TNI News

TNI News జర్నలిజం యొక్క మొదటి బాధ్యత సత్యాని? standard journalism

26/06/2021

PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

TS: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడి ప్రకటనపై ఉత్కంఠ వీడింది. అందరూ అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గ నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన జారీ చేసింది. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గరి నుంచి ఎంపీగా గెలిచారు.

26/06/2021

డెల్టా ఎఫెక్ట్: ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు

కరోనా శాంతించిందని మాస్కులకు నో చెప్పిన ఇజ్రాయెల్.. డెల్టా వేరియంట్ దెబ్బకు ఆ నిబంధనను మళ్లీ అమలు చేస్తోంది. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అయితే వారంపాటు లాక్ డౌన్ విధించారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో డెల్టా రకం వల్ల కేసులు బాగా పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ ప్రారంభమైందని.. కాంగో, ఉగాండాలో ఉద్ధృతి ఎక్కువగా ఉందని ఆఫ్రికా CDC వెల్లడించింది. ఇక ఫిజీలోనూ కొవిడ్ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.

26/06/2021

UPSC పరీక్షలు.. వాటి తేదీలు

EPFO పరీక్ష SEP 5న, CAPF ఎగ్జామ్ ఆగస్టు

8న, NDA II పరీక్ష నవంబర్ 14న జరగనున్నాయి.

NO సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్), ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షలను OCT 10కి రీ షెడ్యూల్ చేసింది.

NA సివిల్ సర్వీసెస్-మెయిన్స్ వచ్చే ఏడాది JAN 7, 8, 9, 15, 16 తేదీల్లో, సివిల్స్ ఇంటర్వ్యూలు AUG 2 SEP 22 మధ్య నిర్వహించనుంది.

IT IFS మెయిన్స్ 2022, FEB 27 నుంచి MAR 8 వరకు షెడ్యూల్ చేసింది.

26/06/2021

పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత

AP: APPSC పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను ఎత్తివేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో ఇచ్చారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవన్న ప్రభుత్వం.. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయంది.

26/06/2021

జల దోపిడిపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేలా జగన్ చేస్తున్నారని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ధ్వజమెత్తారు. తండ్రికి మించిన తనయుడుగా జగన్ తెలంగాణ పట్ల ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల ఆ కుటుంబం ఎప్పటినుంచో వివక్ష చూపుతోందన్నారు. అటు గ్లాసు నీరు కూడా అధికంగా తీసుకోలేదని ఏపీ మంత్రులు కబుర్లు చెబుతున్నారన్నారు. BJP ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా మాట్లాడుతోందన్నారు.

26/06/2021

*రాష్ట్రంలో 3రోజులు ఉపరాష్ట్రపతి పర్యటన...*

న్యూఢిల్లీ :

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు విశాఖకు రానున్నారు...

మూడు రోజులపాటు విశాఖలో ఆయన బస చేయనున్నారు...

ఈనెల 27న రాష్ట్ర ఇతర తెలుగు సమైక్య ఆరో వార్షికోత్సవాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య వర్చువల్‌గా ప్రారంభించనున్నారు...

ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు...

13/04/2021

...మిత్రులందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....

19/02/2021

న్యాయవాదుల హత్య: బిట్టు శ్రీను అరెస్టు

పెద్దపల్లి: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్‌ వెల్లడించారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జడ్పీ ఛైర్మర్‌ పుట్ట మధు మేనల్లుడు. న్యాయవాదుల హత్యకు సంబంధించి వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లు బిట్టు శ్రీను మీద అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

19/02/2021

నాలుగో రోజూ మార్కెట్లకు నష్టాలే..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం సూచీలను కిందకు లాగాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోయిందన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తద్వారా ఆసియా మార్కెట్లు క్రితం సెషన్‌లో డీలా పడ్డాయి. దీంతో ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ సూచీలు అదే ట్రెండ్‌ను అందిపుచ్చుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ ఉదయం 51,178 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 50,636 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 434 పాయింట్ల నష్టంతో 50,889 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ.. 15,074 వద్ద ప్రారంభమై.. చివరకు 137 పాయింట్లు నష్టపోయి 14,981 వద్ద స్థిరపడింది. అయితే, కొన్ని కీలక కంపెనీలు స్వల్ప వ్యవధిలో రాణించడంతో నిఫ్టీ ఉదయం స్వల్ప కాలం పాటు లాభాల్లో ట్రేడయి 15,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.

ఇంధన, ఐటీ రంగాల సూచీలు స్వల్పంగా ఎగబాకాయి. దాదాపు మిగిలిన రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ఆటో రంగ సూచీ 2.46 శాతం, పీఎస్‌యూ 1.90 శాతం, బ్యాంకింగ్‌ 1.84 శాతం నష్టాల్ని మూటగట్టుకున్నాయి. యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, గెయిల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.

19/02/2021

రెండు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం ఓ తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది

10/02/2021



మేయర్ పోరుకు సై

TS: రేపు జరగనున్న GHMC మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. తమకు బలం లేకున్నప్పటికీ TRS, MIM పొత్తు గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. GHMCలో 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో TRS 56, బీజేపీ 48, MIM 44, కాంగ్రెస్ 2 సీట్లలో గెలిచాయి. 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే ఓటేసే వారి సంఖ్య 202గా ఉండనుంది మేజిక్ ఫిగర్ 102

08/02/2021

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్లో ధౌలి గంగ నది ప్రవాహంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు తిరిగి ప్రారంభం అయ్యాయి ITBP, NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సొరంగాల్లో మట్టి పూడుకుపోవడంతో అందులోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారుతోంది. సహాయక చర్యల్లోకి ప్రత్యేక జాగిలాల బృందాలను కూడా రంగంలోకి దించారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TNI News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share