Ping media

Ping media for the society and people

ఈ చిత్రము లోని నందీశ్వరుడు తన స్వామి కొరకు వందల ఏళ్ల గా ఎదురుచూస్తున్నాడు . ఇదే కాశీ విశ్వేశ్వర ఆలయం లో జ్ఞాన వాపి మసీదు...
27/01/2024

ఈ చిత్రము లోని నందీశ్వరుడు తన స్వామి కొరకు వందల ఏళ్ల గా ఎదురుచూస్తున్నాడు . ఇదే కాశీ విశ్వేశ్వర ఆలయం లో జ్ఞాన వాపి మసీదు వైపు చూస్తున్న నంది విగ్రహం . ప్రతి శివాలయం లో నంది విగ్రహం శివుని చూస్తూ ఉంటుంది . మరి ఇక్కడ నంది చూస్తున్న శివయ్య మసీదు నిర్మాణం లో మాయమయ్యాడా ?
ఇప్పటి ఇరాన్ ప్రాంతాలలో వచ్చిన కరువు కాటకాల బారి నుండి హిందూ కుష్ పర్వత శ్రేణులు దాటి వచ్చిన ప్రజలు ఇక్కడ భారత భూమిలో గణ సమూహ రాజ్యాలను క్రమేపీ ఆక్రమించుకొంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పరిచారు .అదే వేద సంస్కృతిగా చెపుతారు . ఈ జంబూక ద్వీప భూమిలో గల శక్తివంతమైన , విజ్ఞాను లైన , పరిపాలనా దక్షులై న ప్రభువులను తమ కుయుక్తులతో హతమార్చి వారందరూ రాక్షసులుగా చిత్రీకరించి అనేక పురాణ కధలు ప్రచారం చేసారు . అరేబియా సముద్ర తీరం లోని పరామర వంశజుడైన పరుశురాముడు అనే చారిత్రిక రాజునూ పురాణ పురుషునిగా వర్ణించారు . .. అప్పటికే వున్న బౌద్ధ జైన ఆజీవక మతస్తుల ఆరామాలను ద్వాంసం చేసి ఆలయాలుగా పంచారామాలుగా మార్చేశారు . నిలువు మరియు అడ్డ నామాల శక్తి సమాన ముగా వున్న చోట హరిహర సుతులను ఆరాధించారు . .. ఆ క్రమములో వీరిపై ఎడారి మతాల వారు దాడి చేసి ఆలయాలు కొల్లగొట్టి నాశనం చేసారు . వారి ప్రార్ధన మందిరాలు నిర్మించుకున్నారు . చరిత్ర పునరావుత్తమైనది .నర జాతి చరిత్ర సమస్తం పర జాతి పీడనం .

దేశ వ్యాప్తం గా ఎందరో మహానుభావులు . ప్రతి ప్రదేశము నుండి భారత భూమి మట్టి వాసనలు , పారె సెలయేళ్ళు గలగలలు , పీడిత తాడిత అణ...
27/01/2024

దేశ వ్యాప్తం గా ఎందరో మహానుభావులు . ప్రతి ప్రదేశము నుండి భారత భూమి మట్టి వాసనలు , పారె సెలయేళ్ళు గలగలలు , పీడిత తాడిత అణగారిన ఆశలు -ఆశయాలు , ఆకలి కేకలు , నిర్భాగ్యుల నిస్సహాయ మూలుగులు , కూకటివేళ్ళ అక్రన్దనలు అన్నీ తెలిసిన 286 మంది మేధావులు . దార్శనికులు , ద్రష్టలు అయిన ఈ మహానుభావులందరూ ఒక చోట సమావేశం అయి రచించినదె మన భారత రాజ్యాంగం . కానీ ఆ మేధావులను మన మెవ్వరం స్మరించుకోవడం లేదు . కనీసము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలైనా వారిని గుర్తించి ప్రజలకు తెలియచేయుట ప్రజా ధర్మము . ఓట్ల రాజకీయాల్లో పడిపోయి కులాలు , మతాలుగా , ప్రాంతాలుగా విడిపోతున్న ప్రజలకు రాజ్యాంగం రచించిన మహానుభావుల గురించి తెలియాలి .

అయోధ్య రామాలయం కట్టటం ఎందుకు ? బదులు గా విద్యాలయాలు , హాస్పిటల్స్ కట్ట వచ్చుగా అని ఈ మధ్య అభ్యుదయవాదులు మరియు అన్య ప్రజల...
25/01/2024

అయోధ్య రామాలయం కట్టటం ఎందుకు ? బదులు గా విద్యాలయాలు , హాస్పిటల్స్ కట్ట వచ్చుగా అని ఈ మధ్య అభ్యుదయవాదులు మరియు అన్య ప్రజలు విమర్శలు మొదలు పెట్టారు . సనాతన ధార్మిక జీవనం లో దేవాలయాల పాత్ర ప్రముఖమైనది . దర్శినికులు , ద్రష్టలు , జ్ఞానులు , ఋషులు , మహర్షులు ఎందరో మన హిందూ జీవన విధానాన్ని మానవుని అభ్యున్నతి కి ప్రశాంత ప్రాకృతిక ధర్మ జీవనానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దారు ... నిజానికి దేవాలయాలు ఆధునిక గ్రోత్ సెంటర్ లకు ప్రాచీన ఆకృతులు . దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు . మన దేశ నలుమూలల గల దేవాలయాలు లేకుండా మన ఆర్ధిక వ్యవస్థ మన జాలదు . ఈ విషయం భారత ఆర్ధిక వేత్తలకు అందరకూ తెలుసు . నగదు చలామణిని ప్రోత్సహించి ప్రజలలో విశ్వాసాన్ని , ఆర్ధిక అభివృద్ధిని ప్రోత్సహించేది మన దేవాలయ వ్యవస్థ . రవాణా , ఆహార , వస్తు సరఫరా , రహదారులు ఇలా అన్ని రంగాల ఫై మన దేవాలయ వ్యవస్థ ప్రభావం కలదు . ఒక్క రోజు హుండీ ఆదాయం కోట్లలో ఉంటుంది . ఆ ప్రజా ధనం తో ఎన్నో పాఠశాలలు , అనాధ ఆశ్రమాలు , వృద్ధ ఆశ్రమాలు , అన్న ప్రసాద్ శాలలు , వైద్యాలయములు ఇంకా అనేక ప్రజా ఉపయోగకర పనులు చేపట్టవచ్చు . అందుకే దేవాలయాలు ప్రాచీన గ్రోత్ సెంటర్ లు గా ఆర్ధిక వేత్తలు పేర్కొంటారు . లౌకిక వాదం పేరిట కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వాలు పెత్తనం చేసే విధానాన్ని నిరసిద్దాం , అంతే గానీ దేవాలయ నిర్మాణాలపై కాదు .

మన సంస్కృతికి మూలాధారం అయిన వేదాలు , రామాయణ భారత పురాణాలు గురించి ఇంకా లోతు గా ఆధార సహితముగా పరిశోధనలు జరగాల్చి ఉన్నవి ....
24/01/2024

మన సంస్కృతికి మూలాధారం అయిన వేదాలు , రామాయణ భారత పురాణాలు గురించి ఇంకా లోతు గా ఆధార సహితముగా పరిశోధనలు జరగాల్చి ఉన్నవి . ఎక్కడో శున్యం లో కాలప్రవాహ లో కొంత ఖాళీ కనపడుతున్నది .ఆ ఖాళీ అనేక సందేహాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నది . రామాయణం కామన్ ఎరా కు ముందు 5 వేల సం . లు నాడు జరిగితే మరి గుర్రాల మాటేమిటి ?
గుర్రం ,, ఆధునిక డీ ఎన్ ఏ పరీక్షల ప్రకారముగా గుర్రాల జాతి కామెన్ ఎరా కు ముందు 4 వేల సం .ల నుండి మాత్రమే వున్నదని నిరూపిత మైనది . ప్రస్తుత ఉక్రేన్ , ఉజ్బేకిస్తాన్ ప్రాంత పర్వత శ్రేణుల్లో ఈ గుర్రాలు ఆవిర్భవించాయని చెబుతున్నారు . . ఈ గుర్రాలు కామన్ ఎరా కు 3 వేల సం . ల నాడు మాత్రమే మనిషులకు మచ్చిక అయ్యాయని తెలుస్తున్నది . భారత భూమిలో కామన్ ఎరా కు ముందు 5 వేల సం . లకు పూర్వం వున్న సింధు నాగరికిత లో గుర్రాల ప్రసక్తి లేదు .పురావస్తు పరిశోధనల ప్రకారముగా భారత భూమిలో కామన్ ఎరా కు ముందు 2 వేల సం .లనుండి మాత్రమే గుర్రాల ఉనికి కలదు అని తెలుస్తున్నది . కాబట్టి ఇంకా పరిశోధనలు జరగాలి . మాయం అయిన కాలం లో ఎం జరిగినది?

