360 Media

360 Media తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ విశేషాల కోసం..

24/09/2025

ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు

అడ్డొచ్చిన యువకుడి కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన యువతి తరుపు బంధువులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ప్రవీణ్, శ్వేత అనే వ్యక్తులు

ఈరోజు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను ఎత్తుకెళ్లిన ఆమె బంధువులు

అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ కుటుంబ సభ్యులపై కారంపొడి జల్లి, దాడి చేసిన శ్వేత బంధువులు

ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు****************************టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిన...
24/09/2025

జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు
***************************
*టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని తదేకంగా మళ్ళీ మళ్ళీ చూడండి. ఈమె పేరు శ్రీపతి... చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్, తల్లి మల్లిక. కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు... శ్రీపతి కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.*

*పిల్లల చదువుకోసం ఆ కుటుంబం దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా ప్రధానంగా పోడు వ్యవసాయమే... అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు.*

*వాళ్ళది 'మలయలి' అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ... ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిక దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో మెరుగుగా రాణిస్తూ.. అందరికంటే ముందు ఉండడం, ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువణ్ణామలైలో "లా" కోర్సు చదివించారు.*

*బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. _"Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయం"_ లో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు, తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి , భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.*

*శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకోసం పట్టుదలగా చదివింది. తల్లి మల్లిక అనుక్షణం శ్రీపతి ని కనిపెట్టుకుని ఉంది. పరీక్ష రాయాల్సిన డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు చదవడం వదలలేదు శ్రీపతి.*

*నవంబర్ 27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత. పరీక్ష రాయల్సిన చోటు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో... అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. మొన్ననే... ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జ్ గా, _"మొట్టమొదటి గిరిజన మహిళగా"_ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది...*

*అకుంఠిత దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి , విజయాన్ని అందుకున్న _"ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ"_ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం కావాలి.*

*మరో సారి జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు... తెలుపుదాం🌹🌹👏👏👏*
-----------------------

తమిళనాడులోని మధురైలోని తియాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రాజగోపాలన్ వాసు...
24/09/2025

తమిళనాడులోని మధురైలోని తియాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో చేర్చడానికి ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేయడం ద్వారా రోడ్డు నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు చేశారు. 2002లో, తురిమిన ప్లాస్టిక్ వ్యర్థాలను బిటుమెన్‌తో కలిపి రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే సాంకేతికతను ఆయన ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుతున్న సమస్యను పరిష్కరించడమే కాకుండా రోడ్ల మన్నిక మరియు ఖర్చు-సమర్థతను కూడా పెంచుతుంది. ఈ పద్ధతిని అవలంబించినప్పటి నుండి, భారతదేశం ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి 100,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించింది, కనీసం 11 రాష్ట్రాలు ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతితో నిర్మించిన రోడ్లు భారీ వర్షాల నుండి నష్టానికి నిరోధకతను పెంచాయి మరియు నిర్వహణ అవసరాలను తగ్గించాయి. ఈ వినూత్న విధానం పర్యావరణ స్థిరత్వం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది. వ్యర్థాల నిర్వహణ మరియు రోడ్డు నిర్మాణంలో డాక్టర్ వాసుదేవన్ చేసిన అద్భుతమైన కృషి 2018లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మశ్రీని సంపాదించిపెట్టింది. ఆయన అంకితభావం పర్యావరణ సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలకు శాస్త్రీయ ఆవిష్కరణలు ఎలా దారితీస్తాయో వివరిస్తుంది. #భారతదేశ ప్లాస్టిక్ మ్యాన్ #సుస్థిర ఆవిష్కరణ #వ్యర్థాలకు సంపద #పర్యావరణ అనుకూల రోడ్లు #ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ #గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ #పద్మశ్రీ #పర్యావరణ హీరో #మంచి కోసం సైన్స్ #సుస్థిరతకు రహదారి

24/09/2025
పెళ్లయి ఏడాదే.. రూ.5 కోట్లు భరణం అడిగిన భార్య
24/09/2025

పెళ్లయి ఏడాదే.. రూ.5 కోట్లు భరణం అడిగిన భార్య

23/09/2025

మెదక్ జిల్లాలో గేదెపై అత్యాచారం చేసిన యువకుడు

చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో గేదెల షెడ్డులో పని చేస్తూ, ఓ గేదెను అత్యాచారం చేసిన బీహార్‌కు చెందిన రోహిత్

ఈ ఘటనను సీసీ కెమెరాల్లో చూసి రోహిత్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యజమాని సిద్ధిరాములు

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

గుజరాత్ లోని జాంనగర్ కి చెందిన చిరాగ్ అనే యువకుడికి, హిరాల్ అనే అమ్మాయితో మార్చిలో నిశ్చితార్థం అయింది. ఈ నెలలో పెళ్లి క...
20/09/2025

గుజరాత్ లోని జాంనగర్ కి చెందిన చిరాగ్ అనే యువకుడికి, హిరాల్ అనే అమ్మాయితో మార్చిలో నిశ్చితార్థం అయింది. ఈ నెలలో పెళ్లి కావలసి ఉంది.

పెళ్లి పనులలో భాగంగా ఇంటి బాల్కనీలో తుడుస్తూ ఉండగా హై వోల్టేజ్ కరెంట్ వైర్ తెగి హిరాల్ మీద పడింది.

కరెంట్ షాక్ తో ఆమెకు రెండు కాళ్లు, ఒక చెయ్యి తీసెయ్యాల్సి వచ్చింది. అయినా సరే... చిరాగ్ మాత్రం హిరాల్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు తోడుగా ఉన్నాడు.

నేటి బుద్ధిమాలిన యువతరం చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో.
హాట్సాఫ్ చిరాగ్.

20/09/2025

భారతీయులకు పిడుగులాంటి వార్త.. హెచ్‌-1బీ వీసాదరఖాస్తు రుసుం లక్ష డాలర్లు

ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి.
భారత్‌తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనున్న కొత్త హెచ్1బీ వీసా విధానం.

కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న..తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణజెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు ...
17/09/2025

కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ

జెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు కార్మికుల గుర్తు

పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర కమిటీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న

కేరళలో 16 ఏళ్ల బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగిక దాడినిందితుల్లో ఒక రాజకీయ నేత, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్‌బాల...
17/09/2025

కేరళలో 16 ఏళ్ల బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగిక దాడి

నిందితుల్లో ఒక రాజకీయ నేత, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్‌బాల్ కోచ్

ఓ గే డేటింగ్ యాప్‌లో బాలుడితో స్నేహం పెంచుకున్న నిందితులు

తన స్వస్థలం కాసరగోడ్, అలాగే కన్నూర్, కోజికోడ్ ఇలా వేర్వేరు ప్రాంతాల్లో రెండేళ్లుగా 14 మంది బాలుడిపై లైంగిక దాడి

తమ ఇంట్లో ఒక వ్యక్తి వచ్చి, పారిపోవడం చూసి బాలుడిని నిలదీసిన తల్లి

బాలుడి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు

పోక్సో చట్టం కింద 14 మందిపై కేసు నమోదు.. 9 మంది అరెస్టు

నిందితులంతా 25 నుండి 51 ఏళ్ల మధ్య వయస్సు వారని గుర్తింపు

Address

Hyderabad
508001

Alerts

Be the first to know and let us send you an email when 360 Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 360 Media:

Share