్నాను.

ఇట్లు,
డా. ఉమర్ ముక్తార్ MBBS
TDP యువనేత
S/O చమన్ సాబ్
చైర్మన్ - చమన్ సాబ్ ఫౌండేషన్
MD - US GOLD BULLION PVT LTD
MD - NOOR GRANITES
MD - చమన్ సాబ్ గ్రూప్

16/02/2025

*సీనియర్ సిటిజెన్ కు రైల్వే కానుక*

భారతీయ రైల్వేస్
సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్ - సీనియర్ సిటిజన్లు గమనించండి, రైలు టికెట్ పై 50% రాయితీ, కొత్త విధానం అందరిని ఆశ్చర్యపరిచింది

జనవరి 17, 2025

భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది, ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త విధానం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం వయస్సు మీద పడిన వారికి పెద్ద ఊరటగా మారింది, ముఖ్యంగా టికెట్ ధరల భారంతో ప్రయాణం చేయలేకపోయిన వారికి.

ఈ కొత్త విధానం, ఆర్థికంగా సీనియర్ సిటిజన్లకు మేలు చేయడంతో పాటు, తమ కుటుంబ సభ్యులను కలవడానికి మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వ్యాసంలో, ఈ కొత్త విధానం గురించి పూర్తిగా వివరించబడింది, ఇందులో అర్హత ప్రమాణాలు, రాయితీ పరిమితి, మరియు దీని ప్రయోజనాలను పొందే మార్గాలు ఉన్నాయి.

సీనియర్ సిటిజన్ రైలు టికెట్ డిస్కౌంట్: ముఖ్యాంశాలు

ఈ కొత్త విధానంలో, సీనియర్ సిటిజన్ల నిర్వచనంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. పురుషుల అర్హత వయస్సు 60 సంవత్సరాలు కాగా, మహిళలకు ఇది 58 సంవత్సరాలు. ఈ మార్పు ద్వారా మరింత మందికి ఈ పథకం లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

వయస్సు నిర్ధారణ కోసం అంగీకరించిన పత్రాలు:

ఆధార్ కార్డు

పాన్ కార్డు

పాస్‌పోర్ట్

డ్రైవింగ్ లైసెన్స్

ఓటర్ ఐడీ కార్డు

పెన్షన్ పాస్‌బుక్

మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు లేదా ప్రయాణ సమయంలో వీటిలో ఏదైనా ఒక పత్రం కలిగి ఉండడం తప్పనిసరి.

వర్గాల వారీగా డిస్కౌంట్ వివరాలు:

స్లీపర్ క్లాస్ – 50% రాయితీ

AC 3-టైర్ – 40% రాయితీ

AC 2-టైర్ – 35% రాయితీ

AC ఫస్ట్ క్లాస్ – 30% రాయితీ

జనరల్ & సెకండ్ సిట్టింగ్ – 45% రాయితీ

ఈ రాయితీ అన్ని రకాల రైళ్లకు వర్తిస్తుంది, అందులో మెయిల్/ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్దీ, మరియు ఇతర ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి.

టికెట్ బుకింగ్ ప్రక్రియ:

సీనియర్ సిటిజన్లు ఈ రాయితీని రెండు మార్గాలలో పొందవచ్చు:

1. ఆన్లైన్ బుకింగ్: IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా

2. రైల్వే టికెట్ కౌంటర్: ఏదైనా రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ ద్వారా

ఆన్లైన్ బుకింగ్ దశలు:

1. IRCTC వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి

2. మీ ప్రయాణ వివరాలు నమోదు చేయండి

3. ప్రయాణికుల వివరాలు నింపే సమయంలో "Senior Citizen" ఎంపికను ఎంచుకోండి

4. మీ వయస్సు మరియు లింగాన్ని నిర్ధారించండి

5. చెల్లింపు చేసి మీ ఈ-టికెట్ పొందండి

సీనియర్ సిటిజన్లకు ఉచిత సదుపాయాలు!

ప్రయోజనాలు & సదుపాయాలు:

ఆర్థిక ఊరట: 50% వరకు డిస్కౌంట్ వలన ప్రయాణ వ్యయం తగ్గుతుంది.

మెరుగైన వసతులు: డిస్కౌంట్ వలన సీనియర్ సిటిజన్లు మెరుగైన తరగతులలో ప్రయాణించవచ్చు.

ప్రాధాన్యత కేటాయింపు:
లోవర్ (కింది) బెర్త్ కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత.

