Bunker News tv

Bunker News tv news,analasys, reviews,stories,of socio economic political issues

It is very sad to inform that, Sri.Ramesh the DG, WALAMTARI got expired today early Morning.  RIP
29/03/2024

It is very sad to inform that, Sri.Ramesh the DG, WALAMTARI got expired today early Morning.

RIP

29/03/2024

ఇది ఆకులు రాలే కాలం. అలాగే మన పార్టీలో నుంచి పనికి రాని ఆకులన్నీ చెత్త కుప్పలో కలిసి పోతున్నాయి.

> హరీష్ రావు.

PIC OF THE DAY |
29/03/2024

PIC OF THE DAY |

ఆ ముగ్గురు | అరుదైన ఫోటో |>ఇద్దరు ఔట్ | > అధికారం వున్న చోటే మేమూ ఉంటాం! కడియం + కేకే.
29/03/2024

ఆ ముగ్గురు | అరుదైన ఫోటో |

>ఇద్దరు ఔట్ |

> అధికారం వున్న చోటే మేమూ ఉంటాం!
కడియం + కేకే.

29/03/2024
28/11/2023

'బిగ్ టీవి' రిపోర్టర్ సైదులుపై
SR NAGAR ACP దాడి

>BRS ఎమ్మెల్యే గోపీనాథ్ కు అనుకూలంగా పని చేస్తారని సదరు ACP పై ఆరోపణలున్నాయి. గోపీనాథ్ కు వ్యతిరేకంగా ఉన్న BRS నేతలపైన కూడా కేసులు పెట్టి వేధించారు. జర్నలిస్టు సైదులుపై జరిగిన దాడిని అందరూ ఖండించాలని జర్నలిస్టు సంఘాలు కోరాయి.

గులాబీ ప్రభంజనం ఖాయం..!ఉమ్మడి నల్లగొండ లో క్లీన్ స్వీప్ |> మంత్రి జగదీశ్ రెడ్డి.సూర్యాపేట:ముచ్చటగా మూడోసారి గెలుపు తథ్యం...
28/11/2023

గులాబీ ప్రభంజనం ఖాయం..!
ఉమ్మడి నల్లగొండ లో క్లీన్ స్వీప్ |

> మంత్రి జగదీశ్ రెడ్డి.

సూర్యాపేట:
ముచ్చటగా మూడోసారి గెలుపు తథ్యం..!గులాబీ ప్రభంజనం ఖాయం అని మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లో ఎన్నికల ప్రచారం లో బాగంగా చివరగా మీడియా తో మాట్లాడిన మంత్రి , ఉమ్మడి నల్లగొండ లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అన్నారు.కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు.విశ్వాసంతో చెబుతున్న విజయం మనదే అన్నారు.ఈ రెండు రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి,సోషల్ మీడియాలో మాయగాళ్ల ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి అని యువత కు బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.ప్రజలు బీఆర్ఎస్ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనీ, ఎక్కడికి వెళ్లినా ప్రచారంలో లభిస్తున్న ఘనమైన ఆదరణే దీనికి నిదర్శనం అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని మోసాలు చేసినా.. ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మడంలేదన్నారు.
రైతు బంధు ఆగిపోయింది కాంగ్రెస్ వల్లే అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ పెట్టదు,పెట్టేవాళ్ళనిఅడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారని అన్నారు.ప్రజల ఆదరణ చూస్తుంటే కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని నమ్మకం ఉందన్నారు.కాంగ్రెస్ దొంగ జపాలు ప్రజలకు వివరించినం అన్న మంత్రి, 2014 కు ముందూ,నేడు రాష్ట్రం పరిస్థితి బేరీజు వేసుకుంటే కేసీఆరే రాష్టానికి శ్రీరామ రక్ష అని తెలియజెప్పినం అన్నారు. అన్ని నియోజకర్గాల్లో
కాంగ్రెస్ , బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ని బేరీజు వేసుకుని పోలింగ్ బూతులకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కారు కి ఓటేసి కేసీఆర్ సార్ ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయాలని పిలుపు నిచ్చారు.

