EPO News

EPO News Watch News, Environment News, Politics, Education, Sports, Cultural News..

06/07/2024
ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ - పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ | Minister Konda Surekha Don't use pla...
16/01/2024

ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ - పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ | Minister Konda Surekha
Don't use plastic bottles... This is my Request - Minister Konda Surekha

ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ - పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ | Minister Konda Surekha 't use plastic bottles... This is my Requ...

*నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి : మంత్రి కొండా సురేఖ*భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అం...
14/01/2024

*నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి : మంత్రి కొండా సురేఖ*

భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి అన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపు నిచ్చారు. తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు, నివాసంలోనూ వీలైనంతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Telangana CMO
Anumula Revanth Reddy
Hi Hyderabad

ట్రాన్స్‌లొకేషన్‌.. చెట్లకు పునర్జీవంరహదారి పనుల్లో తొలగించిన చెట్లుమరోచోట నాటడడంతో పునర్జీవంఅధికారుల శ్రమకు దక్కిన ఫలిత...
21/12/2023

ట్రాన్స్‌లొకేషన్‌.. చెట్లకు పునర్జీవం

రహదారి పనుల్లో తొలగించిన చెట్లు

మరోచోట నాటడడంతో పునర్జీవం

అధికారుల శ్రమకు దక్కిన ఫలితం

ఏపుగా పెరిగిన చెట్లు

రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్‌ పద్ధతిలో ఇతర ప్రాంతాల్లో నాటి వాటిని సంరక్షించారు. దీంతో ఆ వృక్షాలు మళ్లీ ఏపుగా పెరిగాయి. నిజాంసాగర్‌, జుక్కల్‌ మండలాల్లో మొత్తం 107 చెట్లను ఈ పద్ధతిలో తిరిగి నాటగా 70 వరకు చెట్లు బతికి ఏపుగా పెరిగాయి. అటవీశాఖ అధికారులు తీసుకున్న చొరవకు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు.

చెట్లకు జీవం..

నిజాంసాగర్‌, జుక్కల్‌ మండలంలో మొత్తం 107 చెట్లను ట్రాన్స్‌లోకేషన్‌ పద్ధతిలో నాటగా వాటిలో సుమారు 70 వరకు చెట్లు బతికి ఏపుగా పెరిగాయి. అటవీశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో మంచి విజయాన్ని సాధించారంటూఉన్నతాధికారులు సైతం సిబ్బందిని అభినందిస్తున్నారు. నాటిన చెట్లను చక్కగా సరంక్షించడంతోనే ఈ రోజు ఏపుగా పెరిగాయి సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనులు మూడేండ్ల కిందట ప్రారంభించారు. పనులు చేసే క్రమంలో పిట్లం రేంజ్‌ పరిధిలో భారీ చెట్లను తొలగించాల్సి వచ్చింది. దీంతో అటవీ శాఖ అధికారులు తొలగించిన చెట్లను (ట్రాన్స్‌లొకేషన్‌ పద్ధతిలో) భారీ క్రేన్ల సహాయంతో ఇతర చోట్ల నాటారు. ట్రాన్స్‌ లొకేషన్‌ అంటే చెట్లకు ఉన్న కొమ్మలను తొలగించి వేర్లతో సహా వెలికితీసి మరోచోట నాటడం. మూడేండ్ల క్రితం ఈ పద్ధతిలో నాటడంతో అవి భారీ వృక్షాలుగా మారాయి.

పలు రకాల చెట్లను నాటారు

2019 సంవత్సరంలో భారీ వృక్షాలను రహదారి విస్తరణలో తీసేయాల్సి వచ్చింది. దీంతో రహదారి విస్తరణ చేసే సంస్థ అటవీ శాఖ అధికారులతో కలిసి మరో చోట నాటారు. నిజాంసాగర్‌ మండల పరిధిలో 92 చెట్లను తొలగించారు. ఆ సమయంలో రేంజ్‌ అధికారి సంజయ్‌గౌడ్‌, బీట్‌ అధికారి సిద్ధార్థ పర్యవేక్షణలో 46 చెట్లను మంగ్లూర్‌ అటవీ ప్రాంతంలో, 46 చెట్లను ఒడ్డెపల్లి శివారులో ట్రాన్స్‌లోకేషన్‌ పద్ధతిలో నాటారు. జుక్కల్‌ మండల శివారులో సైతం 15 చెట్లను తొలగించగా వాటిని శేఖాపూర్‌ శివారులో నాటారు. వాటిలో మర్రి, రావి, వేప, నెమలినార, నర్సింగ్‌, సోమ, ఇప్ప, మొర్రితో పాటు పలు రకాల చెట్లు ఉన్నాయి.

సంతోషంగా ఉంది

రహదారి విస్తరణ సమయంలో రహదారి పనులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించిన సమయంలో వాటిని ట్రాన్స్‌లొకేషన్‌ ద్వారా మరో చోట నాటడంతో వాటిలో చాలా వరకు చెట్లు బతికి ప్రస్తుతం చక్కగా ఏపుగా పెరిగాయి. నాటిన చెట్లలో మర్రి, మేడి, రావి, జువ్వి వంటి చెట్లు వంద శాతం బతికాయి. వేప ఒక్కటి మాత్రమే అంతగా బతకలేకపోయాయి. నాటిన చెట్లను చక్కగా సంరక్షించడంతోనే విజయం సాధ్యమైంది.

– సంజయ్‌గౌడ్‌, రేంజ్‌ అధికారి

https://youtube.com/shorts/woUuk_TwcSo?feature=shareఅధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లే దొంగలు మా పార్టీలోకి వద్దు : జడ్చర్...
13/12/2023

https://youtube.com/shorts/woUuk_TwcSo?feature=share
అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లే దొంగలు మా పార్టీలోకి వద్దు : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లే దొంగలు మా పార్టీలోకి వద్దు : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిఏ పార్టి అధికారం...

https://youtube.com/shorts/wR1cjyPbDbk?feature=shareఅధైర్య పడకండి.. భవిష్యత్ మనదే.. : హరీష్ రావు I Motivational Speech H...
13/12/2023

https://youtube.com/shorts/wR1cjyPbDbk?feature=share
అధైర్య పడకండి.. భవిష్యత్ మనదే.. : హరీష్ రావు I Motivational Speech Harish Rao

అధైర్య పడకండి.. భవిష్యత్ మనదే.. : హరీష్ రావు I Motivational Speech Harish Rao , #...

Address

Hyd
Hyderabad
500059

Alerts

Be the first to know and let us send you an email when EPO News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to EPO News:

Share