వీల్చేర్ సదుపాయం: అవసరమైన స్థితిలో స్టేషన్లలో వీల్చేర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

వైద్య సహాయం: అత్యవసర పరిస్థితుల్లో రైల్లో వైద్య సహాయం లభిస్తుంది.

ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు:

రాయితీ పొందేందుకు చెల్లుబాటు అయ్యే వయస్సు ధృవీకరణ పత్రం తప్పనిసరి.

ఈ రాయితీ కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.

టికెట్ తనిఖీ సమయంలో వయస్సు ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.

తత్కాల్ టికెట్లకు ఈ రాయితీ వర్తించదు.

సీనియర్ సిటిజన్‌తో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు రాయితీ వర్తించదు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

1. ఈ డిస్కౌంట్ అన్ని రైళ్లకు వర్తిస్తుందా?
అవును, ఇది దాదాపు అన్ని రైళ్లకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లకు వర్తించకపోవచ్చు.

2. ప్రతి ప్రయాణానికి మళ్లీ అప్లై చేయాలా?
లేదు, IRCTC ప్రొఫైల్‌లో ఒకసారి అప్‌డేట్ చేసుకున్న తరువాత ప్రతి బుకింగ్ సమయంలో ఆటోమేటిక్‌గా రాయితీ పొందవచ్చు.

3. నేను మరొకరి కోసం టికెట్ బుక్ చేయవచ్చా?
అవును, మీరు మరో సీనియర్ సిటిజన్ కోసం టికెట్ బుక్ చేయవచ్చు. కానీ వారి వద్ద చెల్లుబాటు అయ్యే వయస్సు ధృవీకరణ పత్రం ఉండాలి.

4. రాయితీ ఉన్న టికెట్లకు రిఫండ్ పరిమితులు ఏమైనా ఉన్నాయా?
లేదు, రాయితీ టికెట్ల రిఫండ్ నిబంధనలు సాధారణ టికెట్లతో సమానమే.

5. విదేశీ సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుందా?
లేదు, ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.

భవిష్యత్ అంచనాలు:

ఈ కొత్త విధానం విజయవంతంగా అమలు అయిన తరువాత, భవిష్యత్తులో మరింత మెరుగుదల అవకాశం ఉంది:

డిజిటల్ ఐడెంటిఫికేషన్: ఆధార్ అనుసంధానమైన డిజిటల్ ఐడెంటిటీ ద్వారా ప్రక్రియ మరింత సులభం అవుతుంది.

స్మార్ట్ కార్డ్: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్మార్ట్ కార్డులు, ప్రయాణ ప్రయోజనాలను ఏకీకృతం చేయడానికి.

మొబైల్ యాప్: సీనియర్ సిటిజన్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసే ప్రత్యేక మొబైల్ యాప్.

అంతర్జాతీయ సహకారం: భవిష్యత్తులో, ఈ రాయితీ అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా వర్తించవచ్చు.

14/02/2025

రాష్ట్రంలోని దూదేకుల వారి స్థితిగతులు ,వారి అవసరాల పై అధ్యయనం చేయటానికి దూదేకుల కేర్ ఫోర్స్ బృందం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆర్గనైజర్స్ మరియు కోఆర్డినేటర్స్ ఏర్పాటు చేయాలని చూస్తోంది... మన దూదేకుల జాతి ఉనికిని కాపాడుకోవడానికి మీ సహకారం అత్యంత కీలకం కాబోతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఏరియా లో జనాలు మెచ్చే నేతగా ఎదిగే అవకాశం మీకు ఉంది.మన దూదేకుల జాతి యొక్క ఉనికికే అవరోధం వచ్చే పరిస్థితుల్లో ఉన్నట్లు మాకు కనిపిస్తుంది.ఇప్పటి ప్రభుత్వాల,మరియు నాయకుల దోరణి చూస్తుంటె. గ్రామీణ ప్రాంత ప్రజలు స్థితి గతులు,మరి అధ్వానంగ ఉన్నాయీ... విద్యా,ఉద్యోగ పరంగా చాల వెనుక భాటులో ఉన్నారు. పట్టణ పరిస్తితి అంతే...
మరి 77 సం.రాల నుండి మన జాతి కి ఎవరు ఏవిధగా సహాయ పడ్డారో తెలియని పరిస్తితి.
ఓ దూదేకుల సోదరా!! నిన్ను DCF పిలుస్తుంది. ఇప్పటికైనా మన వార్ని జాగృతం చేయుటకు నీవు మాతో చేయి..చేయి కలపమని....
మనస్ఫూర్తిగా మీకు DCF( దూదేకుల కేర్ పోర్స్) నుండి ఆహ్వానం తెలుపుతున్నాము.
ఆసక్తికలవారు సంప్రదించ తలచినవారు. క్రింది నంబర్స్ ఫోన్ చేయగలరు.
హన్ను భాయ్ : 9989624611, D నాగూర్ వలి : 93926 27341, అల్తాఫ్ : 99890 34392, SS రాజ్ : 99669 10705

