Paul Hosanna

Paul Hosanna సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము

03/03/2025

*పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా*
*అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా*
*నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా*
*విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా*
*నీ లోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా*
*జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా*

09/01/2025

*ఇంత వరకు అనుభవిస్తున్న కష్టాల ముందు ఎన్నో ఇష్టాలను వదులుకొని ఉంటావు. ఇన్నిరోజులు మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని ఆందోళన చెంది ఉంటావు. కాలం వేస్తున్న ప్రతి కాటుకి భయాందోళనకు గురై ఉంటావు. కానీ ఆశతో ఎదురు చూసే నీ కళ్ళ ముందు గొప్ప గొప్ప అవకాశాలు దేవుడు సిద్ధం చేశాడు. గతాన్ని మర్చిపో గుండెని గునపంలా నిక్కబొడుచుకుని బాధించిన మాటలను మర్చిపోకు. నువ్వు ఎక్కడైతే అణగదొక్కబడావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను మహిమపరచబోతున్నాడు. గనుక ధైర్యంగా ముందుకు సాగిపో. రాజమార్గములో రాళ్ళు అడ్డు పడ్డాయని ఆగిపోకు. తొక్కుకుంటూ పోవాలే. నీ కాళ్ళు జారకుండా కాపాడే దేవుడే నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాడు. ఒకసారి దేవునితో మాట్లాడి చూడు నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. మనసులో నెమ్మది లేదని దేవునికి దూరంగా ఉండకు. నీ కలవరాలను తొలగించే దేవుడు నీతో ఉన్నాడు ఆని ధైర్యంగా ఉండు. 1 రాజులు 8:45*

*Paul Hosanna.......✍🏼*

09/01/2025

*అర్దం కాని పరిస్థితుల మధ్య నలిగిపోతునప్పుడు దేవుని అపార్థం చేసుకోకు. నీకు ఇష్టమైనది ఇవ్వడం లేదని దేవుడు లేడని అవిశ్వాసపు మాటలు మాట్లాడకు. నీకు నచ్చింది నీకు మంచిగానే కనిపిస్తుంది. కానీ అది నీకు చాలా ప్రమాదకరముగా ఉంటుందని దేవునికి తెలుసు కాబట్టే నువ్వు ఎంత ఏడ్చిన అది నీకు ఇవ్వడం లేదు. గనుక అపార్థం చేసుకొని దేవునికి దూరం అవ్వకు. ఆయన ఏం చేసినా నీ మంచికే చేస్తాడు. ఏదెను తోటలో ఉన్నా ఆదాము హవ్వకు తోటలో ఉన్న ఫలం కూడా చూడటానికి అందంగా, రమ్యంగా కనిపించింది. కానీ తిన్న తరువాత జరిగిన పరిణామాలు ఎదుర్కొన్నారు. తోటలో నుంచి వెలివేయబడం , శంపించబడిన వారిగా మారిపోయారు, దేవునికి దూరం అయ్యారు. గనుక నువ్వు కూడా దేవుని ఆశీర్వాదాలకు దూరం అయ్యవేమో గుర్తు చేసుకో. ఎక్కడ తప్పిపోయావో గ్రహించి తిరిగి లేచి నిలబడు దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నది.(యెషయా 60:1)*

*Paul Hosanna.....✍🏼*

05/09/2024

ఊహించని విపత్తుల మధ్య బరువెక్కిన గుండెతో కన్నీళ్ళ మధ్య సాగుతున్న నీ జీవితానికి దేవుడు అండగా ఉంటానని మాట ఇస్తున్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించు దేవుడు తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు నీ చుట్టూ ఎంతమంది ఉన్న ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. యాకోబు కుటుంబం సరియైనది అయితే యాకోబు ఒంటరిగా అరణ్యములో జీవించాల్సిన అవసరం ఏం ఉంది, తల్లితండ్రులు ఇద్దరిని సమానంగా పెంచితే ఇద్దరిని ఒకేలా ప్రేమించి ఉంటే ఏశావు యెందుకు పగతో రగిలిపోతున్నాడు? యాకోబు ప్రాణ భయముతో యెందుకు పరుగులు తీశాడు? హెచ్చు తగ్గుల ప్రేమలు నేటి రోజుల్లో చాలనే ఉన్నాయి. నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద దేవుడు ఒక్కడే. కాబట్టి గెలుపైన ఓటమి అయిన దేవుని మీదనే ఆధారపడి జీవించు. నిందలు, అవమాన మధ్య బ్రతకడం కంటే ఒంటరిగా బ్రతికి చావడం మేలు కదా! గనుక ఎవరి ప్రేమలు నమ్మకు. చావైన బ్రతుకైన దేవుని మీద ఆధారపడి బ్రతుకు. జీవితములో ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది. గనుక ఆందోళన చెందకు...

