
02/01/2023
అరెస్టులతో పోరాటాలను ఆపలేరని, సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. నేడు సర్పంచ్ ల నిధులు తిరిగి వారి ఖాతాల్లో వేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్తున్నక్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచుల నిధులు దొంగలా కాజేసి వారిని అప్పుల్లో ముంచేసారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ నాయకులు సోమలింగం, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్ ఉన్నారు.