CONA NEWS

CONA NEWS Corner to Coener Complete News

21/10/2025
నేను నీకు రక్షా... నీవు నాకు రక్షా... మనం దేశానికి, ధర్మానికి రక్షా...రక్షా బంధన్ శుభాకాంక్షలు
31/08/2023

నేను నీకు రక్షా... నీవు నాకు రక్షా... మనం దేశానికి, ధర్మానికి రక్షా...

రక్షా బంధన్ శుభాకాంక్షలు

సౌజన్యం :  ఆంధ్రజ్యోతి
15/07/2016

సౌజన్యం : ఆంధ్రజ్యోతి

19/06/2016

ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకు మారే రాజకీయం..బిజెపికి సిఎం అభ్యర్ధి కరవు..వెనుకంజ వేస్తున్న ప్రియాంక, రాహుల్..... బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకునే యత్నాలు

చలసాని నరేంద్ర

దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహజంగానే ఢిల్లీ లో యేర్పడబోయే ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న ఏ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా ముందుగా ఉత్తర ప్రదేశ్ లో తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుదీర్ఘకాలం ఉత్తరప్రదేశ్ కు చెందిన వారినే ప్రధానమంత్రి పదవి వారిస్తూ వచ్చింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సహితం సాంకేతికంగా ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికైన వారె.

అందుకనే 2014లో ప్రధాన మంత్రి పదవి చేపట్టడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసిన నరేంద్ర మోడీ బిజెపి తనను లాంచనంగా ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించక ముందు నుండే ఉత్తర ప్రదేశ్ పై దృష్టి సారించారు. తనకు నమ్మకస్తుడైన అమిత్ షా ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడంతో పాటు, ఆయనను ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటింప చేసారు. మూడు దశాబ్దాల తరువాత ఒకే పార్టీకి లోక్ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన ఆధిక్యతను నరేంద్ర మోడీ సాధించడానికి ప్రధాన కారణం ఉత్తర ప్రదేశ్ లో బిజెపి గెలుచుకున్న 71 స్థానాలు అని వేరే చెప్పనవసరం లేదు.

2019లో సహితం లోక్ సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉన్నందున ముందుగా ఈ రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయ త్నించడం ఎపర్తికైనా సహజమే. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ దృష్ట్యా కీలకంగా మారాయి. ఈ మధ్య ఇదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వాటిపై కన్నా ఉత్తర ప్రదేశ్ పైననే బిజెపి తో పాటు కాంగ్రెస్ సహితం దృష్టి సారిస్తూ వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ లో ఆధిక్యత సాధించడం ద్వారా 2019 ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయాణం సాగించాలని ఈ రెండు పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రత్యర్దులుగా సమాజ్ వాద్ పార్టీ, బి యస్ పి లు ఉన్నాయి. ఈ పార్టీల అధినేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి లు సహితం ఉత్తర ప్రదేశ్ లో 50 కు తక్కువ కాకుండా లోక్ సభ స్థానాలను గెలుచుకొంటే ఇతర పార్టీల సహాయంతో ప్రధానమంత్రి పదవి చేపట్ట వచ్చని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీలకు బలమైన నాయ కులు రాష్ట్రంలో ఉండడంతో, ఆయా పార్టీల యంత్రాంగాలు సహితం బలంగా ఉన్నాయి.

అయితే బిజెపి, కాంగ్రెస్‌లకు రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేదు. పార్టీ యంత్రాంగం సహితం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ ముందుగానే మేల్కొని 2014లో నరేంద్ర మోడీ కి, 2015లో నితీష్ కుమార్ కు ఎన్నికల మ్యహకర్తగా వ్యవహరించి, వారిని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించు కొంటున్నారు. మొత్తం పార్టీ యంత్రాంగాన్ని దాదాపుగా ఆయన చేతుల్లో ఉంచారు. పార్టీలో ప్రతి కదలిక ఆయన కన్నుసన్నలలో నడుస్తున్నది.
మరో వంక, ప్రధానమంత్రికి సన్నిహితుడైన బిజెపి ప్రధాన కార్యదర్శి ఓం మాథుర్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా బిజేపి ఎన్నికల వ్యూహాన్ని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అద్యక్షుడు అమిత్ షా సహితం వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొంటున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చి న్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం యం యల్ ఏ లతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో రెండో స్థానంలో వోట్లు తెచ్చుకున్న అభ్యర్ధులను సుమారు 100 నియోజక వర్గా లకు గాను దాదాపుగా ఖరారు చేసారు.