Paul Hosanna.....✍🏼

02/09/2024

*ఏమి అర్దం కానీ పరిస్థితిలో బాధపడుతున్నవా..! కోరుకున్నది దక్కడం లేదని అనుకున్నది జరగడం లేదని చేసే ప్రతి పనిలో అపజయం కలుగుతుందని దిగులుపడుతున్నవా..? కంగారు పడకు కోరుకున్నది దక్కకపోతే ఆ బాధ ఏలా ఉంటుందో అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. ఏది ఏమైనా దేవుని మీద ఆధారపడి జీవించు. దేవుడు ఎడారిలో నీటి ఊటలు పుట్టించగలడు, సముద్రంలో నీకు రహదారి వేయగలడు. గనుక దేవుని నమ్ము అవసరాలను బట్టి రంగులు మార్చే మనుషుల మధ్య ఉన్నావు. ఎవరిని అతిగా నమ్మకు ఈ భూమి మీద దేవుని కంటే నమ్మకమైన వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు నీ వలె నిన్ను వేధించిన అర్దం చేసుకోకుండా అర్దం లేని మాటల తూటాల చేత హేళన చేసిన కొంచెం దూరంగా ఉండు. దేవుడు చేయగలిగే పనులు నీ జీవితములో చాల ఉన్నాయి. కానీ నువ్వు సరిగ్గా దేవుని వైపు చేతులెత్తి ప్రార్ధించడం నేర్చుకుంటే చాలు సమస్తము సమకూర్చి సిద్దపరిచే దేవుడు నీ కోసం కూడా అనేక ఆశీర్వాదాలు సిద్ధం చేశాడు. అవి నీ సొంతం చేసుకున్న మరుక్షణం అవదులు లేని ఆనందంతో గంతులు వేస్తావు. ఈ మాట గుర్తు పెట్టుకో తప్పకుండా నీ జీవితములో చాల మార్పులు జరుగబోతున్నాయి....*

*Paul Hosanna.....✍🏼*

31/08/2024

*Never forget those who pushed you away.*
* God who has forsaken you but God has not forsaken you in that you are a great person. God will give you a good life. No matter how many arguments you make when you are not surrounded by understanding people. They will show you a thousand reasons to make you guilty. Trust God, not man. Joseph's life was unfairly blamed by his own brothers. His own people unjustly accused him and humiliated him and sold him in the country. Joseph did not lose his faith in God when he lost everything. Why do you strive for people who do not understand your goodness?*
*Believing in God is the God who gives to those who have to give.* *Joseph thought it was enough if he lived, but God wanted him to live as a great prime minister of the country.* *Have you realized yet how different your thoughts are from God's thoughts.* *So seeing the current situation, what will happen next? Don't think and worry. It is also futile to expect people who did not respect you while alive to shoulder your co**se after death. Don't lose faith in God in life. If you are with God, your God is Jesus of Nazareth who is able to make you alive even in your dead body.

