Film Freaks

Film Freaks for film freaks

15/07/2021
96
14/07/2021

96

On The Road (2012)
18/11/2020

On The Road (2012)

18/11/2020

ఇందులో ఒక సీన్ ఉంటుంది. కొత్తగా ఓపెన్ చేసిన ఆఫీసులో అందరూ కూర్చొని ప్లానింగ్, బడ్జెట్టింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు,...
11/11/2020

ఇందులో ఒక సీన్ ఉంటుంది. కొత్తగా ఓపెన్ చేసిన ఆఫీసులో అందరూ కూర్చొని ప్లానింగ్, బడ్జెట్టింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు టీ అమ్మేవాడు వచ్చి టీ బాకీ 200 అయింది. ముందు అది కట్టండి, తరవాత కోట్లు సంపాదిద్దురు అని అంటాడు. నువ్వు ఎదో ఒకటి పిక్కేంత వరకూ ఎవ్వడు నిన్ను నమ్మడు. అంత వరుకు వాడ్ని జోకర్ లాగే చూస్తుంది సమాజం. ఎవ్వడు నమ్మడు, వాడ్ని వాడే నమ్మాలి. నీ కల కోసం ఎవ్వడు ఇక్కడ ఎదురుచూడడు! నీ కల నెరవేరడానికి ఎవ్వడు సహాయపడడు. చాలా సార్లు నీ కల కోసం నిన్నే అధిగమించాల్సి ఉంటుంది. దానికి అవరోధం కూడా నువ్వే ఉండచ్చు. సామర్థ్యం ఉన్న కొన్నిసార్లు ఆలస్యం జరగచ్చు, అప్పుడు విశ్వాసం, ఓపిక రెండే ఆయుధాలు. ప్రతిదాంట్లోనూ రిస్క్ ఉంటుంది. బ్రతకడమే పెద్ద రిస్క్. దాని ముందు అన్ని చిన్నవే. ఇవ్వన్నీ మ్యాజిక్ వర్డ్సలా ఉంటాయి. ప్రతి వాడు ప్రాక్టికల్ గా ఆలోచించమని సలహా ఇస్తాడు. డ్రీమర్ కి ఎవడి సలహాలు అవసరం లేదు, పొగరు, ఇగో, ఆటిట్యూడ్ లాంటి పదాలు నెగిటివ్ చేసేశారు. ఎప్పుడు ఏదీ ఎక్కడ వాడాలో అది వాడితే చాలు. ఎదగడానికి ఆకాశమే నీ హద్దు.

The Indian CreativesSeason 4
11/09/2020

The Indian Creatives
Season 4

Stanley Kubrick 92 వ జన్మదినం కుబ్రిక్, అతని సినిమాల గురించిన ఆశక్తికరమైన అంశాలు : 1.కుబ్రిక్ ఒక ఫోటోగ్రాఫర్ గా అతని జీవ...
26/07/2020

Stanley Kubrick 92 వ జన్మదినం

కుబ్రిక్, అతని సినిమాల గురించిన ఆశక్తికరమైన అంశాలు :

1.కుబ్రిక్ ఒక ఫోటోగ్రాఫర్ గా అతని జీవితాన్ని మొదలు పెట్టి ఫిల్మ్ డైరెక్షన్ దిశగా అడుగులు వేసాడు.

2.అతని సినిమాలలో కథలు అన్నీ సాహిత్యాన్ని ప్రధానంగా తీసుకునే తీయబడ్డాయి.

3. తను ముందు నుండి కూడా cinematography, editing, music కి ప్రాధాన్యత నిచ్చేవారు. అతడి ఆరంభ కాల Documentaries, మొదటి రెండు సినిమాలకు స్వయంగా ఆయనే వాటిని నిర్వర్తించాడు కూడా.