కాలం కుబుసం విడిచిన కాల నాగులా ముందుకు సాగుతుంది . నిన్నటి వరకు అపరిచుతులు , నేడు చలికి ఒకరికొకరు చేతులు పెనవేసుకొని కలస...
14/01/2024

కాలం కుబుసం విడిచిన కాల నాగులా ముందుకు సాగుతుంది . నిన్నటి వరకు అపరిచుతులు , నేడు చలికి ఒకరికొకరు చేతులు పెనవేసుకొని కలసిపోయి సాగిపోతున్నారు . చలిగాలులు కు ఉబ్బిపోయి నాని పోయిన చిక్కటి చీకటి , నాలుగువైపులనుండి అంధకారం లా అలుముకొనే వేళ , మనిషి మనిషిలోకి తెరుచుకొని - సహజీవనమనే సరికొత్త కావ్య జీవితాన్ని ఆవిష్కరించుకొని మానవుని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రకృతి . సంక్రమణం లోనే సరికొత్త క్రాంతి , అదే సంక్రాంతి . భోగ భాగ్యాలు , సరికొత్త క్రాంతులు , పాడి పశువుల లోగిళ్ళలో భారతీయత వెళ్లి విరియాలి .

జ్ఞాన సముపార్జనే మోక్షమునకు సోపానము . యోగులు , మహర్షులు , మహాత్ములు అందరూ భరత భూమి లో ఉత్తరం దిక్కున వున్న హిమాలయాల వైపు...
22/12/2023

జ్ఞాన సముపార్జనే మోక్షమునకు సోపానము . యోగులు , మహర్షులు , మహాత్ములు అందరూ భరత భూమి లో ఉత్తరం దిక్కున వున్న హిమాలయాల వైపు చూసేవారు . మహాభారతం లో స్వర్గారోహణం ఉత్తరం వైపుకు వెళ్ళుట దీనికి నిదర్శనం . ఆది శంకరులవారు హిమాలయాలే జ్ఞాన సంపద కేంద్రాలుగా దర్శించి శారదా పీఠం ఏర్పాటుచేశారు . ఇప్పటికీ సనాతన సంస్కృతికి ఉత్తరాన వున్న హిమాలయాలే కేంద్రబిందువులు .
అది మధ్యంత రహితుడు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యమే మోక్షము . అదే జ్ఞాన సంపద . వీటి సాధన కొరకు సాధకులు ఉత్తర దిక్కు కు వెళ్లాలని సూచనయే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం . 🙏

తంత్ర మార్మిక యోగ శాస్త్రం లో భగ పూజ క్రతువు సంక్లిష్టమైనది . లిప్త / హంస కాలం లో మానవుడు తనను తాను మరచిపోయేది సంయోగ భావ...
18/12/2023

