Ramulamma

Ramulamma నిజం, నిజాయితీయే 'రాములమ్మ’.. అక్షర ఆయుధం...✍️

స్మృతి మంధాన పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోవడంతో..ఇలాంటి టైంలో తన క్లోజ్ ఫ్రెండ్ కి అండగా ఉండాలని జెమీమా బిగ్ బాష్ లీగ్ కు దూర...
28/11/2025

స్మృతి మంధాన పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోవడంతో..
ఇలాంటి టైంలో తన క్లోజ్ ఫ్రెండ్ కి అండగా ఉండాలని జెమీమా బిగ్ బాష్ లీగ్ కు దూరమైంది..❤️

* ఫ్రీగా బస్సు ఇచ్చి,* గ్యాస్ సిలిండర్లు ఇచ్చి,* పిల్లలకు స్కూలు ఫీజులకు కొంత,* రైతు భరోసా, రుణ మాఫీ,* పెన్షన్లు,* పేదలక...
22/11/2025

* ఫ్రీగా బస్సు ఇచ్చి,
* గ్యాస్ సిలిండర్లు ఇచ్చి,
* పిల్లలకు స్కూలు ఫీజులకు కొంత,
* రైతు భరోసా, రుణ మాఫీ,
* పెన్షన్లు,
* పేదలకు ఇంటి నిర్మాణానికి కొంత సాయం,
* 200 యూనిట్ల వరకు పవర్ Etc ఫ్రీగా వస్తుంటే.. ఇంకా ఇంకా ఉచితాలే కోరుకుంటారు..
ఆశకు హద్దు అనేదే లేకుండా..!!

👉 ఆఖరికి ఓటు వేయడానికి డబ్బుకు కావాలి..

ఇలా మారిపోయాక..👇
* పెట్రోల్ రేట్లు పెరిగినా,
* రోడ్లు పాడై ప్రాణాలు పోతున్నా,
* రూపాయి విలువ పడిపోయినా మనకు సంబంధం ఉండదు..!!

ఇప్పుడు పేదవాడికి, మధ్యతరగతి వాడికి సినిమా అందుబాటులో లేదు..
వీలైతే ఇది కూడా ఫ్రీగా ఇస్తే బాగుండు..

వేలకు వేలు పెట్టి చూడలేక అడ్డదారులు వెతుకున్నారు అంట..

వాస్తవాలు మాట్లాడుకుంటే..
2, 3 నెలలకు కూడా ఓ ఫ్యామిలీ సినిమా రాదు, వచ్చినా అన్నిసార్లు వెళ్ళడానికి అవ్వదు..

అయినా రేట్లే వంక...

మీరు చూసే పై..ర..సీ..
Govt Schools, Hospitals లాంటివి.
క్వాలిటీ, కంఫర్ట్ థియేటర్ లోనే సాధ్యం..

నిజానికి జెన్యూన్ గా రేట్ల గురించి ఫీల్ అయ్యేది కొందరే..❤️

మిగతా బ్యాచ్ అంతా ఏదైనా ఫ్రీగా వస్తే బెం..గి తినే బ్యాచే..

రేట్లు తగ్గించారు ఇప్పుడు చూడండి అంటే వంద వంకలు..

హీరోల రెమ్యునరేషన్ మీద ఏడ్చే ఓ అవిటి బ్యాచ్ ఉంది..

సునామీ, భూకంపాలు, కరోనా, వరదలు Etc వచ్చినప్పుడు..

👉 వాళ్లనే కదా అడుక్కు మిం..గారు అప్పుడు గుర్తు రాలేదా ఈ విషయం..

ఏం జరిగినా వాళ్ళనే కదా ముందు రెస్పాండ్ అవుతారు..

వాళ్లకు నష్టాలు వస్తున్నాయి అని మీ కష్టం ఏమైనా వాళ్లకు ఇచ్చి ఆదుకున్నారా..!?

ఓ 250 పెట్టి మూవీ చూసి నచ్చకపోతే అమ్మ..నా బూ..తులు తిట్టే మీరు కూడా నీతులు చెప్తున్నారు..

24 క్రాఫ్ట్ ల్లో సగానికి పైగా క్రియేటివ్ గానే ఉంటాయి..
అందులో ఒక్క పనికి కూడా టికెట్ రేట్ల మీద ఏడ్చే వాళ్ళు పనికి రారు..

⭐ పని విలువ, కాలం విలువ తెలిసినోడు ఎవ్వడూ ఇంకొకడి కష్టం గురించి తక్కువ చేసి మాట్లాడడు..

