
05/08/2023
తెలంగాణ వ్యాప్తంగా గత వారంలో కురిసిన అకాల వర్షాలతో పీర్జాదిగూడ పట్టణ పరిధిలోని స్థానిక 16వ డివిజన్లోని ఆర్టీసీ కాలనీ, విష్ణుపురి ఎంక్లేవ్, శ్రీపాద ఎంక్లేవ్ ,కాలనీలలోకి వర్షపు నీరు చేరి ముంపుకు గురి కావడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆయా కాలనీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,కార్యదర్శులు కొందరు స్థానికులు
16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బండి రమ్య సతీష్ గౌడ్ మరియు స్థానిక సీనియర్ నాయకులు బండి సతీష్ గౌడ్ గార్లతో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో గౌరవ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి, D.E. A.E గార్లను కలసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ సమస్యపై సమీక్ష నిర్వహించి గతంలో కార్పొరేటర్ చొరవతో కేటాయించిన 20 లక్షల నిధులు సరిపోకపోవడంతో అదనంగా 20 లేదా 30 లక్షల వ్యయం అయినప్పటికీఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని గౌరవ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ త్వరితగతిన కార్యరూపం దాల్చి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు మేయర్ మరియు స్థానిక కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు