
19/05/2023
నిత్య జనగణమన కార్యక్రమం వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటూ మున్ముందుకు సాగుతోంది. నేటి కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు నల్లకుంట కార్పొరేటర్ వై అమృత, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, నిజామాబాద్ బీజేపీ పార్లమెంటరీ ప్రబారి వెంకటరమణి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆనంద్ గౌడ్, బీజేపీ అంబర్పేట్ నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్ రాజ్, సీనియర్ నాయకులు మర్రి మురళి, సురేష్ యాదవ్, మహేందర్, నల్లకుంట బీజేపీ అధ్యక్షుడు రమణ నాయుడు, నల్లకుంట ఓబీసీ మోర్చా సెక్రటరీ రాఘవేందర్ గౌడ్, నాయకులు ఎంబీ కిషోర్, సంధ్యారాణి, బాబు, మహేందర్, ధర్మేంద్ర, యాదగిరి, వీరయ్య గౌడ్, సురేష్ యాదవ్ తదితరులు కూడా వచ్చారు.
ముందుగా భారతమాత ఫోటోకు వందనం చేసిన లక్ష్మణ్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సంవత్సరం పాటు నిత్యం జాతీయ జెండాను ఎగురవేయడం అభినందనీయం అని అన్నారు. జాతీయ జెండా నీడన మనందరం సుఖశాంతులతో జీవిస్తున్నామని చెప్పారు. ఈ పతాక స్ఫూర్తితోనే భారత్ విశ్వ గురువుగా వెలుగొందుతుంది అని పేర్కొన్నారు. అంతటి విశిష్టత కలిగి ఉన్న మన జెండాను ఇక్కడ ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆవిష్కరిస్తుండడం శ్లాఘనీయమన్నారు. జాతీయ జెండా స్ఫూర్తిని, సేవా భావాన్ని వ్యాపింప చేయడానికి కృషి చేస్తున్న వందే ప్రజ, లీడర్స్ ఫర్ సేవ సంస్థలను, ఆ సంస్థల సభ్యులకు ఈ సందర్భంగా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వందే ప్రజా శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. లీడర్స్ ఫర్ సేవ ఆర్గనైజెషన్ సభ్యులు నేలంటి మధు, మల్లాడి క్రాంతి, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, ప్రసాద్ దూబే, వందే ప్రజ ప్రెసిడెంట్ ఏం కే శ్రీనివాస్, అడ్వకేట్ అరవింద్ రాజ్ నవీన్, విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.