16/02/2023
Cinema Theater కొత్త రూపం ఎలా ఉండబోతుంది?.
LED డిస్‌ప్లే స్క్రీన్‌లో "పిక్సెల్ పిచ్"(P1.5 P2 P3 P4 P5) ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక చదరపు మీటరుకు అమర్చబడిన LEDల ను బట్టి వీడియో క్వాలిటీ ఉంటుంది.
పిక్సెల్ పిచ్ లేదా డాట్ పిచ్ దూరాన్ని మిల్లీమీటర్‌లలో కొలుస్తారు..
పిక్సెల్ పిచ్ అనేది పిక్సెల్ కి, ప్రక్కనే ఉన్న పిక్సెల్ కి మధ్య ఖాళీని సూచిస్తుంది, పెద్ద పిక్సెల్ పిచ్ అంటే పిక్సెల్ ల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుంది అని అర్థం. డిస్‌ప్లే రిజల్యూషన్ పిక్సెల్ సాంద్రత ని బట్టి ఉంటుంది.
అవసరానికి తగ్గట్టుగా సరైన పిక్సెల్ పిచ్‌ని ఎంచుకుంటే ఉత్తమమైన ప్రదర్శన విలువను పొందవచ్చు, LED ల సాంద్రత మరియు రిజల్యూషన్‌ని బట్టి ఎక్కువ పిక్సెల్ లతో అదే భౌతిక పరిమాణానికి సరిపోయే (display size) చిన్న పిక్సెల్ పిచ్ ని అమర్చవచ్చు..
చిన్న పిక్సెల్ పిచ్ ఉన్న display screen ధర చాలా ఎక్కువగా ఉంటుంది, చిన్న పిక్సెల్ పిచ్ display screen యొక్క దృశ్య నాణ్యతను మెరుగుపరుస్తుంది.
పిక్సెల్ పిచ్ మరియు పిక్సెల్ సాంద్రత:
ఒక చదరపు మీటరుకు అమర్చిన LED ల సాంద్రత విలువలు.
1. P5: 5mm 40,000.
2. P4: 4mm 62,500.
3. P3: 3mm 1,11,111.
4. P2.5 2.5mm 1,60,000.
5. P2: 2mm 2,50,000.
6. P1.6: 1.6mm 3,60,000.
P1.5: 1.5mm 4,44,444.
ప్రధానంగా పెద్ద పిక్సెల్ పిచ్ ఉన్న LED screens (Video walls) Events కోసం ఉపయోగిస్తారు.
ప్రస్తుతం సినిమా థియేటర్ లలో వాడుతున్న Silver screen ప్రత్యేకంగా తయారు చేయబడిన cloth లాంటిది.
కానీ పెరుగుతున్న technology ని వాడుకుంటూ Silver screen కి బదులు గా Samsung Onyx P 1.6 Pixel Pitch గలిగిన Onyx LED screens ని ఇండియా లో 10 స్క్రీన్ ల వరకు 2018 ప్రాంతం లో ప్రవేశ పెట్ట బడింది.
Future లో ఈ screen లు, సాధారణంగా 46 nits ప్రకాశం కలిగిన SDR video content ని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన technology ని ఉపయోగించుకుని తయారవుతున్న HDR 500 nits ప్రకాశం గలిగిన HDR Video Content ని ఫ్యూచర్ లో రాబోతున్న 10,000 nits ప్రకాశం గలిగిన Dolbye Vision Video Content ని ప్రదర్శించ గల సామర్ధ్యాన్ని కలిగి వుంటాయి.
దురదృష్టం కొద్దీ కరోనా వ్యాధి వలన theater కి ప్రజలు రావడం తగ్గిపోవడం తో ఈ technology విస్తృతి ఆగింది.
కానీ future లో అన్ని theater లు కూడా LED Screen లకు మార్పు చెందే అవకాశం ఉంది.
Dolby Vision అందుబాటు లోకి వచ్చినప్పుడు. Dolby Vision అనే Display technology తో 1,000 nits నుంచి 10,000 nits దాకా ప్రకాశవంతమైన తెరలు మనకు అందుబాటు లోకి వస్తాయి.
నా అంచనా ప్రకారం Amazon prime, Netflix, Sony, Disney లాంటి కొన్ని OTT సంస్థల ఆధీనం లోకి Theater లు వెళ్లిపోతాయి.
నోట్: ప్రస్తుతం మనం చూస్తున్న టెలివిజన్ లు కానీ LED walls కానీ 100 nits మాత్రమే ప్రకాశం కలిగి ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న Samsung ONYX LED Screen లు ప్రేక్షకులకు మాత్రం అద్భుతమైన దృశ్య వీక్షణ అందించ గలుగుతున్నాయి.