Pns News Digital

Pns News Digital PNS News Digital is a Registered News Agency for both Print and Electronic Media under the Indian Government We at PNS aim to bring out Journalism at its best.

Our Goal is to bring the truth and unaltered news to our audience.

భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 ...
13/05/2025

భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

భారత జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ తో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు. ఇదివరకే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్న వారితో మాట్లాడి సేకరణకు సహకరించేలా చూడాలని అన్నారు. భూసేకరణలో ఉన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని భారత జాతీయ రహదారి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించారు. ఇందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

TELANGANA JOURNALISTS ASSOCIATION KI JANIB SE URDU GHAR MOGHALPURA HYDERABAD MEIN EK PROGRAMME MUNAQQIT KIYA GAYA JISMEI...
13/05/2025

TELANGANA JOURNALISTS ASSOCIATION KI JANIB SE URDU GHAR MOGHALPURA HYDERABAD MEIN EK PROGRAMME MUNAQQIT KIYA GAYA JISMEIN PNS NEWS INDIA KE HYDERABAD KE REPORTER JANAB WASEEM SAHAB KI SHAWL POSHI KI GAYI.

తేదీ 13-05-2025     జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు  పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సన జవేరియా తో కలసి పట్...
13/05/2025

తేదీ 13-05-2025

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సన జవేరియా తో కలసి పట్టణ ఆరోగ్య కేంద్రము హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారము జరుగుతున్న ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపు పరిశీలించి అక్కడికి వచ్చిన మహిళలకు వారికి అందుతున్న వైద్య సేవలు సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రం యొక్క హాజరు పట్టిక మరియు రికార్డులను తనిఖీ చేసి, ఫార్మసీ స్టోర్స్ లో మందుల నిల్వలను మరియు పేషెంట్లకు పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించడం జరిగింది. ఎన్ సి డి క్లినిక్ లోని అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ రోగులను పరీక్షిస్తున్న విధానాన్ని వివరాలను తెలుసుకొని వారికి పంపిణీ చేసిన మందుల వివరాల నమోదు రికార్డులను పరిశీలించడం జరిగింది.
ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులో హాజరైన మహిళలతో మాట్లాడుతూ అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య మహిళ క్యాంపులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీవ్ర పోషకాహారము లోపమున్న పిల్లలను బరువు తక్కువ ఉన్న పిల్లలను జిల్లా కేంద్రంలో ఉన్న పోషకాహార పునరావసకేంద్రానికి తరలించి వారికి పూర్తి స్వస్థత చేకూర్చాలన్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులో హౌసింగ్ బోర్డ్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసాద్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Sd/-
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
కరీంనగర్

*భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి*  *కలెక్టర్ పమేలా సత్పతి**దుద్దెనపల్లి, బొమ్మకల్ లో భూభారతి ర...
13/05/2025

*భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి*

*కలెక్టర్ పమేలా సత్పతి*

*దుద్దెనపల్లి, బొమ్మకల్ లో భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలన*

----------------------------------

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం సైదాపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామపంచాయతీ భవనంలో, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు.

రైతులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైదాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. భూభారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. భూ సమస్యలను పరిష్కరించుకుని, భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైదాపూర్ లోని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20 వ తేదీ వరకు సదస్సులు పూర్తయ్యాక, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.
సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని వేరుగా నమోదు చేసి రెవెన్యూ సదస్సులో ముగిసేలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మీ సేవా, ఆన్లైన్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంటే రైతులకు సహకరించి నమోదు అయ్యేట్టుగా చూడాలని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

WEAVERS DEPARTMENT PRESS NOTE
12/05/2025

WEAVERS DEPARTMENT PRESS NOTE

సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతు...
12/05/2025

సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో, టీజీవో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా అమరవీరుల స్తూపం వద్దకు చేరింది. ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఎన్ సీ సీ కేడేట్లు, నగరపాలిక కార్మికులు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ కొనసాగిస్తూ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాను మురళి నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు కాలీచరణ్, పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

AAJ URDU GHAR MOGHALPURA HYDERABAD MEIN TELANGANA JOURNALISTS ASSOCIATION KI JANIB SE EK PROGRAMME MUNAQQIT KIYA GAYA IS...
12/05/2025

AAJ URDU GHAR MOGHALPURA HYDERABAD MEIN TELANGANA JOURNALISTS ASSOCIATION KI JANIB SE EK PROGRAMME MUNAQQIT KIYA GAYA IS PROGRAMME KO JANAB UPPALA LAKSHMAN SAHAB, KV. RAMANA RAO SAHAB AUR M. R. GHOURI SAHAB GENERAL SECRETARY TJA NE REPORTERS KO MUQATIB KIYA