ఉండాలయ్యా మీరు నేల మీద నూరు కాలాల పాటు..🙏
22/11/2025

ఉండాలయ్యా మీరు నేల మీద నూరు కాలాల పాటు..🙏

పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.అలాంటిదే రాజు Weds రాంబాయి కూడా..సీన్స్, డైలాగ్స్ అన్నీ మన...
22/11/2025

పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.
అలాంటిదే రాజు Weds రాంబాయి కూడా..

సీన్స్, డైలాగ్స్ అన్నీ మనకు నచ్చకపోయినా క్లైమాక్స్ తో హిట్ కొట్టేశారు రాజు, రాంబాయి..

తెలంగాణ స్లాంగ్ లో అందరూ సరిగా సెట్ అవ్వలేదు కానీ గ్రామీణ వాతావరణాన్ని మాత్రం బాగా చూపించారు.

హీరో, హీరోయిన్ లు చాలా నేచురల్ గా చేసారు.
90's కిడ్స్ ఈ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు.
ఆ కాలంలోకి తీసుకెళ్లే కొన్ని సీన్స్ కి థియేటర్ లో విజిల్స్ పడుతున్నాయ్..

హీరో WWE లో ఓ డైలాగ్ చెప్తుంటాడు సిట్యూషన్ తో సంబంధం లేకుండా అదైతే చిరాగ్గా ఉంటది.

క్లైమాక్స్ కి మాత్రం బూ..తులు వస్తాయి Father క్యారెక్టర్ మీద కోపంతో..
అది నిజంగా జరిగింది అని చెప్తుంటే.. అన్నీ మర్చిపోయి.. అప్పటి ఆ ప్రేమికులపై జాలేస్తుంది..

ఒక్క క్లైమాక్స్ తో చాలా మిస్టేక్స్ కొట్టుకుపోయాయి హిట్ టాక్ నడుస్తుంది కానీ డైలాగ్స్, సీన్స్ కొంచెం ఫ్రెష్ గా ఉండుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.

ఫైనల్ గా..
రాజు వెడ్స్ రాంబాయి మన టీనేజ్ లోకి తీసుకెళ్లి.. కాస్త ఎమోషనల్ అయ్యేలా చేసారు..

అందరూ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతూ మల్టీప్లెక్స్ రేట్సే ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు..!?నేను మంత్లీ ఒక్క మూవీ అయ...
20/11/2025

అందరూ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతూ మల్టీప్లెక్స్ రేట్సే ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు..!?

నేను మంత్లీ ఒక్క మూవీ అయినా థియేటర్ లో చూస్తాను..
కానీ సంవత్సరానికి ఒక్క మూవీ కూడా మల్టీప్లెక్స్ లో చూడను!

ఇక్కడ మా ప్రాబ్లం మనీ మాత్రమే కాదు, ఎంజాయ్మెంట్ కూడా..
ఎలాంటి రియాక్షన్స్ లేకుండా ఉండే చూసే మరమనుషుల్లా కనిపిస్తారు మల్టీప్లెక్స్ లో చూసే వాళ్ళు నాకు..

సింగిల్ స్క్రీన్ లో టికెట్ రేట్స్ రూ.50 నుంచి ఉంటాయి.
స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా కొంత Reasonable గానే ఉంటాయి.

రూ. 1000 పెట్టి థియేటర్ లో చూడాలా అని బిల్డప్ ఇస్తూ పై..ర..సీ చూసే వాళ్ళ కంటే 150 పెట్టీ థియేటర్ లో చూసే నాకు ఫుల్ కిక్ ఉంటది..

మన తప్పుల్ని సమర్థించుకోవడానికి..
ఎదుటోడిని వెనకేసుకు రానవసరం లేదు..!

ఆయన మీకు అందుబాటులోకి తెచ్చిందేమైనా..
సోనా మసూరి బియ్యమా, సన్ ఫ్లవర్ ఆయిల్ అహ్..

