
21/02/2023
Journalist Swapna remarried & flew to USA?
47ఏళ్ల వయస్సులో మళ్ళీ పెళ్లి చేసుకున్న యాంకర్ స్వప్న..!
టీవీ ఎక్కువగా చూసేవాళ్ళకి.. అదీ న్యూస్ ఛానల్స్ ఎక్కువగా చూసేవాళ్ళకి యాంకర్ స్వప్న ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని టీవీ షోలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా ఈమె కనిపించింది. హైదరాబాద్ కు చెందిన స్వప్న.. ఎఫ్.ఎం.రేడియో ప్రెజెంటర్ గా వర్క్ చేసింది. అటు తర్వాత దూరదర్శన్ లో పనిచేసింది. కొంతకాలం తర్వాత టీవీ9లో చేరి బాగా పాపులర్ అయ్యింది.
అక్కడ 10 ఏళ్ళ వరకు పని చేసింది. ఆ తర్వాత సాక్షి, 10 టీవీ వంటి వాటిలో కూడా పనిచేసింది.ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందట. అందుకోసం ఈమె అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించలేదు. ఆమె సన్నిహితులు కూడా ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కానీ టాక్ మాత్రం బలంగా జరుగుతుంది. ఈమె వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు.గతంలో ఈమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా ఆమె సింగిల్ గానే జీవిస్తూ వస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అది మార్ఫింగ్ అంటూ ఆమె స్నేహితులు కొట్టిపారేస్తున్నారు. స్వప్న స్వయంగా ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలు ఆగేలా లేవు.