4. ఆయన సినిమాలలో అతనికి ఇష్టం లేకుండా, అసంతృప్తితో చేసిన సినిమా కిర్క్ డగ్లస్ తో చేసినటువంటి 'స్పార్టకస్'. అటుపై తన ఇష్టానికి భిన్నంగా ఏ సినిమాను తీయలేదు, దేనికి compromise కాలేదు సినిమాలలో.

5. అత్యధికంగా షూటింగ్ డేస్ తీసుకొని చేసిన సినిమా ఆయన చివరి సినిమా 'ఐస్ వైడ్ షట్' దాదాపు షూట్ కే 400 డేస్ అయ్యింది అంట.. దీని విడుదలకు ముందే ఫైనల్ కట్ ప్రివ్యూ కి 6 రోజుల తరువాతనే ఆయన మరణించారు.

6.తన జీవితకాలంలో అత్యంత ఇష్టంగా చేద్దాం అని చేయలేక విరమించుకున్న చిత్రాలు రెండు. ఒకటి నెపోలియన్ మీద పూర్తి స్థాయిలో చేద్దాం అనుకున్న సినిమా, రెండు Artificial intelligence. నెపోలియన్ మీద సినిమా చేయనప్పటికి దాని కోసం కలెక్ట్ చేసిన సమాచారంతో Barry Lyndon సినిమాతో సరిపెట్టుకున్నారు. Artificial intelligence సినిమాని చేసేందుకు అవసరమైన vfx టెక్నాలజీ అంతగా అప్పుడు లేకపోవడంతో దాని బాధ్యతలు స్పీల్ బర్గ్ కి ఇచ్చారు అంట.

7. నెపోలియన్ సినిమా కోసం ఆయన 15,000 locations photos, నెపోలియన్ యొక్క అలవాట్లు, వ్యవహార శైలికి సంబంధించి దాదాపు 17,000 నోట్స్ collect చేశారు అంట. వాటన్నిటినీ కలిపి ఒక పుస్తకం ఆ తరువాత ప్రింట్ చేశారు. దాని బరువు 4.5 Kg, 1112 పేజీలు కల ఆ పుస్తకం ఆ రీసెర్చ్ నోట్స్, ఫొటోలతో దొరుకుతుంది. 'Stanley Kubrick's Napoleon: The Greatest Movie Never Made' దాని పేరు.

8. కుబ్రిక్ కి మానవ సంబంధాలు చాలా తక్కువ, ఆఖరికి కుటుంబం, ఫ్రెండ్స్ తో కూడా. ఆయన సినిమాల్లో కూడా అది ప్రతిబింబిస్తుంది. ఆయన సినిమాలలో కూడా intellectuality, Intensity కే ప్రాధాన్యత ఉంటుంది. తప్ప ఆయన సినిమాలు emotionless గానే ఉంటాయి దాదాపు.

9.ఆయన జీవితం అంతా సినిమాలు, పుస్తకాలు మధ్య గడిపేవారట. మిగిలిన సమయం అంతా పెట్స్ మధ్య గడిపేవారట. పిల్లులు, కుక్కలతో ఆడుకోవడం ఒకటే ఆయనకి ఉన్న అలవాట్లలో ఒకటి.

10. ఎంతోమంది దర్శకులను inspire చేసిన దర్శకుడు కుబ్రిక్. పర్ఫెక్షన్ కి పెద్ద పీట వేసే దర్శకుడు. తాను అనుకున్న రిజల్ట్ కోసం మొండిగా పని చేసే వ్యక్తి. దాని కోసం అనేక వివాదాలను ఎదుర్కొన్న వ్యక్తి కూడా.

