Namo TV

Namo TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Namo TV, Media/News Company, Shanmukh Empire, 83, Sri Sai Nagar, Ayyappa Socirty, Madhapur, Hyderabad Telangana, Hyderabad.

07/05/2021

#శ్రీకాకుళం జిల్లా #రేగిడిఆమదాలవలస మండలం #కొర్లవలస గ్రామంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గ్రామం మధ్యలో ఓ ఇంటికి వెనుక ఉన్న కిటికీ తాడుతో ఉరిపోసుకొని మృతిచెందాడు. ఈ సంఘటనపై గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

***de

07/05/2021

#రాజమండ్రి సబ్ జైలులో వార్డర్ గా పని చేస్తున్న కె.రామాంజనేయులు కరోనాతో మృతి చెందారు. #కొత్తపేట సబ్ జైలు నుంచి డిప్యూటేషన్ పై రాజమండ్రి సబ్ జైలు డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన గత కొద్దిరోజుల కిందట కరోనా బారినపడడంతో ఇంట్లో ఐషోలేషన్లో ఉన్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రకాష్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

07/05/2021

#రంగారెడ్డి జిల్లా #రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని #ఎస్వోటీ పోలీసులు తో పాటు రాజేంద్రనగర్ పోలీసులు కలిసి జాయింట్ #ఆపరేషన్ నిర్వహించారు. రాజేంద్రనగర్ టోల్ గేట్ వద్ద జరదా గుట్కాలు గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కి తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు గుల్బర్గా నుంచి హైదరాబాదుకు రాజేంద్రనగర్ టోల్గేట్ సమీపంలోని పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపుగా 150 బ్యాగుల స్వాధీనం చేసుకున్నారు. మూడు ట్రాలీ ఆటోలలో దాదాపు 15 లక్షల రూపాయలు విలువగల జర్దా గుట్కా ప్యాకెట్లు తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని, ఆటోను సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

07/05/2021

#పశ్చిమగోదావరి జిల్లా #ఉండ్రాజవరం గ్రామంలో #సభిహ రైస్ మిల్ లో సుమారు 2500 క్వింటాలు రైస్ అక్రమంగా నిల్వలను విజిలెన్స్ అధికారులు గుర్తించి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

07/05/2021

#తూర్పుగోదావరి జిల్లా #రాజమండ్రి #రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ #సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే మేము మాట్లాడినది యధాతధంగా నిరూపించాలని సవాల్ విసిరారు.

07/05/2021

#బెంగుళూరు #అసెంబ్లీ ఎదుట ఓ కుటుంబం నిరసనకు దిగింది. కుటుంబం మొత్తం #పాజిటివ్ అవ్వడంతో‌ అసుపత్రిలో చేరడానికి ప్రయత్నిస్తే ఏ ఆసుపత్రిలో కూడా ప్రవేశం దొరకలేదు.. దీంతో వారు #విదానసౌద ఎదుట ఆందోళన చేస్తుండగా పోలీసులు #అంబులెన్స్ పిలిపించి వారిని అసుపత్రికి తరలించారు.. బెంగుళూరు సిటి అసుపత్రులలో బెడ్స్ కొరతకు ఈ ఘటనే నిదర్శనం అని చెప్పొచ్చు.

07/05/2021

#అనంతపురం జిల్లా #మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దేశంలో #కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో స్పందించారు.. రోజువారీ కేసులు మూడు రెట్లు పెరుగుతున్నాయని అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

07/05/2021

మాజీ #మంత్రి ఈటెల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర రెడ్డి భేటి అయ్యారు. ఈటెల రాజేందర్ నాకు పాత మిత్రుడని, ఆయన భార్య జమున మాకు బంధువు అందుకే మర్యాదపూర్వకంగా కలిసాను. తెరాస పార్టీ బర్త్ రఫ్ వార్త విని సానుభూతి తెలపడానికి వచ్చాను గాని నేను రాజకీయ నాయకుడిగా రాలేదు రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పుకొచ్చారు.

07/05/2021

శ్రీ పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని #శ్రీహరికోట #అంతరిక్ష పరిశోధన #కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల కానీలలో #కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇస్రో హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికీ #డ్రోన్ ల సహాయంతో సేవలు అందించడానికి ట్రయిల్ రన్ చేసారు. ఇప్పటికే కరోనా బారిన పడి 25 మందికి పైగా మరణించి ఉండటం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారినపడి హోమ్ క్వారంటైన్ లో ఉండటం తో ఇస్రో డ్రోన్ ల సహాయం తో సేవలు అందించడానికి ప్రయోగాత్మక ప్రయత్నాలు చేసింది. ఇస్రో కానీలలో డ్రోన్ల సహాయం తో మందులను పిచికారీ చేయడంతో పాటు కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉండే వారి ఇంటికి డ్రోన్ ల సహాయంతో వారికీ అవసరమైన మందులను, కూరగాయలను అందించాలని నిర్ణయించారు. దీనికోసం #గరుడా #ఏరోస్పేస్ కంపెనీ సహకారాన్ని అందిస్తుంది.

07/05/2021

#రంగారెడ్డి జిల్లా #రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు సంవత్సరాల పసిపాపని గొంతు నులిమి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ లోని ఓ కుటుంబ వివాదంలో గొడవ జరగడంతో గొంతు నులిమి చంపారని అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పాపని #నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు. నీలోఫర్ హాస్పిటల్ లోని డాక్టర్లు ఇది హత్య అని తేల్చడంతో, కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోనే పాప నిదురిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులకు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు హత్య చేసింది కుటుంబ సభ్యులే అనే అనుమానంతోనే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

06/05/2021

#పెద్దపల్లి జిల్లా #గోదావరిఖని ప్రైవేటు ఆసుపత్రుల్లో #కరోనా టెస్టుల పేరుతో అమాయకుల నుండి వేలకు వేల రూపాయలు గుంజుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి నుండి కరోనా కిట్లను తీసుకువచ్చి ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షలకోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఉండడంతో కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. వీరి భయాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు ఒక్కొక్క పరీక్షకు 2500 నుండి మూడు వేల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ గా తేలిన వారికి ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు ఇస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ల్యాబ్ టెక్నీషియన్లు కోవిడ్ పరీక్షల పేరుతో అమాయకులను మోసం చేస్తుంటే ప్రభుత్వ వైద్యాధికారులు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

06/05/2021

#రాజమండ్రి #ఎంపీ మార్గాని భరత్ #పేపర్ మిల్స్ ని సందర్శించారు. #ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఎంత వరకు నిల్వలు ఉన్నాయనే విషయాన్నీ తెలుసుకున్నారు. చాల కాలంగా ఆ ప్లాంట్ రిపేర్ ఉండడం వాళ్ళ ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోయిందని, ప్లాంట్ రిపేర్ కి అవసరమైన సదుపాయాలను అందిస్తామని భరత్ చెప్పారు.

Address

Shanmukh Empire, 83, Sri Sai Nagar, Ayyappa Socirty, Madhapur, Hyderabad Telangana
Hyderabad
500081

Website

Alerts

Be the first to know and let us send you an email when Namo TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Namo TV:

Share