*Paul Hosanna.....* ✍🏼

31/08/2024

*నిన్ను ఎడబాసిన వాళ్ళను దూరం పెట్టిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకు.*
*అందరూ నిన్ను విడిచిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు ఆ విషయములో నువ్వు గొప్ప వ్యక్తివి. దేవుడు నీకంటూ మంచి జీవితం ఇస్తాడు. అర్దం చేసుకునే మనుషులు నీ చుట్టూ లేనప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని వాదనలు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు. నిన్ను దోషిగా నిలబెట్టడానికి వాళ్ళు వెయ్యి కారణాలు చూపిస్తారు. నువ్వు మనుషులను కాదు దేవుని నమ్ము. యోసేపు జీవితములో సొంత అన్నలే అన్యాయంగా నిందలు వేశారు. సొంత వాళ్ళే అన్యాయంగా అతడి మీద నిందలు వేసి అవమానపరచి దేశం కానీ దేశములో అమ్మివేశారు. యోసేపు అన్ని కోల్పోయిన దేవుని మీద విశ్వాసం మాత్రం కోల్పోలేదు. నీ మంచితనం అర్దం చేసుకోని మనుషులు కోసం నీవెందుకు తపన పడతావు?*
*దేవుని నమ్ము ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు ఇచ్చే దేవుడు నీవు నమ్మే దేవుడు.* *యోసేపు బ్రతికితే చాలు అనుకున్నాడు కానీ దేవుడు అతడిని దేశాన్ని ఏలే గొప్ప ప్రధానిగా బ్రతికించాలి అనుకున్నాడు.* *ఇప్పటికైనా అర్దం అయిందా నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో.* *గనుక ఇప్పటి పరిస్థితి చూసి తరువాత ఏమవుతుందో అని ఆలోచించి ఆందోళన చెందకు. బ్రతికి ఉన్నప్పుడు నిన్ను గౌరవించని మనుషులు చనిపోయిన తరువాత నీ శవాన్ని భుజాన వేసుకుని వస్తారని ఎదురు చూడడం కూడా వ్యర్థమే. జీవితములో దేవుని మీద విశ్వాసం మాత్రం కోల్పోకు. నువ్వు దేవునితో ఉంటే నువ్వు చనిపోయిన నీ దేహమంతా కృశించిపోయిన అందులో కూడా నిన్ను గొప్పగా బ్రతికించగల సమర్థుడు నీ దేవుడు ఆయనే నజరేయుడైన యేసు.*

*Paul Hosanna.....* ✍🏼

14/08/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Suresh Delli, Lakshmi Prabhu, P Ramesh Ramesh Benny, Milla Raju, K Yesobu K Yesobu, Sampath Marapelly

16/07/2024

*కష్టంగా కదులుతున్న కాలములో కొంచెం ఓపిక కలిగి ఉండు. నిన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కరికీ కాలమే సమాధానం చెప్తుంది. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన పని లేదు. ఎవరి జీవితాలకు వాళ్ళే న్యాయం చేసుకోలేరు కానీ పక్క వాళ్ళ జీవితం గురుంచి జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ మధ్యలో ఉన్నాము. దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తే నీ బ్రతుకు మారడానికి ఒక క్షణం పట్టదు. మనుష్యుల దీవెనల కోసం అరాటపడకు. ఏశావు తన తండ్రి దగ్గర నన్ను ఆశీర్వాదించు అని ప్రాధేయపడితే మాట వరుసకు నువ్వు బాగుపడతావు అని అనలేదు. గుండెను బాదుకొని ఏడ్చి అడిగితే కూడా శాపనార్థాలు పెట్టాడు. అలాంటి మానుష్యుల మధ్య ఉన్నాము. దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉండు. మనుష్యుల మెప్పు కోరడం కన్న దేవుని దగ్గర మెప్పు కోరడం ఇంక మంచిది. ఆ ప్రయత్నం చెయ్యి దేవుడు నిన్ను బాగుచేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టిన వారిలో ఎవడు సిగ్గు పడలేదు. (కీర్తనలు 25:3)*

*Paul Hosanna.....✍🏼*
*9848140857*

16/07/2024

*Have some patience during tough moving times. Time will answer everyone who hurt you. There is no need to take revenge on anyone. They cannot do justice to anyone's life but we are in the midst of those who pass judgment on their lives. If God blesses you it will not take a moment to change your life. Do not cry for the blessings of men. When Esau prayed to his father to bless me, he did not say, ``You will be well.'' He cursed even if he asked after crying his heart out. We are among such men. Keep waiting for God's grace. It is better to seek the approval of God than to seek the approval of men. Make that effort and God will heal you. None of those who invented for him was ashamed. (Psalms 25:3)*

*Paul Hosanna.....✍🏼*
*9848140857*

15/07/2024

*The merciful God promises to be with you. Don't worry that life alone in the shadow of defeat is not slow. The God who has increased attachment in the realm of affection will be your refuge. It is enough to have devotion to God who is with you or not. God will protect you and keep you safe. So remember that in life, no parent, brother, sister, brother, friend who is not in trouble will never be yours. Forget every blow in life, forget the insults, bitter experiences and frightening events in life. God is with you. He always helps those who seek Him. Those who hurt you when you were alive are all useless cries and cries after death. God is always the same yesterday and today so if you fellowship with Him you will find peace. (Job 22:21)*

*Paul Hosanna.....✍🏼*
*9848140857*

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Paul Hosanna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share