20/06/2025
*ఇది రాజకీయం కాదు.. అరా(చ)జకీయం*
నరకండి.. చంపండి.. అన్నవాళ్ళను జగన్ వెనకేసుకుని వచ్చారా.. లేక వెటకారంగా మాట్లాడారా.. అన్న అంశాన్ని కాసేపు పక్కనబెడితే... మీరూ, మీ వాళ్ళు ఏమైనా వేమన పద్యాలు, సుమతీ శతకాలు వల్లె వేస్తున్నారా ముఖ్యమంత్రి గారూ...!?
మీరు కూడా అంతకు మించి మాట్లాడుతున్నారు కదా!
ఒకాయన కొడకల్లారా.. అంటారు!
మరొకాయన రండ్రా చూసుకుందాం అంటారు!
ఇంకొకాయన కట్ డ్రాయర్తో నడిపిస్తానంటారు!
ఇక మీరైతే ఏకంగా తాట తీస్తా.. తోక కత్తిరిస్తా.. అని బహిరంగంగా జగన్ను ఉద్ధేశించే హెచ్చరికలు జారీ చేస్తున్నారు!
ఇంకా రాసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ.. ప్రస్తుతానికి ఇవి చాలు!
మీరు, మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు జగన్ తీరును ఖండించే నైతికత లేదు కదా!!
ఈ రాష్ట్రంలో ప్రతిరోజూ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎదుటి వారిని ఎంత మాట బడితే అంత మాట అంటున్నారు. మళ్ళీ తామొక్కరిమే మంచోళ్ళన్నట్టు ఎదుటి వారి మాటలను ఖండిస్తున్నారు.
ఎవరు ఎవర్ని ఎందుకు తిడుతున్నారో అసలు అర్ధమే కావడం లేదు. ఒక సమయం, సందర్భం లేకుండానే నోరు పారేసుకుంటున్నారు.
ఇది రాజకీయం కాదు.. అరాజకీయం!