ఈ రెండు పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలను ఆకట్టుకోగల ముఖ్యమంత్రి అభ్యర్ధి ని గుర్తించడం. బీహార్ ఎన్నికలలో బిజెపి పరాజయానికి ప్రాధాన కారణాలలో ఒక్కటి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగ ప్రకటించక పొవడం. ఆ విధంగా ప్రకటించడం ద్వారా అస్సాం లో సంచలన విజయం సాధిం చింది. గత ఎన్నికలలో ఉమా భారతిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు మరో అభ్యర్ధి కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు పార్టీలు ప్రధానంగా 13 శాతం వరకు ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ దళిత్, ముస్లిం ఓటర్లను సహితం ప్రభావిచం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటె, బిజెపి యాదవులు కాని బి సి ఓటర్లు, అగ్రవర్ణాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.
ఎన్నికలలో ప్రజలను మంత్ర ముగ్దులుగా చేయడం కోసం కాంగ్రెస్ అధ్య క్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వద్రా ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. అయితే అందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సిద్దడటం లేదు. కాంగ్రెస్ కు మిగిలిన 'తుర్ఫ్ ముక్క' ఆమె మాత్రమే అని, అవసరాన్ని బట్టి 2019 ఎన్నికలలో ఉపయో గించు కోవాలని వారు ఆలోచిస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఎన్ని కల ప్రచా రంలో ఆమెను విస్తృతంగా ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం ఆమె మూడు లోక్ సభ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. గాంధీ కుటుంభానికి బలమైన నియోజక వర్గాలుగా పేరొందిన అమేతి, రాయ బరేలి, సుల్తాన్ పూర్ లను ఆమెయే పర్యవేక్షిస్తున్నారు. కిషోర్ కు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల ప్రచారం లలో ఆయన మాటకే విలువ ఇవ్వాలని నిర్ణయిం చినా ఈ మూడు నియోజక వర్గాలలో మాత్రం ఆయనకు ప్రవేశం లేదని స్పష్టం చేసారు.

ఈ నియోజక వర్గాలలో కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను ప్రియాంక గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడ నుండే గెలుపొందుతున్నారు. ప్రియాంక ఎంపిక చేసిన వ్యక్తులే ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అందుకనే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఈ మూడు చోట్ల ఆమె అన్ని నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేసారు.

దానితో ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తీసుకు వచ్చే ఆలోచనలు చేస్తున్నారు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్య మంత్రిగా పనిచేసిన ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.
ఇక, అలహాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జరపడం ద్వారా బిజెపి పెద్ద బహిరంగ సభ జరిపి ఎన్నికల శంఖారావాన్ని మ్రోగించింది. అవినీతికి మారుపేరుగా పేరొందిన యస్ పి, బి యస్ పి లను తిరస్కరించి అభివృద్దికి అవకాశం కల్పించే విధంగా తమ పార్టీకి పట్టం కట్టాలని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తారని ఊహా గానాలు జరిగిన ఆ దిశలో పార్టీ ఒక్కడుగు కుడా ముందుకు వేయలేక పోయింది.

స్మృతి ఇరాని, రాజ్ నాధ్ సింగ్, మహేష్ శర్మ, వరుణ్ గాంధీ వంటి వార్ల పేర్లు ఈ సందర్భంగా మీడియాలో వచ్చినా ఎవ్వరూ ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి లకు సముజ్జి కాలేరని గ్రహించారు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా, పలు కులాలకు చెందిన నాయకులకు ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు అప్పచెప్పి ఆయా వర్గాల ఓట్లను ఆకట్టుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు.
అలహాబాద్ యూనివర్సిటీ లో ఆచార్యులుగా, అక్కడ నుండి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన బిజెపి అగ్ర నాయకుడు డా. మురళి మనోహర్ జోషి నగరంలోనే ఉన్నా పార్టీ కార్యవర్గ సమావేశాలకు ఆయన ను లాంచనంగా పిలవక పోవడం వివాదంగా మారింది. దానితో బిజెపి పట్ల బ్రాహ్మణ లలో అనుమానాలు తలెత్తే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఈ ప్రమాదాన్ని గుర్తించడంతో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు ఆయనను వేదికపైకి ఆహ్వానించి, ఆయన గురించి నరేంద్ర మోడీ ఘనంగా మాట్లాడారు. పైగా ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ అభ్యర్ధి కావచ్చే వార్తలను మీడియాకు అందించారు.
ఈ సంవత్సరం చివరకు కోర్ట్ లో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సుప్రేం కోర్ట్ నుండి సానుకుల తీర్పు వస్తుందని బిజెపి సీనియర్ నాయకుడు డా సుబ్రమణియన్ స్వామి ప్రకటించారు. దానితో రామ జన్మభూమి అంశంతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి మాత్రం అభివౄఎద్ధి మంత్రమే ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ విషయమై పార్టీ లోనే కొంతమేరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనను ప్రకటించేటట్లు పార్టీపై వత్తిడి తీసుకు రావడానికి వరుణ్ గాంధీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలహాబాద్ లో ప్రధాన మంత్రి తో పాటు తన నిలువెత్తు ఫోటో లతో భారే కట్ అవుట్ లను ప్రదర్శించడం ఈ సందర్భంగా పార్టీలో వివాదాస్పదంగా మారింది. అయితే ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో సన్నిహితంగా వ్యవహరి స్తున్నా రని, పార్టీ అంతర్గత అంశాలను సహితం వారికి జేరవేస్తున్నారని బిజెపి నాయకత్వం అనుమానిస్తున్నది. అందుకనే ఆయనకు ప్రాధాన్యత కల్పించడానికి సిద్దపడటం లేదు.

మరో వంక కేంద్రంలో ప్రధాన మంత్రి తరువాత రెండో స్థానంలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ రాష్ట్ర రాజకీయాలకు తిరిగి రావడానికి ఇష్ట పడటం లేదు. ఏదైనా వివాదం ఏర్పటి నరేంద్ర మోడీ రాజీనామా చేయవలసి వస్తే ప్రధానమంత్రి పదవి తనదే అన్న ధోరణిలో ఆయన ఉన్నారు. దానితో ఆయన అద్యక్షతన ఎన్నికల ప్రచార కమిటీని నీయమించె ఆలోచన బిజెపి లో సాగుతున్నది.

ఇక కైరనా లో హిందూ కుటుంభాలు రక్షణ లేని పరిస్థితులలో వలసలు వేడు తున్నాయని అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బిజెపి ఆత్మరక్షణలో పడిన్నట్లు కనిపిస్తున్నది. అస్సాంలో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారి విషయమై తీసుకున్న విధంగా ఒక సప్ష్టమైన అంశాన్ని ప్రజల ముందు ఉంచడంలో బిజెపి తప్పటడుగులు వేస్తున్నది. నరేంద్ర మోడీ బొమ్మతో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిం చడం సాధ్యం కాదని ఢిల్లీ, బీహార్ లలో స్పష్టమైనది. అస్సాం లో వలే ప్రాంతీయ అంశా లను లేవనెత్తే ప్రయత్నంలో ఏమాత్రం విజయం సాధించగలరో చూడవలసి ఉంది.
మరో వంక ఉత్తర్రపదేశ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో, మరీ ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీ కార్యకర్తల మనస్థైర్యన్ని దేబ్బతీసిన్నట్లు కాగలదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తు న్నది.

కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఉత్తర ప్రదేశ్ లో అధికారం అవస రం అనే వాదనను ఆ పార్టీ కొట్టి పారవేస్తున్నది. గత 30 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్నామనే అంశాన్ని గుర్తు చేస్తున్నది.
ఏది ఏమైనా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో అధికారం కోసం జరుగుతున్నా పోరాటంలో ఈ రెండు జాతీయ పక్షాలు మూడవ, నాల్గవ స్థానాలలోనే ఉన్నా యని చెప్పవచ్చు.

