08/11/2024
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్. ఎస్. ఎస్ ) - ప్రార్థన యొక్క భావం తెలుగులో 🚩
కొందరికి ఈ RSS గురించి కనీస పరిజ్ఞానం, అవగాహన లేకపోయినా నిష్కారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు అలాంటి వారి కోసమే👇
నమస్తే సదా వత్సలే
మాతృభూమే
త్వయా హిన్దుభూమే సుఖం వర్ధితోహమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే
ప్రభో శక్తిమన్ హిన్దురాష్ట్రాఙ్గభూతా
ఇమే సాదరం త్వాం నమామో వయమ్
త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం
శుభామాశిషం దేహి తత్పూర్తయే
అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం
సుశీలం జగద్యేన నమ్రం భవేత్
శ్రుతం చైవ యత్కణ్టకాకీర్ణ మార్గం
స్వయం స్వీకృతం నః సుగం కారయేత్
సముత్కర్షనిఃశ్రేయస్యైకముగ్రం
పరం సాధనం నామ వీరవ్రతమ్
తదన్తః స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్
విజేత్రీ చ నః సంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్
పరం వైభవం నేతుమేతత్ స్వరాష్ట్రం
సమర్థా భవత్వాశిశా తే భృశమ్
భారత మాతా కీ జయ
తెలుగు లో ప్రార్ధన యొక్క అర్ధం
వాత్సల్య పూర్ణా ! ఓ మాతృ భూమీ !
నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును
ఓ హిందూ భూమీ ,
నీ వల్లనే నేను సుఖముగా వర్ధిల్లినాను
మహా మంగళమయీ ! ఓ పుణ్య భూమీ !!
నీ కార్య సాధనకై నా శరీరము సమర్పింపబడు గాక !
నీకివే అనేక నమస్కారములు
సర్వశక్తిమయుడైనా ! ఓ పరమేశ్వరా !
హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులయిన
మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము
నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము
దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము
విశ్వము గెలవలేని శక్తిని ,
ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును
మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన
మా కణట్కాకీర్ణ మార్గమును సుగమము
చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము
అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై
ఒకే ఒక ఉత్తమము
తీక్షణమునైన సాధనము వీర వ్రతము
అది మా అంతః కరణముల యందు స్ఫురించుగాక !
అక్షయము, తీవ్రమునైన ధ్యేయ నిష్ఠ
మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక !
విజయాశీలియైన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి
మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో
నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక !
భారత్ మాత కీ జై 🚩🕉🇮🇳