Mirrortv

Mirrortv Mirror TV is the most raising and popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. We cover Telugu Live news and related updates.

We give 24 Hours live news covering political news, sports news, entertainment news, comedy Telugu web serie

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి రోజు నమోదైన నామినేషన్ల వివరాల
27/11/2025

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి రోజు నమోదైన నామినేషన్ల వివరాల

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రిసెప్షన్ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్, హరీష్ రావు
27/11/2025

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రిసెప్షన్ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్, హరీష్ రావు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిలా ప్రాంతంలో లివి కేఫ్ అండ్ కిచెన్ రెస్టారంట్‌ను ప్రారంభించిన కేటీఆర్, హరీష్ రావ...
27/11/2025

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిలా ప్రాంతంలో లివి కేఫ్ అండ్ కిచెన్ రెస్టారంట్‌ను ప్రారంభించిన కేటీఆర్, హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్సిగాచి ఫార్మా ప్రమాదంలో 54 మంది చనిపోయారని గుర్తుందా? అంత పెద్ద ఘటనపై ఇంత ...
27/11/2025

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్

సిగాచి ఫార్మా ప్రమాదంలో 54 మంది చనిపోయారని గుర్తుందా? అంత పెద్ద ఘటనపై ఇంత నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తారా?

ప్రమాదం జరిగి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పడం ఏంటి?

237 మంది సాక్ష్యాలను విచారించిన బాధ్యులెవరో నిర్ధారించలేకపోతున్నారా?

పేలుడు ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయలేరా?

తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశిస్తూ, ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

రాష్ట్ర గవర్నర్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ కాళోజీ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే హై లెవెల్ కమిటీ వేసి విచారణ జర...
27/11/2025

రాష్ట్ర గవర్నర్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

కాళోజీ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే హై లెవెల్ కమిటీ వేసి విచారణ జరపాలని కోరిన హరీష్ రావు

ఇటీవల పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు ఎలా పాస్ అయ్యారని, పాస్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ కాలేజ్ వాళ్లే అవ్వడం అనుమానాలకు దారి తీస్తుంది

ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులను పాస్ చేసేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు

ఫెయిల్ అయిన విద్యార్థులకు సమాధాన పత్రాలు ఇచ్చి వారితో మళ్లీ పరీక్ష రాయించారని విద్యార్థులు చెప్తున్నారు, అసలు ఆ అధికారం వైస్ ఛాన్సలర్‌కు ఎవరిచ్చారు?

పీజీ పరీక్షల్లోనే కాకుండా ఎంబీబీఎస్ పరీక్షల్లో కూడా అవకతవకలు జరిగాయని, సర్వర్ మార్పులు, రీవాల్యుయేషన్ పేరిట అనేక అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్ధులు చెబుతున్నారు

ప్రతిష్టాత్మక కాళోజీ యూనివర్సిటీలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

ఈ అవినీతిపై వెంటనే హై లెవెల్ కమిటీ నియమించి విచారణ జరపాలని, వైస్ ఛాన్సలర్‌కు సహకరించిన కాంగ్రెస్ నాయకులు ఎవరు అనేది బయటపెట్టాలని గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

27/11/2025

నల్ల చెరువు హైడ్రా బాధితుల ఆవేదన

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి మా ఇండ్లను కూలగొట్టారు..మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడు

రోడ్లు వేసారు, డ్రైనేజీలు వేసారు, టాక్స్‌లు కట్టించుకున్నారు..ఇప్పుడు మా ఇండ్లు కూలగొడుతున్నారు

రంగనాధ్ దళితులను మోసం చేయను, దళితులకు అండగా ఉంటానని చెప్పి మోసం చేసిండు..చెప్పేది ఒకటి చేసేది ఒకటి

మంత్రులు, ముఖ్యమంత్రుల ఇండ్లు కూల్చడానికి హైడ్రా పనికిరాదు..పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా ముందు ఉంటుంది

బిగ్ బ్రేకింగ్ న్యూస్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరు అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాల్సి వస్తుందిబతుకమ్మ కుంట వివ...
27/11/2025

బిగ్ బ్రేకింగ్ న్యూస్

కోర్టులో ప్రత్యక్షంగా హాజరు అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాల్సి వస్తుంది

బతుకమ్మ కుంట వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్‌ను హెచ్చరించిన తెలంగాణ హైకోర్టు

27/11/2025

సర్పంచ్ ఎన్నికలు అవ్వగానే మన పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్ ఉంటుంది

మెంబర్ షిప్ డ్రైవ్ అవ్వగానే కమిటీలు వేసి, యువజన విభాగం, మహిళా విభాగంతో అన్ని కమిటీలు నిర్మిస్తాము

పార్టీ కోసం కష్టపడిన వారికే అధ్యక్ష పదవులు ఇవ్వాలని కేసీఆర్ గారు నిర్ణయించారు

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

27/11/2025

కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ వచ్చేదా?

నవంబర్ 29 లేకపోతే, డిసెంబర్ 9 ప్రకటన లేదు, జూన్ 2వ తేదీన రాష్ట్రం ఏర్పడేది కాదు

అమరుల త్యాగాలు, కేసీఆర్ ఉద్యమాలు లేకపోతే తెలంగాణ వచ్చేదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా..ఎక్కడో తెలుగుదేశంలో చంద్రబాబు సంకలో ఉండేటోడు

అంత గొప్ప రోజును దీక్షా దివస్ పేరిట ఘనంగా నిర్వహించాలి

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

27/11/2025

పేదల ఇండ్ల మీద విరుచుకుపడుతున్న హైడ్రా..!!

కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రాంతంలోని ప్రకాష్ నగర్ కాలనీలో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా

హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన స్థానికులు

శభాష్ పోలీస్ అన్న..!! ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన వ్యక్తిని..సమయానికి స్పందించి కాపాడిన హైదరాబాద్ పోలీసులువనస్థలి...
27/11/2025

శభాష్ పోలీస్ అన్న..!!

ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన వ్యక్తిని..సమయానికి స్పందించి కాపాడిన హైదరాబాద్ పోలీసులు

వనస్థలిపురం పరిధిలోని స్నేహపురి కాలనీలో, 6వ అంతస్తు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి

వెంటనే సమాచారం అందుకొని, ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని బుజ్జగించే ప్రయత్నం చేసిన పోలీసులు

ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వ్యక్తిని కిందకి దించిన పోలీసులు

పోలీసులు సమయానికి స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడారని ప్రశంసిస్తున్న స్థానికులు

27/11/2025

పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలు..!!

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన జగదీష్ రెడ్డి

అసలు మా దిష్టి వాళ్ళకి తాకడం కాదు..ఇన్నెండ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకింది

మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

Address

Hitech City
Hyderabad
500073

Alerts

Be the first to know and let us send you an email when Mirrortv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share