సౌజన్యం ...సూర్య దినపత్రిక

CHENNAI: One of the first signatures of Tamil Nadu chief minister J Jayalalithaa after taking oath for the sixth time wa...
23/05/2016

CHENNAI: One of the first signatures of Tamil Nadu chief minister J Jayalalithaa after taking oath for the sixth time was the one to reduce the timing of liquor shops by two hours and to close 500 Tasmac shops in the state.
Jayalalithaa on Monday signed five welfare schemes as promised in the AIADMK manifesto.
Liquor shops across the state will be opened only between 12 noon and 10pm as against 10am and 10pm at present. All Tasmac shops in the state will work only for 10 hours instead of 12 hours.
The manifesto promised to impose liquor prohibition step by step. Along with lowering the hours, 500 Tasmac shops will also be closed in the state. At present, there are 6,720 liquor shops in the state. Once 500 shops are closed, the number will come down to 6,220.
The chief minister signed an order to waive farm loans pending as of March 31, 2016. "All types of loans taken by small and medium farmers from banks, cooperative banks, loans taken on crops, short and long term loans will be waived. This will cost Rs 5,780 crore for the government's exchequer," said an official press release.
From now on, 100 units of power will be available free to all domestic consumers in the state. More than 78 lakh consumers will get first 100 units free. It will cost Rs 1,607 crore annually and the state government will pay the amount to Tamil Nadu Generation and Distribution Company (Tangedco).
As of now, the government pays Rs 3,000 crore as subsidy for domestic consumers and it will go up to Rs 4,607 crore annually. When free power is given to farmers and powerlooms, the total subsidy will become Rs 6,500 crore. The state government has to pay this amount to Tangedco.
Powerloom weavers across Tamil Nadu will now on get 750 units free power instead of 200 units at present. The cost for Tangedco will be Rs 30 crore and the government has to pay as subsidy to Tangedco.
The chief minister also signed an order to increase the free gold scheme for the marriage of poor girls from 4gms to 8gms.
As of now, 4gms of gold is given to poor girls during their marriage, along with Rs 50,000 to those who are not educated and Rs 25,000 for educated girls. The AIADMK manifesto promised to increase the gold grams from 4gms to 8gms.

PM reviews drought and water scarcity situation at high level meeting with Andhra Pradesh CMThe Prime Minister Shri Nare...
17/05/2016

PM reviews drought and water scarcity situation at high level meeting with Andhra Pradesh CM

The Prime Minister Shri Narendra Modi, today chaired a high level meeting on the drought and water scarcity situation in parts of Andhra Pradesh. The Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu, was present in the meeting. Senior officials from the Government of India, and the State of Andhra Pradesh, were also present.

An amount of Rs. 315.95 crore has been released to the State under the National Disaster Response Fund (NDRF), after adjustments of the State balances. This is in addition to Rs 330 crore released as central share of State Disaster Response Fund (SDRF) for 2015-16 to the State. A further amount of Rs. 173.25 crore has been released as first instalment of SDRF for 2016-17.

The Chief Minister described the State’s efforts in building check dams, reviving lift irrigation schemes, and deploying mobile sprinkler units (rain guns) as part of the drought mitigation effort. He mentioned the State’s progress in micro-irrigation. The State has a target of 20 lakh hectares for micro-irrigation by 2022. Global best practices and research in the field came up for discussion. Appreciating the State’s efforts in micro-irrigation, the Prime Minister directed setting up of a task force to comprehensively study the economic impact of drip irrigation in the States of Maharashtra, Andhra Pradesh and Gujarat, on various parameters such as water saving, enhanced productivity, and savings in terms of reduced input costs of fertiliser, pesticide and labour.

The Chief Minister, praising the Prime Minister for his initiatives of neem-coating of urea and the assistance of Rs. 1500 per tonne offered for compost made from municipal solid waste, stated that these will go a long way in improving soil health and checking the diversion of urea.

The Chief Minister also made a brief presentation on how the State Government is using technology to get real-time updates on water and agriculture from the field. Appreciating these innovations, the Prime Minister urged the NITI Aayog to set up a task force in consultation with the State that could come up with a model on how to use technology for crop insurance.

The meeting ended with a resolve on the part of the Centre and State to work together.

