07/01/2026
నేషనల్ పీజీ కాలేజీ, నంద్యాల లో హజ్ ట్రైనింగ్ క్లాసెస్ను ప్రెసిడెంట్ ఆఫ్ హజ్ సొసైటీ, నంద్యాల – డా. ఎస్. ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫరూక్ సాహెబ్ గారు, గౌరవ అతిథిగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా గారు హాజరయ్యారు.
అలాగే రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనాబ్ గౌస్ పీర్ గారు, డైరెక్టర్ జనాబ్ మన్సూర్ అలీ గారు, డి.ఎం.డబ్ల్యూ.ఓ. శ్రీమతి సబీహ పర్వీన్ గారు, హజ్ ట్రైనర్ మౌలానా అల్హాజ్ డా. ఖాజి అబ్దుల్ మస్జిద్ గారు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎన్.ఎం.డి. ఫయాజ్ గారు, ఎన్.ఎం.డి. ఫిరోజ్ గారు తదితరులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.