ఓ.... ఎత్తేస్తున్నారు ఆకాశానికి..😂🤦

ఈ పాప తెగ నచ్చేస్తుంది🤩ఏ వీడియోలో చూసినా గ్రౌండ్ లో, బయట ఎంత యాక్టివ్ గా ఉంటుందో జెమీమా..😍మల్టీ టాలెంటెడ్ పర్సన్.. Jemim...
06/11/2025

ఈ పాప తెగ నచ్చేస్తుంది🤩
ఏ వీడియోలో చూసినా గ్రౌండ్ లో, బయట ఎంత యాక్టివ్ గా ఉంటుందో జెమీమా..😍

మల్టీ టాలెంటెడ్ పర్సన్.. Jemimah Rodrigues ❤️

ఇండియా టీంలోనే కాదు..ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ కోహ్లీ అంత సిన్సియర్ గా ఆడే ఆటగాళ్లు తక్కువ!గ్రౌండ్ లో విజయం కోసం ఎంత కష్...
05/11/2025

ఇండియా టీంలోనే కాదు..
ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ కోహ్లీ అంత సిన్సియర్ గా ఆడే ఆటగాళ్లు తక్కువ!

గ్రౌండ్ లో విజయం కోసం ఎంత కష్టపడతాడో..
ప్రాక్టీస్ లోనూ, జిమ్ లోనూ అంతే కష్టపడతాడు విరాట్..💪

వికెట్ల మధ్య అతని పరుగును అందుకోవడం ఎంత కష్టమో అతనితో బ్యాటింగ్ చేసే అందరికీ తెలిసిందే..🔥

అతని ఫిట్నెస్ కి, మెరుపు ఫీల్డింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు🤩

కోహ్లీకి క్రికెట్ అవసరం నుంచి..
క్రికెట్ కి కోహ్లీ అవసరం అనిపించేలా దశాబ్దానికి పైగా క్రికెట్ ను ఏలిన కింగ్ " కోహ్లీ" ❤️

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారత మహిళల క్రికెట్‌ జట్టు విశ్వకప్‌ సంబరాలే.. అటు చూస్తే హర్మన్‌ప్రీత్‌ సేనపై కాసుల వర్షం...
04/11/2025

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారత మహిళల క్రికెట్‌ జట్టు విశ్వకప్‌ సంబరాలే.. అటు చూస్తే హర్మన్‌ప్రీత్‌ సేనపై కాసుల వర్షం కురుస్తోంది.

ఈ తరం మహిళా క్రికెటర్లకు గత కొంతకాలంగా పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి. కొందరు ఎండార్స్‌మెంట్లతో కోట్ల సంపాదన కళ్లజూస్తున్నారు. జట్టు ఎక్కడికి వెళ్లినా బిజినెస్‌ క్లాసుల్లో ప్రయాణిస్తూ, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస చేస్తోంది.

ఇదంతా నేటి తరం క్రికెట్‌ అభిమానులకు మామూలుగానే అనిపిస్తుండొచ్చునేమో కానీ ఓ దశాబ్ద కాలం వెనక్కి వెళితే భారత మహిళా క్రికెటర్లు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో తెలుస్తుంది.

👉 బీసీసీఐ అండతో..

2006లో భారత మహిళా క్రికెట్‌ జట్టు బీసీసీఐ ఆధ్వర్యంలోకి రావడంతో నెమ్మదిగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆరంభంలో బోర్డు కూడా సీనియర్‌ జట్టుపైనే దృష్టి పెట్టింది. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ మహిళల క్రికెట్‌లో కీలక మలుపుగా చెప్పవచ్చు.

ఆసీస్ పై హర్మన్‌ప్రీత్‌ అజేయంగా 171 రన్స్‌ బాదడంతో జనాల దృష్టి ఒక్కసారిగా అమ్మాయిల జట్టుపై పడింది.
ఆ తర్వాత స్మృతి మంధాన తన బ్యాటింగ్‌ మెరుపులతో మరింత ఆదరణ తెచ్చింది.

అటు బోర్డు కూడా మహిళల క్రికెట్‌ను సీరియ్‌సగా తీసుకోవడం.. వీరికి కూడా డబ్ల్యూపీఎల్‌ నిర్వహించడంతో ఆట స్వరూపమే మారిపోయింది. తొలితరం మహిళా క్రికెటర్లు ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా ఆటపై అంకితభావంతో ముందుకు సాగారు. వారిని ప్రేరణగా తీసుకున్న ఇప్పటి ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యాలతో భారత మహిళల జట్టును అత్యున్నత స్థాయికి చేర్చగలిగారు.

👉 చందాలతో పర్యటనలకు..