సౌజన్యం: జాగృతి వార పత్రిక
12/05/2016

సౌజన్యం: జాగృతి వార పత్రిక

జి పి ఎ 10     ...  మార్కులు...550జి పి ఎ  9.5   ...  మార్కులు...569పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.... విద్యార్ధు...
10/05/2016

జి పి ఎ 10 ... మార్కులు...550
జి పి ఎ 9.5 ... మార్కులు...569

పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.... విద్యార్ధులు , తల్లిదండ్రుల 10 జి పి ఎ రాలేదని ఆవేదన. అయితే మొత్తం మార్కులకు విద్యార్ధికి వచ్చిన జి పి ఎ ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు జి పి ఎ 10 వచ్చిన విద్యార్ధికి మార్కులు 550 వచ్చి ఉండే అవకాశముంది. అదేవిధంగా జి పి ఎ 9.5 వచ్చిన విద్యార్ధికి 569 వచ్చే అవకాశముంది. ఓ అవగాహన కోసం ఈ క్రింది పట్టికను పరిశీలించండి.

Excise Duty Benefits to Special Category States: Pros and Cons- Raghunath Babu Yadlapati   In a view to accelerate the g...
09/05/2016

Excise Duty Benefits to Special Category States: Pros and Cons-

Raghunath Babu Yadlapati

In a view to accelerate the growth and create employment in very backward and remote states, the Govt. of India has approved a new industrial policy in the North eastern region on 20.11.1997, where in certain incentives are allowed to the industries to set up there. Very important among that is 100% excise duty as well as income tax exemptions. This is for a period of 10 years up to 31.3.2007 and subsequently extended for another ten years up to 2017.

The Govt. of Jammu & Kashmir has requested a special package of Industries on the lines of North Eastern Industrial policy, on which the Govt.of India has decided to provide similar package of incentives to Jammu & Kashmir in 2002 for ten years, which has been subsequently extended to another 5 years till 2017.

The Govt. of India further provided the similar package for the states of Uttarakhand & Himachal Pradesh in the year 2003 which expired by 2013 and extended by one more year, which was expired in 2014.

All these states are very remote, hilly terrain, scarcely populated, less literacy and low per capita income with poor infra structure facilities. However the UPA government itself decided to slowly dispense with all these benefits after examining the pros and cons of the scheme. Himachal Pradesh & Uttarakhand have already been out of such benefits now. In the case of rest of the states it will be expired in the coming 2 years.

Though the main purpose of extending these benefits for creation of employment, in reality the major chunk of the benefits went on to such industries who have to pay high excise duties.

The industries are benefited at the cost of revenue losses of Govt. of India. As per an estimate the loss of excise duty and income tax is Rs.20,000 crores per year at present.

In the Lok sabha Hon’ble member Sri Veirappa moily, himself objected on the floor of house, for considering the above benefits to Andhra Pradesh as the industries in the neighbouring states such as karnataka could be closed and shifted to Andhra Pradesh.

So on the whole there will be some job loss in some states and job creation in other states. But none of the manufacturing units have passed on the excise duty benefits to consumers by way of reduction in prices.

Planning Commission of Govt. of India has got a study on Impact evaluation of package of special category states, which reveals that there is some misuse of these incentives which may also be counterproductive. Some existing business entities make book adjustments in such a way, so as to take advantage of the scheme.
The study revealed that the additional employment creation by way of this incentives is close to 3 lakhs in these 11 special category states and the loss of revenue to exchequer works out to be Rs. 4,00,000/employee/year.
High excise duty paying industries with low employment creating units only will come up in this area. Thus the loss to the exchequer will be very high compared to the employment opportunity.

It is pertinent to note that the state also has to forego their share of excise duty in the case of exemption which is considerable loss of revenues.
The interest of the state should be creation of employment but not for undue advantage of corporate and MNCs. The government support to new industries should be in such a way that it is proportionate to the employment generated instead of benefiting corporates and MNCs by way of excise duty and income tax exemptions.
Excise duty and income tax benefits to MNC companies like Unilever, Johnson&Johnson, Nestle, Coke, Pepsi, P&G, and Cadbury etc., will boost their profits, which goes out of the country also.

Special status to Andhra Pradesh...by Sri Raghunath Babu YadlapatiAndhra Pradesh was divided in a half hazard manner by ...
08/05/2016

Special status to Andhra Pradesh...
by Sri Raghunath Babu Yadlapati

Andhra Pradesh was divided in a half hazard manner by UPA government in the last session of the parliament just before election schedule in 2014, for political mileage in the newly formed state of Telangana.