తంత్ర మార్మిక యోగ శాస్త్రం లో భగ పూజ క్రతువు సంక్లిష్టమైనది . లిప్త / హంస కాలం లో మానవుడు తనను తాను మరచిపోయేది సంయోగ భావప్రాప్తి సమయం లోనే అనేది అందరకూ తెలీచినదే . అయితే ఆ క్షణం లో పురుషుడు గానీ స్త్రీ గానీ బీజాక్షర తంత్ర పదములు జపించగలిగితే అద్భుత యోగములు కలుగుతాయని ప్రాచీన తంత్ర మార్మిక యోగం చెపుతున్నది .
అనేక మంది తాంత్రికులు ఈ సాధనలో భాగముగా నగ్న పూజలు , భగ పూజలు చేస్తుంటారు . చాలామంది గురువులు ఈ క్రమములోనే లైనఁగిక ఆరోపణలతో జైళ్ల పాలు అయ్యారు .
దీనినే ఆధునీకరించి ఆచార్య రజనీష్ ' ఓషో ' కార్యక్రమములు బోధనలు చేసారు . వీరి బోధనలు కట్టుబాటు లేని విచ్చలవిడి మరియు విశృంఖల శృంగారానికి దారి తీసి భారత పార్లమెంట్ లో చర్చకు దారి తీసిన విషయం తెలీచిన్దే . ఓషో ఆశ్రమం లో ఒక్కో సన్యాసిని కనీసం 90 మంది తో లింగిక సంబంధాలు పేట్టుకునేవారని చెప్పేవారు .
ఆచార్య రజనీష్ అంతరంగికురాలుతో ఇందిరా గాంధీ తో ప్రత్యేక సంభందాలు ఉండేవని తెలిసినది . లక్ష్మి అనే పేరుగల సదరు మహిళతో ఇందిరా గాంధీ రాజకీయ విముఖత తో వుండే తన కుమారుడు రాజీవ్ ను మార్చగలిగినది అని చాలా మంది భావించారు .
ఇప్పటికీ ఈ ప్రక్రియను అనేకమంది రహస్యం గా సాధన చేస్తుంటారని ప్రతీతి .

ప్రకృతి లో ఎన్నో వైవిధ్యభరిత జీవరాశి కలదు . కీటకాలు , పక్షులు , జంతుజాలం వేటికి వాటికీ ప్రత్యేకత లతో ఎంతో వైవిద్యం కలదు ...
16/12/2023

ప్రకృతి లో ఎన్నో వైవిధ్యభరిత జీవరాశి కలదు . కీటకాలు , పక్షులు , జంతుజాలం వేటికి వాటికీ ప్రత్యేకత లతో ఎంతో వైవిద్యం కలదు . కొన్ని కీటకాలను ప్రత్యేకముగా పెంచుతారు . అనేక వ్యాధుల నివారణ లో ఈ కీటకాల ను ఉపయోగిస్తారు . వాటిలో ' బీటల్ స్టార్ ' అనే ప్రత్యేక కీటకం ఎన్నో వ్యాధుల నివారణ లో ఉపయోగిస్తారు .
ఇటీవల ఈ కీటకం 75 లక్షలకు జపాన్ లో విక్రయము జరుగుట ప్రతి ఒక్కరినీ ఆచ్చర్యం కలుగ చేసినది .అదే ' బీటల్ స్టార్ ' అనే కీటకం ఈ రికార్డ్ సాధించినది . లుకానిదే జాతి కి చెందిన స్టాగ్ బీటల్ జీవిత కాలము 7 సం . కుళ్ళిన చెట్లు , ఆకుల రసములు తింటూ ఈ కీటకాలు జీవిస్తాయి . ఎన్నో భయంకర వ్యాధుల నివారణ లో ఈ కీటకాల ను వాడుతారు . అందువలనే ఈ కీటకాలు అంత ఖరీదు పలుకుతున్నాయి . దీని తలపై 5 అంగుళాల నల్లని కొమ్ములు ఈ కీటకం కు ప్రత్యేకతను తెచ్చాయి .అధిక ఉష్ణత వాతావరణం లో మాత్రమే ఈ కీటకాలు మనుగడ సాగిస్తాయి . ప్రకృతి వైవిధ్యాన్ని మనిషి అర్ధం చేసుకొని ప్రకృతికం గా జీవించాలి stag beetal

సోమేపల్లి వారి కుటుంబ సమూహము లో ఒక ధృవతార రాలి పోయింది . రచయిత ల సంఘాలకు అధ్యక్షుడుగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు తెలు...
16/12/2023