28/11/2023

60 రోజుల్లో హరీశ్ రావు అలుపెరుగని ప్రయాణం.
విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు.
80 పైగా ప్రచార సభలు, రోడ్ షోలు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు అక్టోబర్, నవంబర్ నెలలో నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రజా ఆశీర్వాద సభలు రోడ్ షో లో పాల్గొని ఆయా జిల్లాల క్యాడర్లో ఉత్తేజాన్ని నింపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి, మూడోసారి ఎన్నికైతే అమలు చేసే మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడంలో మంత్రి హరీష్ రావు సఫలీకృతుడయ్యాడు. ఎన్నికల్లో గెలిస్తే సన్న బియ్యం, రైతు బంద్, 400 లకే సిలిండర్.. వంటి హామీలను ప్రజలకు వివరించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. రిస్కు వద్దు కారుకే ఓటు గుద్దు అంటూ హరీష్ రావు ఇచ్చిన నినాదాలు ప్రజల్లో మార్మోగుతున్నాయి. కారు, హెలికాప్టర్ ద్వారా ఆయా జిల్లాల్లో జరిపిన హరీష్ రావు పర్యటనలు బిఆర్ఎస్ గెలుపును మరింత దగ్గర చేశాయి. రెండు నెలల పాటు కాలుకు బలపం కట్టుకొని తిరిగిన మంత్రి హరీశ్ రావు, సమయం వృధా కాకుండా ఆయా జిల్లాల కేడర్ తో కారు ప్రయాణాల్లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రచారం ఒకవైపు నిర్వహిస్తూనే మరోవైపు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, ఆరోపణలు ఎదుర్కొనేలా తెలంగాణ భవన్, ఇతర జిల్లాల్లో ఎన్నో ప్రెస్ మీట్లు నిర్వహించారు. టీవీ ఛానల్ లో నిర్వహించే డిబేట్లో పాల్గొని మూడోసారి తెలంగాణ లో బిఆర్ఎస్ సర్కారు ఏర్పాటు అవశ్యత గురించి వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని అదే వేదికగా తిప్పి కొట్టారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ విజయం గురించి వివరించారు. జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఉద్యోగ, ప్రైవేటు ఉద్యోగుల, కుల, మత సంఘాలతో మంత్రి హరీశ్ రావు సమావేశం అయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వస్తే చేస్ కార్యక్రమాల గురించి వివరించారు. బి ఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని, సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. తెలంగాణ భవన్ సహా వివిధ జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో వేల సంఖ్యలో బిజెపి కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నేతలు కార్యకర్తలు పార్టీలో చేరారు.
మెదక్, తాండూర్, ములుగు, నర్సంపేట, డోర్నకల్, నకిరేకల్, తుంగతుర్తి, మహేశ్వరం, కల్వకుర్తి, దుబ్బాక, గజ్వేల్, మక్తల్, కొడంగల్, దేవరకద్ర, జుక్కల్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, మానకొండూర్, సిద్దిపేట, మంచిర్యాల, చెన్నూరు, జహీరాబాద్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, అదిలాబాద్, స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మెదక్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్ చెరు, సిద్దిపేట, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, ఉప్పల్, హుజురాబాద్, ములుగు, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, మానకొండూరు, మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, జనగాం, ఆలేరు, భోంగిర్, రాజేంద్రనగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు.

https://youtu.be/8IRZnCAFRGc?si=Sx6L3oXUf4Lhgu89
27/11/2023

https://youtu.be/8IRZnCAFRGc?si=Sx6L3oXUf4Lhgu89

Minister Jagadish Reddy Election Campaign in Suryapet|బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి ముమ్మర ప్రచారం ...

23/11/2023

Journalist Zakir Analysis On Telangana People TS Elections Opinion | iDream News For more latest news updates, subscribe ...

Address

Hyderabad
500018

Alerts

Be the first to know and let us send you an email when Bunker News tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bunker News tv:

Share