Vsr Breaking News

Vsr Breaking News About Political News And Local News

హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌ల్లో స‌రికొత్త రికార్డు న‌మోదైంది. రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలిపోయిందంటు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు వ...
06/10/2025

హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌ల్లో స‌రికొత్త రికార్డు న‌మోదైంది. రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలిపోయిందంటు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్న స‌మ‌యంలో ఎక‌రం ధ‌ర ఏకంగా 177 కోట్ల రూపాయ‌లు ప‌లికింది. రాయ‌దుర్గం లో 7.67 ఎక‌రాల భూమి హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. దీని ద్వారా టీజీఐఐసీ ఖాతాలో 1357 .59 కోట్ల రూపాయ‌లు జ‌మ‌కానున్నాయి. 2022 లో నియో పోలీస్ కోకాపేట ద‌గ్గ‌ర ఎక‌రం 100 కోట్ల రూపాయ‌లకు అమ్ముడుపోయింది. ఈ సారి 177 కోట్లు ప‌ల‌క‌డం ద్వారా ఈ రికార్డు బ‌ద్ద‌లైంది. ఈ ధ‌ర తో హైద‌రాబాద్ రియల్ ఎస్టేట్ లో స‌రికొత్త అధ్యాయం ప్రారంభ‌మైన‌ట్లు గా భావించాలి.

హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌ల్లో స‌రికొత్త రికార్డు న‌మోదైంది. రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలిపోయిందంటు బీఆర్ఎస్ పార్ట...

చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల మే...
06/10/2025

చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్ అక్టోబర్ 6, తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశారు. కుత్భుల్లాపూర్ పరిథిలోని చింతల్ లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర రూ.1,14,000 (లక్షా పధ్నాలుగు వేలు) పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్ ఐజి ఓపెన్ ప్లాట్ కు ఆఫ్ సెట్ ప్రైజ్ గా రూ.80 వేలు నిర్ధారించగా బహిరంగ వేలంలో చ.గజం రూ....

చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు హౌసింగ్...

ఫార్మా రంగంలో మరో మైలురాయి తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంప...
06/10/2025

ఫార్మా రంగంలో మరో మైలురాయి తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ.. సేవల విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది....

ఫార్మా రంగంలో మరో మైలురాయి తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ హైదరాబాద్ లో ఎల్...

తెలంగాణ లో భారీ ఐపిఎస్ ల బ‌దిలీలు జ‌రిగాయి. నూత‌న డీజీపీ గా శివ‌ధ‌ర్ రెడ్డి నియ‌మించిన ఇర‌వై నాలుగు గంటల్లోనే ఈ బ‌దిలీలు...
27/09/2025

తెలంగాణ లో భారీ ఐపిఎస్ ల బ‌దిలీలు జ‌రిగాయి. నూత‌న డీజీపీ గా శివ‌ధ‌ర్ రెడ్డి నియ‌మించిన ఇర‌వై నాలుగు గంటల్లోనే ఈ బ‌దిలీలు చోటు చేసుకున్నాయి. ఇంట‌లిజెన్స్ చీఫ్ గా విజ‌య్ కుమార్ ను నియ‌మించారు. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ గా స‌జ్జ‌నార్ ,సివిల్ స‌ప్ల‌యిస్ చైర్మ‌న్ గా స్టీఫెన్ ర‌వీంద్ర‌, ఆర్టీసీ ఎండీ గా నాగిరెడ్డి నియ‌మితుల‌య్యారు. ప‌లువురు ఐఎఎస్ ల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఐఏఎస్‌ల్లో ఆరుగురు బదిలీ... ఐపీఎస్‌ల్లో 23 మంది బదిలీ... హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌......

తెలంగాణ లో భారీ ఐపిఎస్ ల బ‌దిలీలు జ‌రిగాయి. నూత‌న డీజీపీ గా శివ‌ధ‌ర్ రెడ్డి నియ‌మించిన ఇర‌వై నాలుగు...

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తు తెలంగాణ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. గ‌తంలో ప్ర‌భు...
26/09/2025

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తు తెలంగాణ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. గ‌తంలో ప్ర‌భుత్వం ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్ లో పెట్ట‌డంతో జీవో తీసుకువ‌చ్చారు. విద్యా, ఉద్యోగాల‌తో పాటు రాజ‌కీయంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తు ఇప్ప‌టికే రాష్ట్ర శాస‌న‌స‌భ బిల్ల‌ను ఆమోదించి రాష్ట్ర‌ప‌తికి పంపించింది. అయితే ఇప్ప‌టికీ కేంద్రంపైన ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. రిజ‌ర్వేష‌న్లు 50 శాతానికి మించ‌కుండా చేసిన‌ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని స‌వ‌రిస్తు మ‌రో బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ కు పంపింది....

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తు తెలంగాణ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. గ‌త.....

తెలంగాణ డీజీపీ గా బి. శివ‌ధ‌ర్ రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్య‌మంత్రి రేవ...
26/09/2025

తెలంగాణ డీజీపీ గా బి. శివ‌ధ‌ర్ రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆయ‌న‌కు నియామ‌క ఉత్త‌ర్వుల‌ను అంద‌జేశారు. శివ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం తెలంగాణ ఇంట‌లిజెన్స్ చీఫ్ గా వ్య‌వ‌హారిస్తున్నారు. ప్ర‌స్తుతం డీజీపీ జితేంద‌ర్ ప‌ద‌వి విర‌మ‌ణ చేస్తున్నారు.

తెలంగాణ డీజీపీ గా బి. శివ‌ధ‌ర్ రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్య‌.....

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్ర‌క‌టించింది. పార్టీ అధ్య‌క్...
26/09/2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్ర‌క‌టించింది. పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. దివంగ‌త ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి సునీత‌. బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా సునీత‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని బీఆర్ఎస్ గ‌తంలోనే నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చే ఛాన్స్ ఉండటంతో అధికారికంగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్ర‌క‌టించింది. పార....

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని తెలంగాణ ముఖ్య‌...
26/09/2025

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడులో విజ‌య‌వంత‌మైన స్కీం త‌మ‌కు ఆద‌ర్శ‌మ‌ని ఆయ‌న తెలిపారు. చెన్నై లో జ‌రిగిన విద్య‌లో త‌మిళ‌నాడు ముందంజ అనే కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. త‌మిళ‌నాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్య‌క్ర‌మం హృద‌యాన్ని తాకింద‌న్నారు.పేద పిల్ల‌లు అర్థాక‌లితో పాఠ‌శాల‌ల‌కు వ‌స్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.పేద‌ల‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ అండ‌గా ఉంటున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ‌లో ప్రారంభిస్తున్న స్కిల్ యూనివ‌ర్సిటీ, స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ , ఐటీసీల గురించి స‌భ‌లో సీఎం వివ‌రించారు.

  వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని త.....

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ని...
26/09/2025

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఎల్ అండ్ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు ఎన్‌.వి.ఎస్‌. రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్‌ పాల్గొన్నారు....

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్...

Address

Hyderabad
500085

Alerts

Be the first to know and let us send you an email when Vsr Breaking News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share