chara_vartha

chara_vartha Telugu social media news portal @ 24/7. కాలంతో పాటు కలం కూడా కొత్త అవతారానికి నాంది పలుకుతుంది.

అరెస్టులతో పోరాటాలను ఆపలేరని, సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజన...
02/01/2023

అరెస్టులతో పోరాటాలను ఆపలేరని, సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. నేడు సర్పంచ్ ల నిధులు తిరిగి వారి ఖాతాల్లో వేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్తున్నక్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచుల నిధులు దొంగలా కాజేసి వారిని అప్పుల్లో ముంచేసారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ నాయకులు సోమలింగం, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్ ఉన్నారు.

30/12/2022

హిందూ దేవుళ్లపై అనుచిత వాక్యాలు చేసిన వ్యక్తిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అతనిని అరెస్ట్ చేసి అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.

వికారాబాద్: మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటి రెడ్డి, IPS తెలిపారు.అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదని...
30/12/2022

వికారాబాద్: మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటి రెడ్డి, IPS తెలిపారు.అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.బైరీ నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ నందు cr. No.185/2022 u/s 153(A), 295(A),298, 505(2) IPC లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదన్నారు.ఇలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘాతం కలగచేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టీమిండియా క్రికెటర్ పంత్  రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను  ఢీకొట్టింది. అనం...
30/12/2022

టీమిండియా క్రికెటర్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే నడుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. శ్రీలంకతో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. ఇక క్రిస్మస్ వేడుకలను పంత్.

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బుధవారం ఉద...
30/12/2022

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఆమె చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ..'మహిమాన్వితమైన శతాబ్ది భగవంతుని పాదాల చెంత ఉంది. నిస్వార్థ కర్మయోగికి ప్రతీక. అమ్మ ప్రేమలో నేను ఎల్లప్పుడూ అనుభూతి చెందాను. విలువలకు కట్టుబడి ఉండే జీవితం ఆమెది.' అని రాసుకొచ్చారు.

సర్పంచులను మోసం చేసిన కేసీఆర్సర్పంచులకు అందాల్సిన నిధులను పక్కదారి పట్టించిన సీఎం కేసీఆర్ మోసకారియని 15ఆర్థిక సంఘం నిధుల...
29/12/2022

సర్పంచులను మోసం చేసిన కేసీఆర్
సర్పంచులకు అందాల్సిన నిధులను పక్కదారి పట్టించిన సీఎం కేసీఆర్ మోసకారియని 15ఆర్థిక సంఘం నిధుల స్వాహాతో బట్టబయలైందని డిసిసి ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంజనేయులు, భరత్ కుమార్, అంజిలయ్య, గోపాల్, కృష్ణయ్య, సోమలింగం ఉన్నారు.

పేద ప్రజలకు అండగా ఉంటాం : బీఆర్ఎస్ నేత వడ్ల నందువికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్రె...
28/12/2022

పేద ప్రజలకు అండగా ఉంటాం : బీఆర్ఎస్ నేత వడ్ల నందు
వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్రెడ్డి గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వడ్ల నందు తన వంథు సాయంగా 1,50,000/- రూపాయలను తన ఫౌండెషన్ నుండి బాదితుడికి ఇవ్వడం జరిగింది. ఆస్పత్రి సూపరిండెంట్ రవికి బుధవారం నాడు వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ యువజన నాయకులు వడ్ల నందు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వడ్లనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజేందర్ రెడ్డి చికిత్స సమయంలో తన సాయంగా లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం మొత్తం లక్ష యాభై వేల రూపాయలను చికిత్స నిమిత్తం అందజేసినట్టు నందు పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కు...
28/12/2022

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం పదవులను త్యాగం చేసి దేశ క్షేమమే తమ అభిమతంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పనిచేశారని పేర్కొన్నారు. రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు.

28/12/2022

సర్పంచుల నిధులు తీసుకోవడం తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లకు వచ్చిన నిధులను తీసుకోవడం తీవ్రమైన అన్యాయమని డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గ కేంద్రంలో నియోజవర్గ సర్పంచులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గత కొన్ని రోజులుగా అడవుల్లో గ్రామ శివారులో కనిపించే క్షుద్ర పూజలు ఇప్పుడు పిల్లలు చదువుకునే పాఠశాలలకు చేరుకున్నాయి . విక...
28/12/2022

గత కొన్ని రోజులుగా అడవుల్లో గ్రామ శివారులో కనిపించే క్షుద్ర పూజలు ఇప్పుడు పిల్లలు చదువుకునే పాఠశాలలకు చేరుకున్నాయి . వికారాబాద్ జిల్లా కెంద్రంలోని మైలార్ దేవరపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం సోమవారం వరుసగా సెలవులు రావడం తో కొందరూ పాఠశాలలోని 9వ తరగతి గదిలో కుంకుమ పసుపు నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించారు. దీంతో మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో భయాందోళనకు గురయ్యారు . వెంటనే ఉపాధ్యాయులకు సూచించడంతో వారు గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డికి సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు.

కుల్కచర్ల  మండలంలో   వేరు వేరు రెండు గుల్లల్లో  చోరీ .....పాంబండపై  అమ్మవారి  కిరీటం  చోరీ.... దాస్యనాయక్   తండా  సేవాలా...
27/12/2022

కుల్కచర్ల మండలంలో వేరు వేరు రెండు గుల్లల్లో చోరీ .....పాంబండపై అమ్మవారి కిరీటం చోరీ.... దాస్యనాయక్ తండా సేవాలాల్ గుడిలో రెండు హుండీల అపహరణ

వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పరిధిలో వేరు వేరు రెండు గుల్లల్లో చోరీ జరిగింది . బండవేలకిచర్ల గ్రామ పాంబండపై అమ్మవారి గుడిలో మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు గుడి బయట , లోపల గేట్ల తాళాలు విరగా గోటి అమ్మవారి వెండి కిరీటం దొంగిలించారు . సంఘటన స్థలాన్ని దేవాలయ చైర్మన్ రాములు , పోలీస్ సిబ్బంది పరిశీలించారు . మండలంలో మారో దేవాలయం ముజాహితపూర్ దాస్యనాయక్ తండాలోని సేవాలాల్ గుడి తలుపుల తాళాలు విరగగొట్టి రెండు హుండీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు .

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలిప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష...
24/12/2022

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ఎర్ర గోవింద్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీశ్రీశ్రీ లోకమసంత్ ప్రభు దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిచంద్ర, జడ్పిటిసి రామదాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when chara_vartha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share