సోమేపల్లి వారి కుటుంబ సమూహము లో ఒక ధృవతార రాలి పోయింది . రచయిత ల సంఘాలకు అధ్యక్షుడుగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు . ప్రతి సం . ఔత్సాహిక రచనలు ప్రోత్సహిస్తూ సభలు నిర్వహిస్తూ సాహీతీ సేద్యం లో గొప్ప హాలికునిగా వెలుగొందారు . ప్రభుత్వ అధికారిగా పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం లో కీలక పాత్ర వహించి ఒక రైతు గా తోటి రైతాంగానికి చిరస్థాయిగా మేలు కలిగించిన మహోన్నతుడు . నరసారావు పేట పార్లమెంట్ సభ్యుని కార్యదర్శిగా ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు . వారి మరణం అభిమానులకు తీరని లోటు . చిరస్మరణ మైన వారి యశస్సు అజరామరణం . వారి ఆత్మకు శాంతి కలగాలని దివ్యంజిలి ఘటిస్తున్నాము . 🙏🙏🙏🙏🙏

ప్రకృతి ని ప్రేమించి ఆరాధించే హిందూ ధర్మము నకు విరుద్ధం గా పరిశోధన ల పేరిట మానవాళి వికృతికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్న...
13/12/2023

ప్రకృతి ని ప్రేమించి ఆరాధించే హిందూ ధర్మము నకు విరుద్ధం గా పరిశోధన ల పేరిట మానవాళి వికృతికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు . పాచ్యత్త ప్రపంచం లో వీరందరూ ప్రముఖులుగా పేరొందుట విశేషం .
చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మనిషిని సృష్టించే ప్రయోగం ' ఇవనోవిచ్ ' అనే రష్యన్ బియాలజిస్ట్ 1910 లో ఆస్ట్రియా దేశం గ్రాజ్ లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ లో ప్రతిపాదించినపుడు అందరూ వులిక్కిపడ్డారు .అప్పటికే ఇతను జంతువుల వీర్య ప్రయోగాలతో మేలు జాతి గుర్రాలను సృష్టించారు . రష్యన్ ప్రభుత్వ నిధులతో ఇవనోవిచ్ 1926 లో పశ్చిమ ఆఫ్రికా లో గినియా ప్రాంతం నకు వెళ్లి చింపాంజీల ఫై ప్రయోగాలు చేసాడు ... అయితే గినియా లోని కిండియా నగరం లోని చింపాంజీలు కు గర్భధారణ వయస్సు రాకపోవటం తో ఇవనోవిచ్ పారిస్ వెళ్లిపోయాయడు . అక్కడ చింపాంజీలు మచ్చిక చేసుకోవటం లో నైపుణ్యం సంపాదించాడు .
తిరిగి ఆఫ్రికా కు వచ్చి మూడు చింపాంజీలకు మానవ వీర్యాన్ని ఎక్కించుటకుఁ ప్రయత్నాలు ప్రారంభించారు . ఒరుంగుటన్ చింపాంజీ ల వీర్యాన్ని ఆఫ్రికా మహిళలకు ఎక్కించే ప్రయత్నం చేసారు .
ఇటువంటి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి . అదే సమయం లో రష్యాలో పరిస్థితులు మారిపోయి సాంస్కృతిక విప్లవం మొదలు అయినది . 1930 లో రష్యన్ సీక్రెట్ పోలీసులు ఇవనోవిచ్ ను అరెస్ట్ చేసి కజఖ్ లో అల్మా అట్టా జైలు లో ఉంచారు . 1931 లో అనారోగ్యకరణములతో జైలు నుండి విడుదల అయ్యి పక్షవాతం తో మరణించారు .ఆ విధం గా మానవాళికి ఇవనోవిచ్ వికృత ప్రయోగాల బెడద తప్పినది .

