TVN99 News

TVN99 News Thank you for choosing TVN99 News - Stay Informed, Stay Ahead!

27/08/2026

రాఖీ అంటే కేవలం అన్నాచెల్లెళ్ల బంధం కాదు… మన భద్రత కోసం నిలబడే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత. ❤️

అమనగల్ గర్ల్స్ హైస్కూల్‌లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు… విద్యార్థినులకు ఈవ్‌టీజింగ్, వేధింపులు, POCSO చట్టంపై అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి “మా రక్షణ కోసం ఎప్పుడూ ముందుండండి” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ❤️

ఆ చేతులకు కట్టింది రాఖీ మాత్రమే కాదు… ప్రతి ఆడపిల్ల భద్రతపై ఉన్న నమ్మకం. 🇮🇳

S. Venkateshwarlu, Inspector of Police & SHO, Amangal Police Station, SI A. Santhosh Reddy,

27/08/2026

విమానంలోకి ఇంత పెద్ద ఫుడ్ డబ్బాలు ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? 👀

దాదాపు 15 మంది ఉన్న ఓ కుటుంబం ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే డోక్లా, తేప్లా, ఇంకా ఎన్నో స్నాక్స్ బయటకు తీసి అందరికీ ప్లేట్లలో వడ్డించడం ప్రారంభించింది. అంతేకాదు, వాడిన ప్లేట్ల కోసం పెద్ద చెత్త బ్యాగ్‌ను కూడా సిద్ధంగా పెట్టుకున్నారు.

ఈ దృశ్యాన్ని చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కొందరు దీన్ని “దేశీ ఫ్యామిలీ వైబ్” అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం “విమానంలో ఇలా చేయడం సరైనదేనా?” అని ప్రశ్నిస్తున్నారు.

విమానంలో జరిగిన ఈ ఫుడ్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని వైరల్ వార్తల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

27/08/2026

GO 97పై నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వరంగల్‌ జిల్లా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

GO 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామంపై రాజకీయంగా చర్చ మొదలైంది.

26/08/2026

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సిబ్బంది ఓ ప్రయాణికుడి నోటి నుంచి 82 గ్రాముల బంగారం ఉన్న రెండు క్యాప్సూల్స్‌ను గుర్తించారు.

దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రయాణికుడు ఘజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడింది.

అసలు ఆ క్యాప్సూల్స్‌ను నోట్లో ఎందుకు దాచుకున్నాడు? 👀

ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

26/08/2026

“Without HYDRAA, Hyderabad Could Have Been Swept Away!” 🌊🚨

Against the backdrop of the Musi floods, HYDRAA Commissioner Ranganath made key remarks.

He stated that Hyderabad’s situation could have become dangerous without HYDRAA. His comments on the Musi river basin, encroachments, and the threat of flooding have now become a major topic of discussion.

How effective will HYDRAA’s measures be in protecting Hyderabad from future floods? 👀

26/08/2026

🍻రాజమండ్రిలో ముగ్గురు మహిళల హల్‌చల్! 🚨

మద్యం మత్తులో ఇద్దరు యువకులతో గొడవకు దిగి వారిపై దాడి చేసిన ముగ్గురు మహిళలు.

యువకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు.. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

25/08/2026

MLA అయినా… MP అయినా… CM అయినా… PM అయినా…
Foreign country visit అంటే అందరికీ ఒకే protocol ఉండదు.

🔹 MLA / MP
Personal visit అయితే సాధారణ visa, passport & immigration rules follow అవుతాయి. Official visit అయితే అవసరమైన government permissions & protocol apply అవుతాయి.

🔹 Chief Minister
Official foreign visit అయితే State Governmentతో పాటు Central Government / MEA coordination కూడా అవసరం కావచ్చు.

🔹 Prime Minister
PM foreign visit అత్యున్నత diplomatic protocolలో జరుగుతుంది. MEA, security agencies, Indian diplomatic mission & host country authorities coordination చేస్తారు.

👉 Key Point:
ఒక ప్రజాప్రతినిధి విదేశాలకు వెళ్లడం మాత్రమే violation కాదు.
ఆ visit officialనా? privateనా? ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్తున్నారా? అనే దానిపై protocol మారుతుంది.

Foreign Trip… కానీ Protocol ఎవరిది? 🤔🌍

25/08/2026

ఒక బస్సు మాత్రమే వస్తోంది.. అది కూడా సమయానికి రావడం లేదంటూ బుడ్డోడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“విరిగిపోయిన బస్సు పంపిస్తున్నారు.. కొత్త బస్సులు ఎక్కడికి పోయాయి? ఇల్లు తాకట్టు పెట్టావా రేవంత్ రెడ్డి?” అంటూ ప్రభుత్వంపై సెటైరికల్‌గా ప్రశ్నించారు.

25/08/2026

మా ఇల్లు కూల్చేసిన తర్వాత కూడా ప్రతి నెల కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఈ నెల బిల్లు కూడా చెల్లించాను” అంటూ సున్నం చెరువు HYDRAA బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని చెప్పినా.. మా మాట వినకుండా కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేశారు. ఇల్లు కూల్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నాం” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

HYDRAA Victims, Sunnam Cheruvu, Hyderabad HYDRAA, House Demolition, HYDRAA Demolitions, Revanth Reddy, AV Ranganath, Electricity Bill, Hyderabad News

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when TVN99 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TVN99 News:

Shortcuts

Share