19/10/2025
ఈ ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి పేరు కోటేశ్వరరావు పిడుగురాళ్ల పట్టణంలో మిలటరీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్..
నిన్న ఈ పాంప్లేట్ లు పట్టుకొని మీ పిల్లలను మా పాఠశాల లో చేర్చితే యూనిఫారం పుస్తకాలు బ్యాగ్ లు అన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా పిల్లలకు హ్యాండ్ రైటింగ్ , స్పోకెన్ ఇంగ్లీష్ ,నవోదయ కోచింగ్,రీజనింగ్ లాంటివే చేయిస్తాము..
మీ పిల్లలు బాగే చదివేలా ప్రోత్సాహం అందించి వారిని తీర్చి దిద్దే బాధ్యత నాది అంటూ ప్రతి ఇంటికి తిరిగి ఆయన చెప్తుంటే నిజంగా చాలా ముచ్చటేసింది..
ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఇలా ఉండాలి అనిపించింది..
ప్రైవేట్ పాఠశాల లకు ధీటుగా ప్రచారం అది కూడా హెడ్ మాస్టర్ అయి ఉండి ప్రతి ఇల్లు తిరిగి ఓపికగా చెప్పటం ఆదర్శనీయం...
ఇటువంటి కోటేశ్వరరావు లు ఊరికి ఒకరు ఉంటే చాలు...
ప్రభుత్వ పాఠశాలలు కళకళ లాడుతాయి...