10/07/2024
*సర్వం'రాయుడే? కోర్టు ఆర్డర్ భేఖాతార్! భీమొలు భూముల్లో కొత్త ట్విస్ట్!*
- *తిరగబడ్డ దళారులు .. జమీందార్ ని కట్టేసిన కౌలు దారులు!*
- *175 కోట్ల భీమొలు భూ కుంభకోణంలో టీడీపీకి చెందిన కోవూరు మునిసిపల్ మాజీ ఛైర్మన్, ఓ న్యాయవాధి, యమార్వో వనజాక్షి ఇతర అధికారుల పాత్ర?*
- *కంటెప్ట్ కేసులు, కోర్టు ఆర్డర్లు లెక్కచేయకుండా అమ్మేసిన భూములకు అధికారుల అండదండలు! .. వారికి వైసీపీ నాయకుల వత్తాసు?*
*గోపాలపురం, నమస్తే జనశక్తి, సోమవారం:
*యాభయి ఏళ్లుగా నడుస్తున్న భీమోలు భూముల కుంభకోణం వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తాను పోషించిన పెంపుడు కుక్కలే యజమానిపై తిరగబడ్డ చందాన .. ఇన్నేళ్లు అక్రమ కౌలుదారుల వ్యవహారంలో భీమొలు జమిందారి వారసుడు పోతిరెడ్డి సర్వారాయుడు పై సొంత సైన్యం తిరగబడింది. ఇంకా చెప్పాలంటే సొంత దివాణం లోనే కట్టేసి కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూడటంతో పాటు, భీమొలు భూముల్ని అక్రమంగా కొట్టేసి సాగు చేసుకోవాలనుకున్న మోతుబరీలను పొలాల నుంచి నేడు వెళ్లగొట్టారు. వారికి సంబందించిన ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను కూడా కౌలు రైతు, దళారీలు స్వాధీనం చేసుకున్నారు.
భీమొలు కుంభకోణంలో 34 మంది కౌలుదార్లతో పాటుగా మరో 40 మండి మద్యవర్తులు దళారులు ఆదినుంచి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏకంగా 169 ఎకరాలు ఆమ్మేసుకొన్న సర్వారాయుడు అండ్ కంపెనీ, అటు దళారులకు ఇటు తమ సొంత బినామీ కౌలుదారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో తిరగబడ్డ గ్రామస్తులు ... స్థానిక నాయకులు గండ్రోత్తు శ్రీనివాస్, ముప్పిడి ప్రసాద్, పండు, బెజవాడ మోహన్ రావు, బెజవాడ రవీంద్ర తదితరుల అధ్వర్యంలో సొంత గ్రామంలోనే సోమవారం నాడు సర్వారాయుడుని నిలదీసి దిగ్భందనం చేశారు. ఘర్షణలో భాగంగా ఆయనపై చేయి చేసుకోవడంతో ఆయన ఊరోదలి పారిపోయారు.
*అసలు భీమొలు భూముల గోలేంటి?*
యాభయి ఏళ్ల ఈ పంచాయితీని క్లుప్తీకరిస్తే - భీమొలు జమీందారు, మునసబు అయిన స్వర్గీయ మారెడ్డి జగ్గారావు తన భూముల్లోని కొంత అధనపు వ్యవసాయ భూమిని సుమారు 360 యకరాలు.. 1975లోనే ప్రభుత్వానికి ఇచ్చేశారు. సదరు భూమిని అప్పట్లోనే అదే సంవత్సరం ప్రభుత్వం బీమోలు గ్రామానికి చెందిన నిమ్నవర్గాలకు చెందిన సుమారు 112 మండి భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ పట్టాలు ఇచ్చేసింది. అప్పటినుంచి సాగులో వారుండగానే జగ్గారావు కూతురి తరపున రెండవ తరం జమిందారి వారసుడు అయిన పోతిరెడ్డి సర్వారాయుడు ఈ భూములను పట్టాదారులనుండి కొట్టేయడానికి .. కోవూరు కు చెందిన ఓ న్యాయవాది మంగిన శ్రీరామారావు, ఇంకా ఓ టీడీపీ నాయకుడు అయిన సూరపనేని చిన్ని లతో కలిసి పన్నాగం పన్నాడు. ఇంకేముంది 2005 లో మొదలైన అ'న్యాయక్రీడ కోవూరు మొదలు సుప్రీం కోర్టుదాకా అనేకానేక వాజ్యాలను, అబద్దపు సాక్షాలను మూటగట్టుకొని కానరాని న్యాయం కంటే కనిపించే నిజమైన అన్యాయమే మిన్న అన్నచందాన పట్టాదారులను బెదరించి, అధికారులను ఆదరించి, కోర్టులను మభ్యపెట్టి కొన్ని నామమాత్ర వుత్తర్వ్యులను తమకు అంటే తాము స్వయంగా తయారుచేసిన బినామీ కౌలుదారుల పేరున పొందగలిగారు.
