
17/03/2024
VIKARABAD NEWS
వికారాబాద్ జిల్లా సిరిపుర గ్రామం లోని శివాలయం ఆలయానికి సర్వే నంబర్ 280,335,336 లో సుమారు 20.27 ఎకరాల భూమి శివాలయం భాగోగులు చూసే అనంత బట్టం పేరిట ఉంది. ధరణి రికార్డుల ప్రకారం అవి ఇనామ్ భూములుగా నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా శివాలయం భాగోగులు చూసే వారి అధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ సాగుతోంది. ఇటీవల ఈ భూముల్ని అమ్ముతున్నారు అన్నే ప్రచారం సాగుతుంది . దాదాపు నెల కిందట సర్వే చేయించి యజ్ఞ నారాయణ అన్నే పేరు మిద పట్టా చేయించారు అన్ని ధరణి లో చూపిస్తుంది . వాస్తవానికి దేవాలయనికి సంబంధించిన ఇనాం భూముల్ని అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. అలాంటిది వాటిని ఎలా అమ్ముతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విక్రయించ వీలులేకున్నా..
దేవాదాయ చట్టం, ఇనాం చట్టాల ప్రకారం దేవాలయాల నిర్వహణ కోసం ఇనాంగా పొందిన భూముల్ని ఇనాందారులు వారసత్వంగా అనుభవించేందుకు అవకాశం ఉంది. కానీ విక్రయించేందుకు వీలులేదు. కానీ ప్రస్తుతం శివాలయం భూములున్న ప్రాంతం బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.కోటి పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములపై ఓఆర్సీ పొందడం ద్వారా వాటిని అమ్మేందుకు గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మర్పల్లి మండల రెవిన్యూ ఉన్నతాధికారుల అండదండలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.