Vartali Spiritual Talks

Vartali Spiritual Talks శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
Vartali Spiritual

ప్రదోష కాల రోజు చదువుకొనే *శ్రీమాత అనుగ్రహం రాజశ్యామల అమ్మవారి  నవరాత్రుల లో పారాయణం చేసుకోవాల్సిన స్తోత్రం నామావళి**శ్ర...
21/01/2026

ప్రదోష కాల రోజు చదువుకొనే *శ్రీమాత అనుగ్రహం రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల లో పారాయణం చేసుకోవాల్సిన స్తోత్రం నామావళి*

*శ్రీ అగస్త్య మహర్షి ప్రోక్త శ్రీ శ్యామలా స్తోత్రం*

*ధ్యానo*
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్ |
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి ||

*స్తోత్రం*
నమో దేవి మాతంగి మాతంగి కాంతే
నమో దేవి మాతంగి మాణిక్య హస్తే |
నమో దేవి మాతంగి తుంగస్తనాఢ్యే
నమో దేవి మాతంగి తుంగే ప్రసన్నే || 1 ||

నమో దేవి మాతంగి మంత్రాత్మికే త్వం
నమో దేవి మాతంగి శబ్దాత్మికే త్వం |
నమో దేవి మాతంగి నాదాత్మికే త్వం
నమో దేవి మాతంగి సర్వాత్మికే త్వం || 2 ||

నమో దేవి మాతంగి వీణాధరే త్వం
నమో దేవి మాతంగి వేదప్రుతే త్వం |
నమో దేవి మాతంగి తాంబూలవక్త్రే
నమో దేవి మాతంగి పద్మాసనస్థే || 3 ||

నమో దేవి మాతంగి సౌభాగ్యదే త్వం
నమో దేవి మాతంగి కల్యాణదే త్వం |
నమో దేవి మాతంగి ఐశ్వర్యదే త్వం
నమో దేవి మాతంగి ఆరోగ్యాదే త్వం || 4 ||

నమో దేవి మాతంగి సౌభాగ్యదే త్వం
నమో దేవి మాతంగి కల్యాణదే త్వం ।
నమో దేవి మాతంగి ఐశ్వర్యదే త్వం
నమో దేవి మాతంగి ఆరోగ్యాదే త్వం ॥ 5 ॥

నమో దేవి మాతంగి మాతంగపుత్రి
నమో దేవి మాతంగి కారుణ్యనేత్రి ।
నమో దేవి మాతంగి కామప్రదాత్రి
నమో దేవి మాతంగి మాయావిత్రి ॥ 6 ॥

నమో దేవి మాతంగి సంసారహంత్రి
నమో దేవి మాతంగి సంతోషకర్త్రి ।
నమో దేవి మాతంగి సమ్మోహని త్వం

నమో దేవి మాతంగి సన్మంగళే త్వం ॥ 7 ॥
నమో దేవి మాతంగి సిద్ధాశ్రితా త్వం
నమో దేవి మాతంగి సర్వజ్ఞరూపే ।
నమో దేవి మాతంగి నీలోత్పలాంగి
నమో దేవి మాతంగి భూపాల పూజ్యే ॥ 8 ॥

ఫలశ్రుతి:
ఇదం తు మాతంగి మాతః స్తోత్రం సర్వార్థ సాధకమ్
యః పఠేత్ సతతం భక్త్యా తస్య సిద్ధ్యంతి వాంఛితమ్ ॥
రాజానో వశ్యతాం యాంతి సభాసు విజయో భవేత్
దారిద్ర్యం విలయం యాతి సర్వత్ర సుఖమాప్నుయాత్ ॥
ఇదం ప్రోక్తం మహర్షిణా అగస్త్యేన మహాత్మనా |
యః పఠేత్ సతతం భక్త్యా తస్య సిధ్యంతి వాంఛితమ్ ||

*స్తోత్ర పారాయణ ఫలం*
*మంత్ర శక్తి
ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, ఇందులో మాతంగీ మంత్ర బీజాల శక్తి దాగి ఉంటుంది.

*అధికార ప్రాప్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని కోరుకునే వారు, రాజకీయాల్లో ఉండేవారు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది.

*సౌభాగ్యం
స్త్రీలు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్మకం.
**************************************** *శ్రీ శ్యామలా అష్టోత్తర శతనామావళి*

ఓం శ్యామలాయై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం సచివేశ్వర్యై నమః
ఓం శుకప్రియాయై నమః
ఓం వీణాహస్తాయై నమః
ఓం నాదమయాయై నమః
ఓం సంగీతజ్ఞాయై నమః
ఓం మనోహరాయై నమః
ఓం కోమలాంగ్యై నమః
ఓం శ్యామవర్ణాయై నమః
ఓం మదాలసాయై నమః
ఓం కళాధరాయై నమః
ఓం కవిప్రియాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం కదంబవనవాసిన్యై నమః
ఓం రత్నసింహాసనస్థితాయై నమః
ఓం మాణిక్యవీణాధారిణ్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వశక్త్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం చంద్రశేఖరాయై నమః

