07/06/2025
చక్రంపేట లో ఘనంగా (ఈద్ ఉల్ అధా ) బక్రీద్ నమాజ్ ప్రార్ధనలు.
చక్రంపేట : 07.06.2025, అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం లోని చక్రంపేట గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్ ఉల్ అధా నమాజ్ ప్రార్ధనలు, జామియా మసీదు పేషమామ్, హజరత్ మహమ్మద్ మొహతీర్ రహమాన్, గారి ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించినారు.
చక్రంపేట గ్రామం లోని జామియా మసీదు వద్ద నుండి ముస్లీమ్ మైనారిటీ పెద్దలు, యువకులు, పిల్లలు, ఒక సముహంగా బయలు దేరి పొందలూరు వద్ద వున్న గట్టు మీద గాలి ఈద్గా మైదానం చేరుకొని ఈద్ నమాజ్ ప్రార్ధనలు, ఆచరించినారు. అనంతరం హజరత్ మొహమ్మద్ మొహతీర్ రహమాన్ గారు బక్రీద్ పండుగ విశిష్టత గురించి ఉపన్యాసం చేసినారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లీం మైనారిటీ సోదరులు ఒకరి కొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.
ఈద్ నమాజ్ ప్రార్ధనలలో చక్రంపేట, మరియు చుట్టుపక్కల గ్రామాల,లోని ముస్లీం సోదరులు పాల్గొన్నారు. కువైట్ లో స్థిరపడి వున్న ప్రవాసాంధ్ర చక్రంపేట ముస్లీం మైనారిటీ సోదరులు చక్రంపేట ముస్లింలకు బక్రీద్ పండుగ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.