18/08/2024
12-08-2024
చింతపండుకు తొలగుతున్న చీకటి రోజులు :
ఈ ఏడాది తూర్పు భారత్లోని ఝార్ఖండ్, బీహార్, బెంగాల్nమరియు ఛత్తీస్గఢ్లో చింతపండు ఉత్పత్తి కుంటుపడింది. ఎందుకనగా పలు ప్రాంతాలలో పూత, కాత తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో ఇదే పరిస్థితి నెలకొన్నది. కావున శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు ధరలు కొండెక్కుతున్నాయి. 2025 చింతపండు వ్యాపారులకు వరప్రదాయినిగా మారనున్నది.
ఆంధ్రప్రదేశ్లో గత వారం 25-30 వాహనాలు, కర్ణాటకలో 8-10 వాహనాలు, తెలంగాణలో 6-7 వాహనాలు, తమిళనాడులో 45-50 వాహనాలు
మరియు మధ్య ప్రదేశ్లో 2-3 వాహనాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్తో పాటు తూర్పు భారత రాష్ట్రాలలో 10-55 వాహనాల శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు అమ్మకమైంది.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 25-30 వాహనాలు, కర్ణాటకలో 8-10, తెలంగాణలో 6-7, తమిళనాడులో 45-50, మధ్య ప్రదేశ్ లో 2-3, ఒడిశ్శా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ లో కలిసి 10-55 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ మార్కెట్లో గత వారం 7-8, పుంగనూరులో 20-25 వాహనాలు, సాలూరులో 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, హిందుపూర్లో సిల్వర్ మేలిమి రకం రూ. 20,000-27,000, మేలిమి రకం సరుకు రూ. 15,000-18,000, మీడియం రంగు సరుకు రూ. 14,500-15,000, సాధారణ రకం రూ. 13,500 - 15,000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 9500 -11,000, మీడియం రూ. 8000 -9000, సాధారణ రకం రూ. 6,500 - 7,800, మరియు పుంగనూరులో చింతపండు అమ్మకంపై చపాతీ రూ. 10,000 - 11,000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 11,500 -12,500, మీడియం సరుకు స్థానికంగా రూ. 7000-8500, గింజ సరుకు రూ. 4200–4800 మరియు సాలూరులో రాబడిపై సెమీఫ్లవర్ బెస్ట్ రూ. 10,000-10,500, మీడియం రూ. 7800-8500, 50 శాతం రంగు సరుకు రూ. 6200-6500, గింజ సరుకు రూ. 4200-4500 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బెల్గాంవ్లో మహారాష్ట్ర ఫ్లవర్ బెస్ట్ రూ. 12,000-13,000, స్థానికంగా రూ.8000-9,000, తుంకూరులో మేలిమి రకం రంగు వెలిసిన సరుకు రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఓం బ్రాండ్ రూ. 11,500, ఫ్లవర్ మీడియం సరుకు రూ. 7500-8000, ఎసి గింజ సరుకు రూ. 4000 - 4200 దరతో వ్యాపారమైంది.
హైదరాబాద్ మార్కెట్లో కర్ణాటక, తెలంగాణ నుండి 10-12 వాహనాల శీతల గిడ్డంగుల చింతపండు అమ్మకంపై స్థానికంగా రూ. 9000-10,000, కర్ణాటక సరుకు రూ. 8,500 - 9,000, మహారాష్ట్ర సరుకు రూ. 10,000 -13,500 ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో కలిసి వారంలో 55-60 వాహనాల సరుకు అమ్మకంపై చపాతీ రూ. 8000-8500,
మహారాష్ట్ర సరుకు రూ. 9,500-9,700,
గింజ సరుకు స్థానికంగా రూ. 4000 - 4200, మహారాష్ట్ర సరుకు రూ. 4500-4700,
నలగ్గొట్టని చింతపండు రూ. 2500- 2800, మహారాష్ట్ర సరుకు రూ. 4500-4700,
నలగొట్టని చింతపండు రూ. 2500-2800, మహారాష్ట్ర సరుకు రూ. 3400-3600, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో వారంలో 12-15 వాహనాల చింతపండు అమ్మకంపై గింజ సరుకు రూ. 4200-4200, మీడియం రూ. 3200–3300, ఫ్లవర్ మీడియం రూ. 7000-7500, రాంచీ సరుకు రూ. 4200-4800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
చింత గింజలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరులో చింతగింజలు రూ. 3150, పప్పు బారీ డెలివరి రూ.5700, సూరత్ డెలివరి రూ. 5800, పొడి రూ. 6800-7000, సాలూరులో రూ. 1-2 వాహనాల సరుకు రాబడిపై రూ. 2950, పుంగనూరు డెలివరి రూ. 3250, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ మార్కెట్లో 1-2 వాహనాల సరుకు అమ్మకం కాగా, బార్షీ డెలివరి రూ. 3300, గుజరాత్ డెలివరి రూ.3500 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్ బార్షీ, అహ్మద్ నగర్ మార్కెట్లలో చింతగింజలు రూ. 3150-3250 మరియు తమిళనాడు లోని పాపరంపట్టి, క్రిష్ణగిరిలో 4-5 వాహనాల సరుకు రాబడిపై రూ. రూ. 3150 ధరతో వ్యాపారమైంది...
Copied