-Srinivas Teppala

చూసిన ప్రతిసారి ఇన్స్పైరింగ్ గా అనిపించే సినిమా భాగ్ మిల్కా భాగ్, అప్పట్నుంచీ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అంటే చాల...
17/07/2020

చూసిన ప్రతిసారి ఇన్స్పైరింగ్ గా అనిపించే సినిమా భాగ్ మిల్కా భాగ్, అప్పట్నుంచీ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అందులోని జిందా పాట చాలా ఇష్టం, సాంగ్ పిక్చరైసషన్లో ఒక ట్రాన్సిషన్ వాడుంటాడు, చూసి అడేబ్బా అనుకున్న అప్పట్లో. అదే మనిషి తీసిన mirzya చూసి ఏంది సామీ ఇది అనుకున్న. తరవాత ఆయన ఇంకో సినిమా తీసాడని కూడా తెలుసుకోలేదో లేదంటే మర్చిపోయానో తెలియదు. ఈరోజు మాటల మధ్యలో ఈయన టాపిక్ వస్తే ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కనపడ్డది, ఇప్పుడే కంప్లీట్ చేశా చూడడం. నెక్స్ట్ ఎదో toofan అంటా వెయిటింగ్ అప్ప ఇప్పట్నుంచి!
Rang De Basanti చూసి మావాడు ఒకడు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని గెట్టిగా ఫిక్స్ అయ్యి ఆప్రయత్నాల్లో ఉన్నాడు! అది సినిమా ప్రభావం! పోలీస్ సినిమాలు చూసి inspire అయ్యి డిపార్ట్మెంట్ చేరిన వాళ్ళు ఉన్నారు!

The Age of Innocence (1993)
17/06/2020

The Age of Innocence (1993)

15/05/2020

అవల్ అప్పడితాన్(1978)

100 Greatest Indian Films of All Time-01

ఓ వ్యక్తి ప్రస్తుత జీవితం,వారి ఆలోచనశైలి అన్నది వారి గత జీవితం యొక్క ప్రతిబింబంగానే ఉంటుంది. అవి భరించలేని చేదు నిజాలు అయినా, మధురానుభూతిని పంచే అనుభవాలు అయినా సరే. ఓ 12-15 ఏళ్ల మధ్య ఉండే పిల్లల మానసిక స్థితిపై ఇంట్లోని వ్యవహారాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. అక్కడి నుండే వారి ఆలోచనాశైలిలో మార్పు అనేది చోటుచేసుకోవడం జరుగుతుంది. దానిని బట్టే ఓ వ్యక్తి సమాజాన్ని చూసే దృక్పథంలో భిన్న అభిప్రాయాలు చోటుచేసుకుంటాయి.

మంజు( శ్రీప్రియ) ఓ advertising కంపెనీ లో ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. ఆమెకు ఎపుడు మగవారిపై ఓ విధమైన ఏవగింపు ఉంటుంది. తనపై ఛలోక్తులు విసిరే వాళ్లపై , తను కూడా ఎటువంటి జంకు బెంకు లేకుండా ధైర్యంగా ఛలోక్తులు విసురుతుంది. అందం,పొగరు, నోటి దురుసుతనం కల స్త్రీ. కానీ ఆమె మాటల్లో ఎపుడు నిజాయితీ, నిక్కచ్చితనం ఉంటుంది. కళ్లలో ఏదో కోల్పోయిన నిర్వేదం ఉంటుంది. మనసులో ఏదో గూడుకట్టుకున్న గతం తాలూకు బాధ ఉంటుంది. నిజమైన ప్రేమ కోసం పరితపించే హృదయం ఉంటుంది. అందరూ ఆమె దేహ ఆస్వాదన కోసం తపించేవారే గాని, ఆమె మనసులోని బాధను ఏకరువు పెడితే వినే నాధుడు అంటూ ఎవరు ఉండరు. అటువంటి ఆమె జీవితంలో గతాన్ని, గాయల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించే వ్యక్తే అరుణ్(కమల్ హాసన్).

