Sardak One

Sardak One I Am Chekkilla Srinivas Senior Journalist.

23/09/2026

ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒ...
23/09/2026

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవాకశం ఉంది.

5 సెంట్లు భూమి కోసం  1బి జారీ చేయడానికి లంచం రూ. 20 వేలు లంచం. అనకపల్లి జిల్లా కె కోటపాడు తహాశీల్థార్ కార్యలయంలో లో ఎసిబ...
08/09/2026

5 సెంట్లు భూమి కోసం 1బి జారీ చేయడానికి లంచం రూ. 20 వేలు లంచం. అనకపల్లి జిల్లా కె కోటపాడు తహాశీల్థార్ కార్యలయంలో లో ఎసిబి సోదాలు. ఒక రైతుకు ఐదు సెంట్ల భూమికి 1బీ జారీకి వారాడ గ్రామ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ రూ. 20,000 లంచం డిమాండ్. తహాశీల్థార్ కార్యాలయం ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

08/09/2026

మలేషియాలో తెలుగు దంపతుల కష్టాలు

మలేషియాలో తెలుగు దంపతుల కష్టాలు పడుతున్నారు. ఉపాధి పేరుతో ఆశ చూపి మోసం చేసిన ఏజెంట్.ఇద్దరు చంటి పిల్లలతో అష్ట కష్టాలు పడుతున్న వెంకటరమణ, పూజిత. ఆరు నెలల క్రితం పెదగంట్యాడ రామచంద్ర టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మలేషియా వెళ్ళిన రాజమండ్రి కి చెందిన దంపతులు. సరైన ఉపాధి లేక.. పిల్లలతో కష్టాలు పడుతున్నామని ఆవేదన. ప్రభుత్వమే ఆదుకోవాలని వీడియో పోస్ట్ చేసిన బాధితులు. బాధిత దంపతుల కష్టాలపై స్పందించి ఏజెంట్ తో మాట్లాడుతున్న పోలీసులు.

ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌ ‘నందూస్‌ వరల్డ్‌’ నిర్వాహకురాలు రమా నందన విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్‌ ఎయిర్‌ పో...
08/09/2026

ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌ ‘నందూస్‌ వరల్డ్‌’ నిర్వాహకురాలు రమా నందన విచారణకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు లో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై కేసు నమోదు చేయ డంతో పాటు లుక్‌ఔట్‌ నోటీసును కూడా జారీ చేశారు. ఇవాళ ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు.

యూకే వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడరంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరిస్తానని 15 రోజుల క్రితం విచారణకు విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీనీలకు రమా నందన మెయిల్ చేశారు. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను మెయిల్‌లో ఆమె కోరారు. లుక్‌ఔట్‌ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో రమా నందన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో ఇబ్రహీంపట్నం పోలీసులు 41 నోటీసులిచ్చారు. రమా నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి యూకే నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరుకానున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వి ద‌క్కింది. వ...
08/09/2026

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వి ద‌క్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు.

AP DSCలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేస్తూ BIG TV సంచలనం సృష్టించింది. ఈ అంశంపై మరింత లోతు...
08/09/2026

AP DSCలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేస్తూ BIG TV సంచలనం సృష్టించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన సాగుతున్న సమయంలో BIG TV చీఫ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామా వెనుక ఎలాంటి వివాదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకున్నానని అశోక్ స్పష్టం చేశారు.

08/09/2026

Drone spray to agriculture

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌం...
26/08/2026

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-95 (I-95)పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం (ఆగస్టు 25) ఉదయం 10 గంటలకు కొద్దిసేపటి ముందు పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది.

వేగంగా ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు వాహనం మంటల్లో చిక్కుకున్నట్లు ట్రూపర్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల గుర్తింపు వివరాలు తొలుత వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

అయితే మృతుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్)కు చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడైన రాహుల్ ఉన్నత చదువుల కోసం కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు సమాచారం. అమెరికాలో చదువుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా తెలంగాణకు చెందిన వారిగా సమాచారం. అయితే వారి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రాహుల్ మృతితో నారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాల తరలింపు తదితర అంశాలపై అధికారులు, కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా 3 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్ ఫేజ్లో వితంతువులు, వృద్ధులక...
26/08/2026

ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా 3 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్ ఫేజ్లో వితంతువులు, వృద్ధులకు ఇవ్వనుంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ నుంచి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల తొలి వారంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని సమాచారం. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 1.50లక్షల మంది వితంతువులను అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.

Address

Hyderabad
500004

Website

Alerts

Be the first to know and let us send you an email when Sardak One posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sardak One:

Shortcuts

Share