1973 నుంచి 2006 వరకు భారత మహిళల క్రికెట్‌ సంఘం (డబ్ల్యూసీఏఐ) ఆధ్వర్యంలో అమ్మాయిల జట్టు నడిచేది. ఆటగాళ్ల ఎంపికను కూడా ఈ సంఘమే చూసేది. అయితే టూర్లకు వెళ్లాలంటే మాత్రం చేతిలో డబ్బుండేది కాదు. దీంతో రైళ్లలో జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించేవారు. ఆడినందుకు మ్యాచ్‌ ఫీజులుండేవి కావు.

అటు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ మండలి (ఐడబ్ల్యూసీసీ) సైతం తమ సభ్యదేశాలకు నయా పైసా ఇచ్చేది కాదు.

కేవలం ఆటపై అమితాసక్తి, ప్రేమతోనే అప్పటి ప్లేయర్లు క్రికెట్‌ టోర్నీల్లో ఆడేవారు. ఓసారి న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి హోటళ్లలో బస చేసేందుకు డబ్ల్యూసీఏఐ దగ్గర డబ్బులు లేకపోతే.. స్థానిక భారతీయుల నివాసాల్లో సర్దుకోవాల్సి వచ్చింది.

మరోసారి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సిన పరిస్థితిలో మాజీ ప్రెజెంటర్‌ మందిరా బేడీ సహాయపడింది. ఓ డైమండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నందుకు తనకు లభించిన మొత్తాన్ని డబ్ల్యూసీఏఐకి ఇవ్వగా, ఆ డబ్బుతోనే విమాన టిక్కెట్లు కొనుగోలు చేసి ప్లేయర్లను ఇంగ్లండ్‌కు పంపగలిగారు.

👉 బ్యాట్లు కూడా పంచుకునేవారు

అప్పటి క్రికెటర్లకు సొంత కిట్‌ అనేది లగ్జరీ కిందే లెక్క. అందుకే బ్యాట్లను కూడా షేర్‌ చేసుకునేవారు. స్థానిక క్రికెట్‌ టోర్నీల్లో పాల్గొనేటప్పుడు ఆయా జట్ల దగ్గర మూడు బ్యాట్లే ఉండేవి. ఓపెనర్లు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముందు వినియోగించేవారు. ఓపెనర్‌ అవుటైతే నాలుగో నెంబర్‌ ప్లేయర్‌ తన బ్యాట్‌, లెగ్‌ గార్డ్స్‌ను వాడేది. ఇక వీరుండే వసతి గృహాల్లో 20 మందికి కలిపి నాలుగు వాష్‌రూమ్స్‌ను వినియోగించుకునేవారు.

నేలపైనే తమ సొంత దుప్పట్లు వేసుకుని పడుకునేవారు. 2005 వన్డే వరల్డ్‌కప్ లో రన్నరప్‌గా నిలిచినందుకు ప్రైజ్‌మనీ లభించినా.. ఇప్పటి మాదిరిగా ప్రోత్సాహకాలూ వారికి దక్కలేదు.

Source : ఆంధ్రజ్యోతి

మిథాలీ రాజ్..❤️ఎన్ని సెలబ్రేషన్స్ పిక్స్ చూసినా నాకు హై ఇచ్చే పిక్ ఇది..ఈరోజు మహిళ క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణ...
03/11/2025

మిథాలీ రాజ్..❤️
ఎన్ని సెలబ్రేషన్స్ పిక్స్ చూసినా నాకు హై ఇచ్చే పిక్ ఇది..

ఈరోజు మహిళ క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం..
ఒకప్పుడు తను వేసిన బాటే.. 👣

ప్రభుత్వం నుంచి, స్పాన్సర్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేని రోజుల్లో నుంచి..
ఈరోజు స్టేడియాలు నిండి,
రాత్రుళ్లు మేల్కొని మరీ మ్యాచ్ లు చూసే రోజులకు వచ్చింది భారత మహిళా క్రికెట్..💪

నిన్న వరల్డ్ కప్ అందుకున్న చాలామంది అమ్మాయిలు..
మిథాలీని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లో అడుగు పెట్టిన వాళ్ళే..🤩

నువ్విచ్చిన స్పూర్తే ఈ కప్ అని.. 🏆
గౌరవంగా తన చేతిలో వరల్డ్ కప్ పెట్టిన సందర్భం ఇది..😍

హమ్మయ్యా.. మొత్తానికి గెలిచేశారు..🎉 🎊 బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అదరగొట్టి.. విశ్వవిజేతలయ్యారు❤️సూపర్ ఫామ్...
02/11/2025