అరుణ్(కమల్ హాసన్) త్యాగు(రజినీకాంత్) యొక్క మిత్రుడు. త్యాగు మంజు పని చేస్తున్న adevertising కంపెనీకి MD. అతడు ఒక స్త్రీలోలుడు. ఒక ప్రక్క మంజు కోసం చెడుగా మాట్లాడుతూనే మరోపక్క అవకాశం దొరికితే ఆమెను అనుభవించే ప్రయత్నం చేస్తాడు. స్త్రీలపై అతడికి విపరీతమైన వ్యామోహం. అవకాశం కోసం జిత్తులుమారిగా వ్యవహరించే వ్యక్తి. అరుణ్ కి మంజు కోసం, యావత్ స్త్రీ జాతి కోసం కూర్చోబెట్టి లెక్చర్స్ ఇస్తుంటాడు.

అరుణ్(కమల్ హాసన్) ఒక అభ్యుదయవాది.దర్శకుడు కావాలనుకుంటున్న వ్యక్తి. దానిలో భాగంగా స్త్రీల వెతలపై 'ములు వానిల్ ఒరు పాది'(సంపూర్ణ ఆకాశంలో ఓ సగం) అనే పేరు మీద documentry తియ్య తలపెడతాడు. అందులో భాగంగానే త్యాగు ద్వారా మంజును పరిచయం చేసుకుని, ఆమె సహాయంతో ముందుకు సాగుతాడు. అరుణ్ ని కూడా ఆమె మొదట్లో అందరి పురుషులలాగా భావించి అతడిని చాలా దూరం పెడుతుంది. పోను పోను ఆమె వైఖరిలో మార్పు చోటుచేసుకుంటుంది. ఆమె బాధని, జీవితంలో తనకి ఎదురైన గతం తాలూకు చేదు అనుభవాలను అతడికి మాత్రం వ్యక్త పరుస్తుంది. అరుణ్ దానిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రక్రియలో ఆమె అతడి మనసుకు చేరువ అవుతుంది.ఆమెతో జీవితం పంచు కోవాలనుకుంటాడు. మంజు తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాల మూలంగాను, గతంలో ఇద్దరి ప్రేమ విషయంలో చేసిన తప్పిదాల మూలంగాను అరుణ్ మంచితనం, ప్రేమ ఆమెకు తెలిసినప్పటికీ, మళ్లీ ఇంకోసారి ఇంకో గాయాన్ని తట్టుకునే శక్తి తనకు లేదని తెలిసి అతడిని దూరం పెడుతూ వస్తుంది. ఒక స్థితిలో ఆమె ఎంతకాదన్న అతడిపై ప్రేమను చంపుకోలేక పరితపిస్తుంది. కానీ అప్పటికే పరిస్థితులు ఆమె చెయ్య దాటిపోతాయి. అటుపై ఆమె జీవితం ఏ తీరం చేరింది అన్నదే మిగిలిన కథ.

తమిళంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చి సినిమా తీసిన మొదటి వ్యక్తిగా ఈ చిత్ర దర్శకుడు C. రుద్రయ్యను అభివర్ణిస్తారు. అయితే ఆయన జీవితంలో తీసింది రెండు సినిమాలే. ఒకటి ఇది రెండో చిత్రం 'గ్రామత్తు అధ్యాయం(1980)'. అక్టోబర్ 30, 2019 కి ఈ సినిమా వచ్చి 41 ఏళ్లు కావస్తోంది. ఈ సినిమా అంతగా ఆడనప్పటికి భారతి రాజా, మృణాల్ సేన్ నుండి ఈ చిత్రానికి మంచి ప్రతిస్పందన వచ్చింది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం ఇది. ఆ 2 చిత్రాల తరువాత ఎందుకో ఆ దర్శకుడు మరే చిత్రం చెయ్యలేదు. ఆయాన కడు బీదరికంతో, వ్యాధితో కాలం చెందారు అన్నది మాత్రం తెలుసు. మధ్యలో ఎందుకో ఆయన 1988 లోను , 2008 లో డేనియల్ బాలాజీ ని హీరోగా పెట్టి సినిమా తీసే ప్రయత్నాలు అయితే జరిగాయి అంట గాని,ఎందుకో అవి కార్యరూపం దాల్చలేదు. అటుపై 2014 ఆయన కాలం చెందారు.