ఓం జగన్మాత్రే నమః
ఓం సత్యరూపిణ్యై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం తత్వరూపాయై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం కరుణాసాగరాయై నమః
ఓం దేవీప్రబోధిన్యై నమః
ఓం గానలోలాయై నమః
ఓం సుభాషిణ్యై నమః
ఓం రత్నక్రీడాయై నమః
ఓం విద్యాధారిణ్యై నమః
ఓం వాక్ప్రదాయిన్యై నమః
ఓం చిద్రూపిణ్యై నమః
ఓం సన్మంగళాయై నమః
ఓం రాజమాతంగ్యై నమః
ఓం శుకహస్తాయై నమః
ఓం చక్రేశ్వర్యై నమః
ఓం బిందుమయాయై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం మంత్రనాథాయై నమః
ఓం సురుచిరాయై నమః
ఓం సకలకళాధారిణ్యై నమః
ఓం అమృతభాషిణ్యై నమః
ఓం సౌందర్యనిధయే నమః
ఓం అపరాజితాయై నమః
ఓం ఆనందభైరవ్యై నమః
ఓం అక్షరరూపిణ్యై నమః
ఓం పరమాత్మిన్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః

ఓం రమ్యాయై నమః
ఓం లలితాయై నమః
ఓం లోకసాక్షిణ్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం కమలాక్ష్యై నమః
ఓం మదఘూర్ణితలోచనాయై నమః
ఓం గీతప్రియాయై నమః
ఓం గానశీలాయై నమః
ఓం గురుమూర్త్యై నమః
ఓం గుణాత్మికాయై నమః
ఓం కామరాజార్చితాయై నమః
ఓం కాంతిమత్యై నమః
ఓం కారుణ్యవిగ్రహాయై నమః
ఓం సుముఖ్యై నమః
ఓం సుకలోలాయై నమః
ఓం సువర్ణవర్ణాయై నమః
ఓం సుప్రతిష్ఠితాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగదాత్ర్యై నమః
ఓం మంత్రరాజరాజ్ఞ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మాతంగతనయాయై నమః
ఓం మాననీయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం నీలోత్పలనిభాయై నమః
ఓం ఓంకారరూపిణ్యై నమః
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కామదాయై నమః
ఓం కమలవాసిన్యై నమః
ఓం భవాన్యైనమః
ఓం భూతిదాయై నమః
ఓం భానుమండలమధ్యస్థాయై నమః
ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః
ఓం సర్వతంత్రమయియై నమః
ఓం సర్వయంత్రత్మికాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శ్యామామృతకలాధారిణ్యై నమః
ఓం వాగ్మయియై నమః
ఓం వశ్యకారిణ్యై నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం విజయాయై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం శుకపక్షసమానవర్ణాయై నమః
ఓం శృతిసారాయై నమః
ఓం శుభకర్యై నమః
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం ధర్మచారిణ్యై నమః
ఓం పరమంత్రవిభేదిన్యై నమః
ఓం శ్రీ రాజమాతంగ్యై (శ్యామలాయై) నమః
****************************************

19/01/2026
శ్యామలాదండకమ్మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ...
18/01/2026

శ్యామలాదండకమ్

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||
దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః

ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహారాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా...అర్థం:...రుద్ర స్వరూపుడైన హనుమంతు...
14/01/2026

ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహారాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా...

అర్థం:...
రుద్ర స్వరూపుడైన హనుమంతుడికి నమస్కారం.
సమస్త శత్రువులను సంహరించువాడు.
సమస్త రోగాలను నివారించువాడు.
సమస్త జీవులను వశీకరించువాడు.
రాముని దూత అయిన హనుమంతునికి
స్వాహా (నమస్కారం). ...

ప్రయోజనాలు:
భయం, ప్రతికూలతలను తొలగిస్తుంది.
శారీరక, మానసిక బలం, ధైర్యం ఇస్తుంది.
శత్రువులపై విజయం, రోగాల నుండి విముక్తి కల్పిస్తుంది....

జీవితంలో అడ్డంకులను, కష్టాలను తొలగిస్తుంది.
అదృష్టం, రక్షణ, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.
ఎలా జపించాలి:..

ఈ మంత్రాన్ని భక్తితో, శ్రద్ధతో పఠించాలి.
దీక్ష అవసరం లేదు, వినడం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు...

రోజుకు 108 సార్లు జపించడం వలన గొప్ప ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ..

కాలభైరవాష్టకం..అర్ధంతో...............!!దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజంవ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్నారదాదియోగిబృందవంది...
07/01/2026