14/02/2025

రాష్ట్రంలోని దూదేకుల వారి స్థితిగతులు వారి అవసరాల పై అధ్యయనం చేయటానికి దూదేకుల కేర్ ఫోర్స్ బృందం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆర్గనైజర్స్ మరియు కోఆర్డినేటర్స్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఆసక్తి గలవారు తమ వివరాలను myDCF యాప్ లోని మీడియా నెంబర్ కి పోన్ చేసి ఇవ్వగలరు.. మన దూదేకుల జాతి ఉనికిని కాపాడుకోవడానికి మీ సహకారం అత్యంత కీలకం కాబోతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఏరియా లో జనాలు మెచ్చే నేతగా ఎదిగే అవకాశం ఉంది.

12/02/2025

ముస్లిమ్ మైనారిటీలలో అట్టడుగు వర్గాలైన దూదేకులకు అందని ఫలాలు... అని పదే పదే మాట్లాడుకుంటున్నాము . అసలు ముస్లింలో నుండి దూదేకులను విడదీసి చూడండి ( మతంలోంచి కాదు ). మన బలం ఏంటో తెలుస్తుంది . మనం ఎందుకు వెనకబడ్డామో తెలుస్తుంది. దాదాపు AP జనాభాలో 5 శాతం , అక్షరాస్యత అధికమే . నాయకులూ అధికమే , 139 బీసీ కులాల్లో అత్యధికంగా పద్మశ్రీలు దూదేకులలోనే , పార్టీల అజెండాలలో ప్రత్యేకస్థానం మనదే . దేశవ్యాప్తంగా ఉన్న పింజారా , మన్సూరీలకు మనం చుట్టాలమే ... ఇలా ఉన్న మనం అట్టడుగు వర్గం ఎలా అవుతాం . కేవలం కొందరి స్వార్ధం కోసం వెనక్కి నెట్టబడిన వర్గం.
ఐనా దౌర్భాగ్యం ఏంటంటే ... సొంత ఆలోచన , ఎజెండా లేకపోవటం. ఎవరి మెప్పో పొందటానికి మన ఉనికిని కోల్పోవటం లాంటివి మనల్ని అట్టడుగుకి చేరుస్తున్నాయి.
డీసీఎఫ్ టీం చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనల్లో అసలు మన వాళ్ళను మనం కులం అంటే అవగాహనకు ఎంత దూరం పెట్టామో తలచుకుంటేనే గుండెలు బరువెక్కుతున్నాయి.
మన డీసీఎఫ్ టీం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాన్ని అభినందించి తోడ్పాటు అందించాల్సింది పోయి , కొంతమంది ఆటంకాలను కల్పిస్తున్నారు అంటే వారికి జాతి పట్ల ఉన్న నిబద్దత అర్ధం అవుతూనే ఉంది.
"మాకు కాదు మనకు .... ఇదే DCF ఆశయం ". ఈ విధానం నచ్చిన దూదేకుల కుటుంబీకులు గ్రామగ్రామాన ఇస్తున్న ఆదరణకు సలాం చేస్తున్నాను . ... మేము వ్యక్తిగత ఉనికి , విభేదాల కోసం సమయం వృధా చేయటం లేదు ... దూదేకుల జీవితాలను వ్యవస్థాగతంగా మార్చటానికి కంకణం కట్టుకున్నాం ... దీనికోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని గర్వముగా తెలియచేస్తున్నాము .... మీ హన్ను భాయ్

18/12/2024
07/12/2024

నంద్యాల: నంద్యాల పట్టణం నందు డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వారే ఆధ్వర్యంలో 65 వ అంతర్జాతీయ వికలాంగుల వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల డాక్టర్ బాబన్ గారు, నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారు, వైస్ చైర్మన్ మారుతి కుమార్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు కుట్టు మిషన్ చంక కర్రలు కర్రలను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ గారు పంపిణీ చేశారు.

Address

Old Club Road Kothapet
Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when apnoorbashamuslimmedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share