నాకు తెలిసినంతలో premarital s*x కోసం, ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువమందితో ప్రేమ వ్యవహారం గురించి,women liberation గురించి, psychological గా బాల్యంలో ఓ స్త్రీకి ఎదురైన అనుభవాలు ఆ మనసులో ఎటువంటి ప్రభావం చూపుతాయి అన్నది చాలా కూలంకషంగా చర్చకు తెచ్చిన మొదటి తమిళ సినిమా ఇది. ఇందులో స్త్రీ వాదం, సాధికారత,సమానత్వం, వారి వెతలు గురించిన చర్చ ఉంటుంది. అయితే ఊకదంపుడు ఉపన్యాసాలు, భారీ సందేశాలు అంటూ ఏమి ఉండవు. ఒక స్త్రీ జీవితం గురించిన కథ అంతే.

మేకింగ్ పరంగా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. భారతీయ సినిమాల్లో 100 అత్యుత్తమ సినిమాల్లో సముచిత స్థానం ఉండే సినిమా ఇది. న్యూ వేవ్ సినిమాకి తమిళంలో అంకురం ఇది.కథ పరంగానూ, సాంకేతికత పరంగానూ తమిళ సినిమాకి ఇదొక రిఫరెన్స్ లాంటి సినిమా అంటారు. సినిమా మేకింగ్ అంతా ఫ్రెంచ్ ఫిల్మ్ స్టైల్ లో ఉంటుంది.ఇదొక కారెక్టర్ driven ఫిల్మ్. సినిమాటోగ్రఫీ చాలా క్లాస్ గా, stylish గా ఉంటుంది అప్పటి సినిమాలతో పోలిస్తే.C. Rudhraiya,
Somasundareshwar,
Vanna Nilavan అని మొత్తం ముగ్గురు పని చేసారు screenplay కి. ఎడిటింగ్ కూడా బాగుంటుంది. లైవ్ డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మాటలు ఉబుసుపోక రాసినట్లు కాకుండా చాలా అర్థవంతంగా, శక్తివంతంగా ఉంటాయి.ఇళయరాజా సంగీతం వంక పెట్టలేం, అద్భుతం అంతే.ఆయన తమ్ముడు గంగై అమరన్, ఇంకా కన్నదాసన్ రాసిన పాటలు ఒక అద్భుతం అని చెప్పాలి. జానకి పాడిన వాళ్ కై ఓడం సేరుమ్ పాట, కమల్ పాడిన పన్నీర్ పుష్పంగల్ పాట, వురవుగల్ తొడర్ కథై సాంగ్ అంటే అమితమైన ఇష్టం. రజనీకాంత్ కెరియర్ లో నటనపరంగా బాగా చేసిన అతి కొద్ది మంచి చిత్రాలలో ఇది ఒకటి. అప్పట్లో ఓ కొత్త దర్శకుడిని నమ్మి కమల్, రజినీకాంత్ లు అసలు ఇటువంటి చిత్రం చెయ్యడమే నిజానికి ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే కమల్ అప్పటికే పెద్ద స్టార్ హీరో. వ్యక్తిగతంగా బాగా ఇష్టమైన చిత్రం ఇది. అప్పటికి కమల్ చేసినటువంటి ‘ఎర్ర గులాబీలు, రజినీకాంత్ చేసినటు వంటి ‘తప్పు తాళంగళ్’ సినిమాలు బారీగా ఆడితే, ఈ సినిమా మాత్రం పరజాయం పాలైంది. అందుకు కారణం అప్పటి ప్రజల అవగాహనా స్థాయిని మించిన సినిమా కావడమే అన్నది గమనించతగ్గ విషయం.