కాలభైరవాష్టకం..అర్ధంతో...............!!
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన,
సర్పమును యజ్ఞోపవీతముగా కలిగినవాడు,
చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు,
దిక్కులనే వస్త్రములుగా కలిగినవాడు,
నారదాది మునులచే పూజించబడినవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
కోటి సూర్యుల వలె ప్రకాశించువాడు,
భవ సాగరాన్ని దాటించేవాడు,
జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగినవాడు,
యముని సంహరించినవాడు,
పద్మములవంటి కన్నులు కలవాడు,
అజేయమైన త్రిశూలము కలవాడు,
నాశనము లేని వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించినవాడు,
నల్లని మేను కలవాడు, సనాతనుడు,
నాశనము లేనివాడు, మొదటి వాడు,
రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు,
విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడేవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించేవాడు,
పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు,
శివుని రూపమైనవాడు (స్థిరమైన వాడు),
భక్త ప్రియుడు, లోకేశ్వరుడు,
వేరు వేరు రూపములలో విలసించేవాడు,
చిరుగజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించినవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
ధర్మమనే సేతువును పాలించేవాడు,
అధర్మ మార్గములను నాశనము చేసేవాడు,
కర్మ బంధములనుండి తప్పించేవాడు,
మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించేవాడు,
బంగారు రంగులో ఉన్న పాశము,
సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,
అంతటాయున్న వాడు, రెండవసాటి లేనివాడు,
ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించేవాడు,
తన దంతముల ద్వారా మోక్షమును కలిగించేవాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
బ్రహ్మచే సృష్టించబడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగినవాడు,
సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు,
తెలివైన వాడు, చండ శాసనుడు,
అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు
(అణిమ, గరిమ మొదలగునవి),
కపాలముల మాల ధరించిన వాడు,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
తాత్పర్యము:
భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు,
కాశీ పురవాసుల మంచి చెడును విచారించేవాడు,
నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి,
కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని
నేను భజిస్తున్నాను.
ఫల శ్రుతి.
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్
తాత్పర్యము:
అనంతమైన జ్ఞాన మూలమైన,
సత్కార్యముల ఫలమును పెంచే,
శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం
పఠించే వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును.
ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.
కాలభైరవుడు:
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు
ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ.
రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు.
దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం.
కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప
ఆయనే కుక్క కాదు.
కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు.
రక్షణకు కూడా తిరుగులేని పేరు.
సమయోచిత జ్ఞానానికి ప్రతీక.
కాలస్వరూపం ఎరిగిన వాడు.
కాలంలాగే తిరుగులేనివాడు.
ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు.
శాశ్వతుడు, నిత్యుడు.
వీరభద్రుడిలా భైరవుడు కూడా శివుడు నుంచి ఆవిర్భవించినవాడే.
తన విషయంలో అవమానకరంగా వ్యవహరించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలోనే 'భైరవుడు' ని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.
మహా పరాక్రమవంతుడైన భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు.
ఆ తరువాత బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఏం చేయాలో చెప్పమని భైరవుడు అడుగుతాడు.
ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఉండమనీ,
ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో,
అక్కడితో ఆయన పాపం ప్రక్షాళన అవుతుందని శివుడు చెబుతాడు.
భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది.
ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి చేరుకున్న భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు.
భైరవుని రూపాలు ఎనిమిది...
1) కాలభైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ
ఇవే కాక
భీష్మ భైరవ,
స్వర్ణాకర్షణ భైరవ,
శంబర భైరవ,
మహా భైరవ,
చండ భైరవ
అనే రూపాలు కూడా ఉన్నాయి.
స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.
ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు.
తలపై చంద్రుడు ఉంటాడు.
4 చేతులు ఉంటాయి.
ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
వారణాసి లో కాలభైరవాలయాన్ని దర్శిస్తే తప్ప కాశి యాత్ర పూర్తికాదు.
ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు.
రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.
కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు
''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే,
తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌''
అని ప్రార్థిస్తారు.
మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి.
ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది.
ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు.
నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు.
ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు.
తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.
కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు.
అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేప్పుడు కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని,
అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని చెప్తారు.
కాలభైరవుని వాహనం శునకం.
కనుక కుక్కలకు ఆహారం పెట్టి,
వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ,
అనురక్తితో సాకినట్లయితే,
పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే.
కాల భైరవాష్టమి:
ఇది పరమ పవిత్రమైన రోజు.
ఆరోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి.
అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు.
కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు.
భక్తిగా కొలుస్తారు.
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ |
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||
శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది.
శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని, చిత్రపటానికిగాని
పూజ చేయవచ్చు.
శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు.
పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి.
కాలభైరవ పూజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది.
శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.
ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది.
రాహువుకు అధిపతి.
రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు
కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే
వాటినుండి వెంటనే విముక్తులౌతారు.
మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి.
మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు,
బట్టల భైరవుడు దర్శనమిస్తారు.
విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది.
కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.
ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు.
ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం?
అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు.
ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో
అష్ట భైరవుడున్నాడు.
అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి,
మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని,
ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని,
నిరంతరం ఆపదలనుండి కాపాడాలని
భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభావంతు..!!

25/12/2025

తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యెకత ఏమిటి?







23/12/2025

పరమశివుని అష్టమూర్తులు ఏమిటి?







17/12/2025

గోత్రాలు ఎలా పుట్టాయి?







16/12/2025

సాలగ్రామాలు పగిలితే పూజకు పనికిరావా?







15/12/2025

అమావాస్య మంచిరోజు కాదా?







Address

Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Vartali Spiritual Talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share