శంభో శివ శంభోహః కార్తీకం శివ కేశవులకూ ఇష్టమైన మాసం . మరి గీతాచార్యుడు మాసానాం మార్గశీర్ష హ అని ఎందుకు చెప్పాడు అంటే వైష్...
11/12/2023

శంభో శివ శంభోహః కార్తీకం శివ కేశవులకూ ఇష్టమైన మాసం . మరి గీతాచార్యుడు మాసానాం మార్గశీర్ష హ అని ఎందుకు చెప్పాడు అంటే వైష్ణవులు గుడ్లు ఉరుమి చూస్తారు . శివాయహ్ విష్ణు రూపేణా శివః అంటే అవును అని అంగీకరిస్తారు . ఆకలి వేసిన వాడు అరిస్తే కూతలంటారు , కారుకూతలంటారు , కానీ అన్నీ అమిరినవాడు అరిస్తే వేదం అంటారు , అదే మంత్రం అంటారు . జీవులు విచిత్రం గా జీవిస్తారు . ఈ చన్నీళ్ళ స్నానాలూ , నైవేద్యాలూ , భోగాలూ అన్నీ అన్నార్తుల కోసమే అంటే ఒప్పుకోరేమో ? ఆరోగ్య సూత్రాలంటే అసలు వినరు కాబోలు . మతం మత్తులో నే సమాజానికి వైద్యం చేయాలి కాబోలు . ఏది ఏమి అయినా సామాన్యునికి ఇంత పుష్టికర నైవేద్య ఫలహారాలు దక్కేది కార్తీక మాసం లోనే ..

ఆర్టికల్ 370 రద్దు సమర్ధిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినది . రాజ్యాంగ రచన చేసిన 247 మంది బాబా సాహెబ్ అధ్యక్షత...
11/12/2023

ఆర్టికల్ 370 రద్దు సమర్ధిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినది . రాజ్యాంగ రచన చేసిన 247 మంది బాబా సాహెబ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆనాడే ఈ విషయం స్పష్ట పరిచారు . నెహ్రు గారి ప్రత్యేక శ్రద్ద తో ప్రవేశపెట్టబడిన ఈ 370 ఆర్టికల్ ను వ్యతిరేకిస్తూ అంబెడ్కర్ నిస్సహాయ మౌనం ను ఆశ్రయించారు .
మహా శక్తీ మాత సతీ దేవి పేరిట గల సతీ సరోవర్ కు కశ్యప మహర్షి వరాహ మూల న గండి పెట్టి నీటిని బయటకు పంప గా ఏర్పడిన భూభాగమే ఈ కశ్యపు పురి , నేటి కాశ్మీరు . వరాహ మూల ప్రాంతమే బరహ మూలగా , నేటి బారా ముల్లాగా ప్రసిద్ధి .పూర్తి వేదభూమిగా అవతిరించిన కాశ్మీర్ దుస్థికి కారణము పాలకులకు ఎడారిమతము ల ఫై వున్న అభిమానమే కారణం .
నేటికీ భారత్ అధీనములో కేవలం 43 శాతం కాశ్మీర్ భూభాగం కలదు . మ్యాప్ ల లో చూపించేది వాస్తవం కాదు .370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి అధికారాలు ఇవ్వబడ్డాయి .ఇక్కడ బయటివారు భూములు కొనగూడదు . ఇక్కడ స్త్రీ లను పెళ్లాడితే సదరు స్త్రీలకూ ఎటువంటి కాశ్మీరీ హక్కులు వుండవు . రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా కేంద్రము జోక్యం చేసుకోకూడదు .
ఇవన్నీ క్రమేపీ ఎడారిమతలను ప్రోత్సహించే చర్యలు .చివరకు లక్షలాది పండిట్ కుటుంబాల ఊచకోతకు దారితీసాయి . కొన్ని వుళ్ళు ఖాళీ అయిపోయి పరాయి మతస్తుల కబ్జాలోకి వెళ్లిపోయాయి . వేదం మూగబోయినది , హిందుమనవతుల రోదనలు క్రమేపి ఎడారిమత ప్రార్ధనులుగా మారాయి .
370 ఆర్టికల్ రద్దు తరువాత ఇన్ని ఏళ్లకు పరిస్థితులు కుదుటపడుతున్నాయి . హిందువులు జాగృతం కాక పోతే ప్రతి ప్రాంతం కాశ్మీరు లా అవుతుంది .

Address

Kukatpally

Telephone

+19848334394

Website

Alerts

Be the first to know and let us send you an email when Ping media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ping media:

Share