చిత్రంలో నాకు నచ్చిన అద్భుతమైన మాటలు కొన్ని:

ఏదో ఒక మృగం ఆడుతున్నది ఆస్వాదిస్తున్నట్లు నన్ను ఆడించి వదిలి

వీళ్లంతా ఆస్వాదిస్తున్నారు.దాన్ని తలిస్తే నాకు వికారంగా ఉంది. నిజంగా ఇది కళ కాదు. అయితే బ్రతికేందుకు ఒక దారి. నాకో ఆకలి...నన్ను చూసేవారికి వారికొక ఆకలి. వాళ్ల డబ్బులను దోచుకునేందుకు, నన్ను నేను ఒలుచుకుంటున్నాను.. అంతే..ఇలా అర్ధనగ్నంగా ఆడుతానని నేను పుట్టేటప్పుడే తెలిసి ఉంటే అప్పుడే చచ్చి ఉండేదాన్ని.

సినిమా తీస్తున్నారు అంటే మేకప్ వేసుకోవాలే. వేసుకోవాలి..మీరు ఎపుడు వేసుకుంటారే సొసైటీ మేకప్ అది వేసుకుంటే చాలు.

మగాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి lady గురించి ఆలోచిస్తారు,లేదా తన లక్ కోసం ఆలోచిస్తారు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా ఆడోళ్ల కోసం అయితే కాదు.

జననంలోను సరి, అలవాట్లలోను సరి, బెడ్ రూమ్ లోను సరి స్త్రీపురుషులు ఇరువురు నిజానికి సమంగా ఉండేందుకు వీలు లేదు. ముఖ్యంగా బెడ్ రూమ్ లో సమానత్వానికి చోటే లేదు.

ఈ స్త్రీలు ,రాజకీయనాయకులు ఇద్దరూ ఒకటే. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు ఏమైనా చేస్తారు.కానీ వాళ్లు ఏమి కోరుకుంటున్నారో వాళ్లకే తెలియదు.

కొన్ని కలలను తలపించే జ్ఞాపకాలు చాలా మధురమైనవి. నిజాలు చాలా చేదైనవి.

మీరెందుకు కనుబొమ్మలను artificial గా చేసుకుంటున్నారు..అన్నీ సహజంగా ఉంటే ఎవరు సార్ ఆస్వాదిస్తున్నారు.

సినిమాను అందరూ ఇష్టపడే చూస్తున్నారు. అందులో నటించే వారిని మాత్రం చాలా చెడ్డవారిగానే చూస్తున్నారే. కెమెరా ముందర నిలబడితేనే ఆమె ఒక శీలం పోయిన వ్యక్తిగా చూస్తుంటేనే చిర్రెత్తుకొస్తుంది. సినిమాలోకానికి బయట మాత్రం కురవమనగానే వర్షం కురిపించే స్త్రీలుగానే ఉన్నారా ఏమిటి అంతా???

ఈ లోకాన కష్టాన్ని ఇచ్చేవి రెండే ఒకటి బీదరికం, ఇంకోటి చావు.ఈ లోకంలో అన్నిటికి సబ్స్టిట్యూట్ ఉంది రెండుకు తప్ప. ఒకటి డబ్బు, రెండు ప్రాణం.

చిత్రంలోని ముగింపు కవిత:

తగలబడిన ఇల్లు

తెగిపోయిన బంధాలు

చెదిరిపోయిన స్వప్నాలు

మోయలేని శోకాలు

మళ్లీ ఓ సారి మంజూ మరణించింది

ఈ చావును సహించుకునేందుకు

మంజుకు వీలుపడలేదు

ఆమె జన్మిస్తుంది

మరణిస్తుంది

మరణంతో జన్మిస్తుంది

ఆమె అంతే.....

Movie : Aval Appadithan (1978)

Language : Tamil

Director : Rudraiah C.

Source : Youtube (No Subtitles)

- Srinivas Teppala

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Film Freaks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Film Freaks:

Share