The Telangana state was benefited with surplus income accruing from Hyderabad city, where as Andhra was deprived. UPA government has not given enough time to discuss the bill and related issues between the two states. Their underlying intention might be, that if BJP opposes the bill in rajya sabha, they would take advantage in Telangana stating that they wanted bifurcation but BJP is opposing bifurcation and also in the rest of the country.

At that stage when no other parties in Andhra thought of recouping the loss arising out of bifurcation, only Shri Venkaiah Naidu from BJP vehemently fought for the benefits of Andhra, though he is not a member of parliament from Andhra Pradesh. He could make then prime minister Man Mohan Singh to give a statement on the floor of the house that the special status will be accorded to the new state for 5 years.

Congress was committed for division of state way back in the year 2004, when they aligned with TRS for contesting the elections. They should have given a proper thought of problems arising out of division and making up the losses to Andhra Pradesh including special status, though they have got 10 years time from 2004 to 2014.

The Shri Narendra Modiji government in the first cabinet meeting on assuming the office has taken a decision to attach the seven mandals which are essential for smooth construction of polavaram project, which shows the concern of the union government towards AP. So many central institutions have been sanctioned to AP in a short span of time with relentless effort of Shri Venkaiah Naiduji. It is a record in the history of India that three central government projects were announced, the human resource development minister laid the foundation stones of the Indian Institute of Science Education and Research (IISER), Indian Institute of Technology (IIT) and Indian Institute of Information Technology (IIIT) on a single day in Tirupati (March 28th, 2015).

Though innumerable projects are being sanctioned to Andhra, the issue pertaining to special status remained focal point, which has become a tool in the hands of those who never thought of it. During the past few years, requests for special category status have been received from the State Governments of Bihar, Jharkhand, Odisha, Goa, Rajasthan, Andhra Pradesh, Chhattisgarh and Telangana.

The issue of Special Category Status came up at the time of approval of the Gadgil Formula at the meeting of the National Development Council (NDC) held in April, 1969.

The special category status is given based on the following parameters

1. Hilly and difficult terrain

2. Low population density and / or sizeable share of tribal population

3. Strategic locations along the borders with neighboring countries

4. Economic and infrastructural backwardness

5. Non-viable nature for state finances.

States under this category have a low resource base and are not in a position to mobilize resources for their developmental needs even though the per capita income of some of these states is relatively high. Moreover, a number of these states were constituted out of the former small Union Territories or districts of some other states, necessarily involving creation of overheads and administrative infrastructure that was out of proportion to their resource base.

Names of the State Special status and the Financial Year in which the status was granted are as followed

1. Assam, Jammu & Kashmir and Nagaland 1969-70

2. Himachal Pradesh 1970-71

3. Manipur, Meghalaya and Tripura 1971-72

4. Sikkim 1975-76

5. Arunachal Pradesh and Mizoram 1986-87

6. Uttarakhand 2001-02

Subsequently after 28 years special economic benefits were given like excise duty and income tax exemption in the year 1997 to North Eastern states. Jammu & Kashmir was given similar package in the year 2002. Uttarakhand & Himachal Pradesh were also given special package in 2003.

The Central government has formulated Industrial policies to special category states in the following years:

Name of the State to which the special status was granted, Initial period and Extension period

1. North Eastern States (1997-2007) - (2007-2017 )

2. Jammu & Kashmir ( 2002-2012) - ( 2012-2017 )

3. Uttarakhand & Himachal Pradesh (2003-2013) - ( 2013-2014 )

Now even though Uttarakhand & Himachal Pradesh are continuing with special status, the tax benefits come to an end in the year 2014. For the rest of the states within 2 years the economic benefits are going to expire. So, it is very clear that, the excise benefits are not automatically linked to special status and they being dispensed with.

The Government of late started discouraging excise duty and income tax benefits. Even in the case of Uttarakhand the special status was accorded after 2 years of its formation, though they fit in the eligibility norms prescribed for the status. But in the case of Andhra Pradesh it does not fit in any of the existing criteria mentioned earlier. As such there is necessity of change in the guidelines. In the meanwhile three developments took place:

1. The abolition of Planning commission, which was part of National Development Council (NDC), they Apex body which accords the Special status.

2. Also the Modiji government has increased the current share of states in the net collection of central tax revenue to 42% from the current 32% as per the recommendations of the 14th Finance Commission.

