
21/05/2025
అప్పన్న ప్రధానార్చకుడు మృతి
రమణాచార్యులకు ఘనంగా నివాళులు
సింహాచలం...
శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ ప్రధానార్చకుడు (2) ఇరగవరపు రమణాచార్యులు (58) గుండెపోటుతో మరణించారు.రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సింహాచలలేశుని పూజాది కైంకర్యాలలో విశేష సేవలందించిన రమణాచార్యులు అకాల మరణం పట్ల సింహాచలం దేవస్థానం ఉద్యోగులతో పాటు గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 98 వార్డు పద్మావతి నగర్ లో నివాసముంటున్న రమణాచార్యుల ఇంటికి వెళ్ళి ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సింహాద్రినాథుడు కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని పలువురు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈయనకి భార్య కుమార్తె,కుమారుడు ఉన్నారు. రమణాచార్యుల మరణం తీరని లోటని ఆలయ వైదిక పెద్దలు, అధికారులు నివాళులర్పించారు. సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో లు ఎన్ ఆనంద్ కుమార్, పిల్లా శ్రీనివాస్, మాజీ దర్మ కర్తలు గంట్ల శ్రీను బాబు, సూరిబాబు, కప్ప స్తంభము నాయుడు, ప్రసాద్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. రమణాచార్యులు సేవలు వీరు కొనియాడారు.
అడవివరం స్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు..