17/08/2025
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిప్ చెడ్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం చాముండేశ్వరి దేవాలయం వద్ద గల మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువన మహారాష్ట్ర కర్ణాటక రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షలతో పాటు రాష్టంలొ కురుస్తున్న వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్ట్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. దీనితో సింగూర్ ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసారు.. శ్రావణమాసం అందులో ఆదివారం సెలవు దినం కావడంతో చాముండేశ్వరి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. ఉదయం నీటి ప్రవాహం తక్కువే ఉన్న మధ్యాహ్నం సమయానికి భారీగా నీటి ప్రవాహం పెరిగి నదిపై ఉన్న పాత వంతెన పూర్తిగా మునిగి పోవడంతో అప్రమత్తం అయ్యిన చిలిప్ చెడ్ పోలీస్ యంత్రాంగం ఆలయ అధికారులతో పాటు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. నది ప్రవాహం వైపు పర్యాటకలను ఎవ్వరిని కూడా వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు నది ప్రవాహాన్ని వీక్షించడానికి వచ్చిన సందర్శకులు ఫొటోలు దిగుతూ వీడియోలు తీస్తూ ఉండడంతో మంజీరా నదిపై ఉన్న వంతెనపై రద్దీ ఏర్పడింది. నదిలో నీటి బుంగ పేరుకుపోతుందడంతో అధికారులు స్పందించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తెలియజేసారు. మరిన్ని వివరాలు కెమెరామెన్ సుభాష్ తో మా ntodaynews నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి లక్ష్మి ప్రసాద్ తెలియచేస్తారు.