ఇక ఈక్రమంలో వీరు చేసిన అక్రమాలు,ఫోర్జరీలు, అక్రమ డాక్యుమెంట్లు, నకిలీ బ్యాంక్ ఎకౌంట్లు వీటన్నిటిపై ఇప్పటికే కేంద్ర సంస్థలైన జాతీయ యస్సీ కమీషన్, మానవ హక్కుల సంఘం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు భాదితులు ఇప్పటికే పిర్యాదులు చేయడం జరిగిపోయి సమగ్ర విచారణల కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు.
*అసలు కోర్టు చెప్పిందేమిటి? అధికారులు చేసిందేమిటి? సీబీఐ ఏం దర్యాప్తు చేయనున్నది?*
పట్టాదారులు బినామీ కవులుదారుల మద్య న్యాయపోరాటంలో అధికారులు సూరపనేని చిన్ని, సర్వారాయుడు ఇంకా బినామీ కవుల దారుల పక్షాన నిలచి కోర్టుకు సరైన సమాచారం సకాలంలో ఇవ్వకపోవడంతో, ఎక్స్ పార్టీ దావాగా పరిగణించిన అప్పటి వున్నత న్యాయస్థానం 2017లో కవులదారుల హక్కులు పరిరక్షించాలని, సమగ్ర విచారణ చేసి వారివద్ద చట్టప్రకారం డిక్లరేషన్లు తీసుకొని కౌలు హక్కులను కల్పించాలని ఆదేశించింది. అధికారపక్షాన వున్న సూరపనేని చిన్ని ఆర్ధిక, అంగ బలానికి, బినామీలను కూడగట్టిన సర్వారాయుడు స్థానికత, వెరసి బినామీలకు ఏకరాకు రూ. రెండులక్షలు ఆశ చూపించి, సంతకాలు పెట్టించేసుకున్నారు. చకచకా వారిపేర్లతో బ్యాంక్ ఎకౌంట్లు వచ్చేశాయి. నాటి కవులుదార్లకు కొత్త వారసులమంటూ కొత్తగా వీలునామాలు ఏర్పాటు అయిపోయాయి. తయారు చేసిన ఆ 34 వీలునామా దస్త్రాల్లో దస్తూరి, దస్తకత్, సాక్ష్యులు అన్నిటికి మూలం సూరపనేని చిన్ని కార్యాలయమే వేదిక కావడం విశేషం. దీనికి రుజువు సూరపనేని చిన్ని వ్యక్తిగత కార్యదర్శి గెల్లా సురేశ్ అన్న వ్యక్తి ఒక్కడే సుమారు 25కు పైగా వున్న వీలునామాలకు దస్తూరి అందించగా, భూస్వామ్య కుట్రదారుడు అయిన సర్వారాయుడు అన్నీ వీలునామాలకు సాక్షి సంతక సహకారం చేశాడు. ప్రభుత్వం మారింది, అధికారులూ మారారు. అయినా కోట్ల రూపాయల చేతులు మారిన మహత్యమో, కొత్త ప్రజాప్రతినిధులు, సరికొత్త అధికారులు సైతం సూరపనేని చిన్ని ప్రక్కనే మళ్లీ నిలిచారు. నాటి మంత్రి, యంమ్యల్యే, కలెక్టర్, ఆర్డీవో, యంమార్వో కలిసి పన్నిన పన్నాగంలో కోర్టు వుత్తర్వ్యుల ప్రకారం ఆర్డీవో మల్లిబాబు దగ్గర డిక్లరేషన్ ఇచ్చిన కవులుదార్లు ఒక్కసారిగా యమార్వో రవీంద్రనాధ్ చొరవతో రెవెన్యూ ఆన్లైన్ రికార్డు సవరణల్లో వారసులు, కొనుగోలుదారులు వంటి దొంగ పట్టాలు నమోదు చేయించుకోగలిగారు. ఇక్కడే సరిగ్గా సమాచారం అందుకున్న పట్టాదారులు న్యాయస్తానాన్ని ఆశ్రయించడంతో ఆశ్చర్యకరమనిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగ పత్రాలు తయారు చేసిన కౌలుదారులు 169 ఎకరాలు కోర్టు వుత్తర్వ్యులను సైతం వుల్లంఘించి ఎలా అమ్ముకోగలిగారన్న కోణంలో ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఇక్కడే మొదలు కానుంది.
*అసలు కౌలుదారులు భూములేలా అమ్ముతారు?*
- *సర్వారాయుడు అండ్ కంపెనీ చేసిన ఇరవైకోట్ల అక్రమ లావాదేవీలపై ఈడీ ఆరా?*
- *నిషేదిత భూముల చిట్టాలో న్యాయస్థానం పెట్టమంటే అధికారుల అండదండలతో 169 ఎకరాలు అమ్మేసిన మాఫియాయ?*
సూరపనేని చిన్ని, న్యాయవాది రామారావు, భూస్వామి సర్వారాయుడి కుట్రలు పసిగట్టిన కొందరు అసలు విషయాన్ని ఉన్నత న్యాయస్థాన దృష్టికి తీసుకొని వెళ్ళగా .. ఈ సంవత్సరం మార్చి 12వ తేదీన సదరు భూమిలోని అన్నీ సర్వే నంబర్లను ఉదహరిస్తూ మొత్తం విస్తీర్ణం 360 యకరాలను నిషేదిత భూముల జాబితాలో చేర్చాలని కేసు నంబర్ 6289 ఆఫ్ 2024 ద్వారా ఉత్తర్వ్యూలు ఇచ్చింది. బరితెగించిన ల్యాండ్ మాఫియా సదరు గోపాలాపురం యంమార్వో, కోరుకొండ, కొవ్వూరు, వేగేశ్వరపురం సబ్ రిజిస్ట్రార్లను రాత్రి రాత్రే కొనేశారు. అసలు పట్టాదారు పాసుపుస్తకాలే లేని భూముల్ని, కోర్టు ఉత్తర్వ్యులను ఉల్లంఘించి మరీ ఒకే రోజు మూడు రిజిస్ట్రర్ ఆఫీసుల్లో రూ.20 కోట్ల పైచిలుకు లావాదేవీలు నేరపేశారు. లెక్కప్రకారం కౌలుదారుల బ్యాంక్ ఎకౌంట్ల లోకి డబ్బులొచ్చాయి. వీళ్ళు సంతకాలు పెట్టేశారు. కానీ డబ్బులన్నీ ముందుగానే కౌలుదార్ల వద్దనుంచి తీసేసుకున్న చెక్కులు, పాసు పుస్తకాల ద్వారా సర్వారాయుడే బ్యాంకుల నుంచి డ్రా చేసేసి సదరు లాయరు, సురపనేని చిన్నిలకు పంచేశాడన్నదే గ్రామస్తుల ఆగ్రహానికి కారణం. ఇన్నేళ్లుగా తమ పేర్లమీద కోర్టు కేసులు, పోలీసు వ్యవహారాలు నెరపీ .. తీరా సొమ్ము చేతికొచ్చాక సర్వారాయుడు తమను అన్యాయం చేశాడన్న బినామీ కౌలు దారులు, వారితో సయోధ్య కుదిర్చిన దళారులు. ఈ నేపద్యంలో కొందరు ఈ పాటికే డిల్లీలోని ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేసినట్లు సమాచారం.
*ఆదాయపు పన్ను దర్యాప్తుతో బినామీ కౌలుదారులందరూ జైలుకేనా?*
అసలు కౌలు హక్కుదారులుగా న్యాయస్థానం ఆదేశాలతో ఏదో విదంగా సాగులో కొనసాగుతున్న కౌలుదారులను పావుగా వాడేసుకున్న సర్వారాయుడు వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అక్రమంగా అమ్మేసిన కోట్ల రూపాయల సొమ్ము మొత్తం బ్యాంకుల నుండి ఆరోజే తీసేసుకునట్లు తెలుసుకున్న కౌలుదారులు, వారి దళారీలు ఇప్పుడు భయపడుతున్నారు. కారణం ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఈ విషయం పై దర్యాప్తు మొదలెట్టిందని అనుకుంటున్న బినామీ కవులుదారులు వణికిపోతున్నారు. ఆ భయంతోనే సర్వారాయుడిని వీళ్ళు నిలదీసినట్లుగా సమాచారం. మలిపర్వం.. మరింత విపులంగా.. మీ జనశక్తిలో.? త్వరలో