3. The proposal of GST bill from ensuing financial year also hangs the fate of excise duty benefits to certain states.

In such a scenario, the formation of new guidelines and accordance of special status is a time consuming process. The government is also taking in to consideration of Composite Development Index (CDI) proposed by Shri Raghuram Rajan in the year 2013 for future assessment of economic status of the states.

But however with a view to put the state on the fast track for development, the central government is taking all necessary steps so as to recoup the loss incurred during the The 14th Finance commission has estimated revenue deficit of Andhra Pradesh and Proposed Rs.24,000 crores support to make up the losses arising out of the deficit.

The thrust of Modi Government, Make in India is fast taking a shape and foreign countries like japan, china , USA etc.. are keen to invest in a big way in India of which, a substantial chunk will come to Andhra Pradesh in view of the locational advantage like 1000 km coast, railway line, 4 lane National highway, 4 airports and water way, besides AP was declared as 24 X 7 power state by central government.

వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవాలంటే.. ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్‌కండీషన్ పెట్టుకోగానే సరిపోదు. వెంటిలేషన్ సరిగ్గ...
21/04/2016

వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవాలంటే..

ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్‌కండీషన్ పెట్టుకోగానే సరిపోదు. వెంటిలేషన్ సరిగ్గా ఉందోలేదో చూసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఏసీ ఉందికదా అని తలుపులు కిటీకీలు మూతపెట్టడం లాభం లేదు. వాటిని తెరిచి ఉంచాలి ఫ్యాన్ 3 లో ఉంచి.ఎ సి 26 లో ఉంచాలి.

మంచాలు, బెడ్‌ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే వాటిని తొలగించి నేలమీద పడుకోవడమే బెటర్. చెయిర్స్, టేబుల్స్‌ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ప్రాణవాయువు కోసం పూలకుండీలను గది మధ్యలో వుంచితే మంచిది.

వేసవిలో ప్రతిరోజూ ఇంటిముందు రెండుపూటలా నీళ్లు చల్లుతూ ఉండాలి. వేసవిలో గదిని చల్లగావుంచడం కోసం ఎయిర్‌కూలర్‌ని తెచ్చి పెట్టుకోవడం మంచిది. టేబుల్‌ఫ్యాన్‌కి బదులు సీలింగ్‌ఫ్యాన్ బిగించుకోవడం ఉత్తమం. అధిక స్పీడ్‌లో ఫ్యాన్‌ని తిరగనివ్వరాదు. గదిలో బల్బ్‌ని తొలగించి ట్యూబ్‌లను బిగించుకోవాలి.

కిటికీ కర్టెన్‌ని డోర్‌కర్టెన్లని ఎప్పుడూ మూతఉంచకుండా సగంకతెరచి ఉండటం మంచిది. వాటిని అప్పుడప్పుడు నీటితో తడుపుతుండడంవల్ల గదిలో చల్లదనం చోటుచేసుకుంటుంది. వేసవిలో గదులలోపలి గోడలకి ముదురురంగు వాల్ పెయింట్‌ని వేయించడం మంచిది.

వేసవిలో ఇంటి శుభ్రత కోసం క్లోరిన్, బ్లీచింగ్, డయాక్సీన్ వంటి రసాయనాల వాడకాన్ని తగ్గించడం మంచిది. సువాసన వెదజల్లే పూలను అక్కడక్కడ వేలాడదీయండి. లేదా మంచి వాసన కలిగిన అగరొత్తులైనా వెలిగించవచ్చు.
గదిలో ఇత్తడి మరియు స్టీలు బిందెలనీ, పాత్రలని అటక ఎక్కించండి. కూజాలు కుండలు వేసవిలో చాలా మేలు చేస్తాయి. ప్రతీరోజూ చన్నీటితో ఇంటి గదులన్నింటిని కడుగుతుంటే చల్లగా, హాయిగా ఉంటుంది. వేసవిలో గదుల లోపలి గోడలకి ముదురురంగు వాల్ పెయింట్ వేయించడం మంచిది.

సౌజన్యం: జాగృతి వార పత్రిక (శ్రీ చలసాని నరేంద్ర గారు)
20/04/2016

సౌజన్యం: జాగృతి వార పత్రిక (శ్రీ చలసాని నరేంద్ర గారు)

Address

Bankstreet, Narasaraopet
Guntur
522601

Alerts

Be the first to know and let us send you an email when CONA NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share