15/09/2025
తేదీ: 15.09.2025
*అన్నమయ్య జిల్లా*
*అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు..*
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ బదిలీలలో భాగంగా, ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించారు..
👉బాధ్యతలు స్వీకరించే సందర్భంగా..
ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు.
🎙 మీడియా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ..
"అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను" అన్నారు.
ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు, డిజిపి గారు, కర్నూల్ రేంజ్ డీఐజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన ప్రాధాన్యతలు:
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి.
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారిస్తాం..
చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై గట్టి నిఘా ఏర్పాటు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తాం. పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు గట్టి చర్యలు & ప్రజలకు అవగాహన కార్యక్రమాలు.
మాదకద్రవ్యాల నివారణ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తాం. డిజిటల్ అరెస్టులు, ఆధార్, క్రెడిట్ కార్డ్ మోసాలపై పెద్ద ఎత్తున ప్రచారం.
కళాశాలలు, పాఠశాలల్లో శక్తి టీమ్స్, మహిళా పోలీసులు, మీడియా సహకారంతో సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన.
ప్రజలు & మీడియా సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం.
👮♂️ పోలీసు అధికారులకు సూచనలు..
జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం.
నేర నియంత్రణలో గట్టి చర్యలు తీసుకోవాలని దిశానిర్ధేశం. ప్రజల నమ్మకం పొందేలా ప్రజా-పోలీసు స్నేహ సంబంధాలు పెంపు.
📌 ఎస్పీ గారి ప్రత్యేక సందేశం..
ప్రజలందరూ భయరహితంగా జీవించేలా చూడటం పోలీసు శాఖ ధ్యేయం.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికత వినియోగం.
మహిళా భద్రతకు ప్రాధాన్యత – ‘శక్తి టీమ్స్’ బలోపేతం.
పోలీసు సిబ్బంది సంక్షేమం, శిక్షణ, వృత్తి అభివృద్ధికి కృషి.
“ప్రజల భాగస్వామ్యంతోనే నేర రహిత సమాజం సాధ్యం” అని ఎస్పీ గారు స్పష్టం.
👉ఎస్పీ గారి నేపథ్యం ఇలా ఉంది..
2020 బ్యాచ్ లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. 2021లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. వీరి తల్లి పార్వతి (గృహిణి) తండ్రి కె. వెంకటరమణ గారు అడిషనల్ ఎస్పీ గా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్ గా ఎంపికైనప్పటికీ తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఐపీఎస్ గా కొనసాగుతున్నారు. నేడు అన్నమయ్య జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు.
🌸స్వాగతం - సుస్వాగతం🌸
జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, రాజంపేట ఏఎస్పీ శ్రీ. మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ గారు, మదనపల్లి డిఎస్పీ ఎస్.మహేంద్ర గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఏఆర్ డిఎస్పీ యం. శ్రీనివాసులు గారు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్ఐ లు, ఆర్‌ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది కొత్త ఎస్పీ గారిని కలసి మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
👇
అన్నమయ్య పోలీస్