12/05/2025

# HYDERABAD URDU GHAR MEIN TELANGANA JOURNALISTS ASSOCIATION KI JANIB SE EK PROGRAMME MUNAQQIT KIYA GAYA IS PROGRAMME MEIN PNS NEWS INDIA EDITOR IN CHIEF & CHAIRMAN JANAB MA. WALI HAFEZ SAHAB AUR MEER MOHAMMED ALI SENIOR REPORTER PNS NEWS INDIA HYDERABAD KI SHAWL POSHI KI GAYI

12/05/2025

ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియ వేగవంతం చేయాలి

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసం వంటి వివిధ ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా
కరీంనగర్ నగరపాలక పరిధిలోని ప్రక్రియ వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లాగిన్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. అన్ని మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను పూర్తి చేయాలన్నారు. మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గ్రౌండింగ్ పూర్తి చేసి బ్యాంకర్లకు పంపించాలన్నారు. లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని పేర్కొన్నారు. రుణాల మంజూరులో దివ్యాంగులకు,ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు పొందని పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కొందరు యజమానులు నివాసయోగ్యానికి అనుమతి పొందిన భవనాలను వాణిజ్య దుకాణాలకు అద్దెకు ఇస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కమర్షియల్ గా కన్వర్ట్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెటర్నరీ ఉప కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని తెలిపారు. కొత్తగా మంజూరైన భవనాలకు స్థల ఎంపికను పోతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

*ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి*

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణి కి మొత్తం 264 దరఖాస్తు రాగా వాటి పరిష్కారానికి అధికారులకు బదిలీ చేశారు.

*నిర్లక్ష్యపు శిశువులకు అండగా 'ఊయల '*  *కలెక్టర్ పమేలా సత్పతి*  **కరీంనగర్ ఎంసీహెచ్ లో క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ ప్...
12/05/2025

*నిర్లక్ష్యపు శిశువులకు అండగా 'ఊయల '*
*కలెక్టర్ పమేలా సత్పతి*
**కరీంనగర్ ఎంసీహెచ్ లో క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ ప్రారంభం*

అప్పుడే పుట్టిన శిశువును వద్దనుకునే వారు నిర్లక్ష్యంగా రోడ్లపై, కొత్త కుప్పల్లో వదిలి వేయవద్దని, శిశువుల సంరక్షణ ఏర్పాటుచేసిన ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) లో, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మహిళా, శిశు, సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశువుల స్వీకరణ కేంద్రం ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువులను వద్దనుకునేవారు ఊయలను సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. శిశువులకు అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యం అందించి శిశుగృహకు తరలించి పెంచి పెద్ద చేస్తారని అన్నారు. ఈ ఊయల వద్ద ఎలాంటి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండదని, ఊయలలో వేసిన వారిపై నిఘా, విచారణ వంటివి ఉండవని తెలిపారు. వివరాలు వెల్లడించినప్పటికీ అవి గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. నేరుగా శిశువును అప్పగించాలనుకునేవారు 9490881098 నెంబర్ కు సమాచారం ఇవ్వవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. శిశువులను రోడ్ల పైన, చెత్తకుప్పల పైన వదిలేయడం వల్ల మరణించే అవకాశం ఉందని, ఎంతోమంది పిల్లలు లేని దంపతులు దత్తత కోసం ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వదిలి వేసిన శిశువులను చట్టప్రకారం దత్తత ఇస్తారని వివరించారు. ఆపదలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098ను సంప్రదించాలని సూచించారు. త్వరలో జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊయలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్ లో రైల్వేస్టేషన్లలోనూ ఊయల ప్రారంభిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిఎంహెచ్వో వెంకటరమణ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, డీసీపీఓ పర్వీన్, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఊయలను డీఎంహెచ్వో వెంకటరమణ, డీడబ్ల్యుఓ సరస్వతి ప్రారంభించారు.

ప్రజా వాణి"ప్రజావాణి"లో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ...
12/05/2025

ప్రజా వాణి"ప్రజావాణి"లో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 264 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

తేదీ 12-05-2025   ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు డి ఐ ఓ సాజిదా మరియు పిఓఎంసిహెచ్ డాక్టర్ సన ...
12/05/2025

తేదీ 12-05-2025

ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు డి ఐ ఓ సాజిదా మరియు పిఓఎంసిహెచ్ డాక్టర్ సన జవేరియాతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్ ను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం ద్వారా అందుతున్న సేవలు మరియు పెన్షనర్స్ కి, జర్నలిస్టులకు ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ ద్వారా అందుతున్న అవుట్ పేషెంట్ విభాగము సేవలను, లాబరేటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను, వారికి ఇస్తున్న మందుల వివరాలకు సంబంధించిన ఫార్మసీ రికార్డ్స్ ని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పెన్షనర్స్ ని, ఉద్యోగులను, జర్నలిస్టులను కలిసి మాట్లాడి ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ కి సంబంధించిన సేవలు అందుతున్న వివరాలను తెలుసుకొని ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sd/-
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
కరీంనగర్

Address

Princess Enclave Apartment Road Number 11, Mithila Nagar, Banjara Hills
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Pns News Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pns News Digital:

Share

Category