హమ్మయ్యా..
మొత్తానికి గెలిచేశారు..🎉 🎊

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అదరగొట్టి.. విశ్వవిజేతలయ్యారు❤️

సూపర్ ఫామ్ లో ఉన్న ప్రతీక గాయం నుంచి తప్పుకోవడంతో టీమ్ లోకి వచ్చిన షెఫాలీ.. బ్యాటింగ్(87), బౌలింగ్ (2) లో అదరగొట్టింది👏

దీప్తి శర్మ (58) రన్స్, ఐదు వికెట్స్ తో మ్యాచ్ ను మన వైపు తిప్పింది👏👌

సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ (101) ఒంటరి పోరాటం చేసింది..
క్రీజులో తను ఉన్నంతసేపు మన బౌలర్స్/మ్యాచ్ చూసే వాళ్ళకి చెమటలు పట్టాయి.

తను ఔట్ అవ్వగానే విన్నింగ్ కన్ఫర్మ్ అయిపోయింది.😃

ఇప్పటి వరకు ఉండి మ్యాచ్ చూసినందుకు ఫలితం దక్కింది..
ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు😊

ఈరోజే వన్డే వరల్డ్ కప్ ఫైనల్..మధ్యాహ్నం 3 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది.ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే.. * ఒక్కసారిగా మహిళ...
02/11/2025

ఈరోజే వన్డే వరల్డ్ కప్ ఫైనల్..
మధ్యాహ్నం 3 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది.

ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే..
* ఒక్కసారిగా మహిళా క్రికెట్ బ్రాండ్ వాల్యూ పెరిగిపోతుంది..
* మీ మ్యాచుల కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూసే రోజులొస్తాయి..
* ఈక్వల్ పే కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు..
* గెలిస్తే 125 కోట్లు ఇచ్చే ఆలోచనలో ఉంది BCCI..

అన్నింటికి మించి.. ఎందరో అమ్మాయిలు క్రికెట్ వైపు అడుగులు వేస్తారు..

ఆడవాళ్ళు అన్నింటిలో సమానమే అనడమే కాదు..
నిరూపించుకునేందుకు మరో అవకాశం వచ్చింది😊

ఈరోజు మ్యాచ్ ను తల్చుకుంటేనే Goosebumps వస్తున్నాయ్..

ఆ కెప్టెన్ వోల్వార్డ్, కాప్ తో జాగ్రత్తగా ఉండి..
కోట్లాది క్రికెట్ లవర్స్ కి కోసం కప్ కొట్టండి అమ్మాయిలు..❤️

నో నట్ నవంబర్.. అసలేంటి NNN..యుక్త వయసు వచ్చిన ప్రతీ కుర్రాడు స్వయంతృప్తి పొందడానికి అలవాటు పడతాడు. ఇది చాలా సహజ సిద్ధమై...
01/11/2025

నో నట్ నవంబర్.. అసలేంటి NNN..

యుక్త వయసు వచ్చిన ప్రతీ కుర్రాడు స్వయంతృప్తి పొందడానికి అలవాటు పడతాడు. ఇది చాలా సహజ సిద్ధమైన ఆరోగ్యకర అలవాటు.

అయితే నవంబర్ నెల మొత్తం ఈ హ..స్త ప్రయోగానికి దూరంగా ఉండడమే నో నట్ నవంబర్.

నవంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలోని వీ..ర్య శక్తిని బయటికి పోకుండా కాపాడుకుంటే వాతావరణ మార్పులను బాడీ త్వరగా అలవాటు చేసుకుంటుందని నమ్ముతారు.

అందుకే హ..స్త ప్రయోగం చేసుకునేలా ఉసి కొల్పే Poర్న్ వీడియోలకు దూరంగా ఉండాలనేది ఈ నో నట్ నవంబర్‌లో ఉన్న ప్రధాన ఛాలెంజ్‌.

నిత్యం Poర్న్ చూడడం కూడా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఇలా Poర్న్‌కి బానిసలైన వాళ్లు, ఈ ఛాలెంజ్ తీసుకుంటే ఆ వ్యసనం నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంది.

బ్యాచిలర్ యువకులే కాదు,
పెళ్లైన వాళ్లు కూడా ఈ నో నట్ నవంబర్‌ ఛాలెంజ్‌ తీసుకుంటూ ఉంటారు.

నెల రోజుల పాటు భాగస్వామిని దూరంగా ఉండలేక నో నట్ నవంబర్‌ని బ్రేక్ చేసేవాళ్లే ఎక్కువ!

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Ramulamma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share