Edi matter

Edi matter Information related to Health, Education, Entertainment, Events, Motivation, Management, Marketing,

*యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా   నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః🙏ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆ...
22/09/2025

*యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః🙏

ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కున జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం… త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.

నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, శ్రీశైలంలో అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి.

నవదుర్గలు :

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవదుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

ధ్యానo :

యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్
సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా
యా నామరూపాశ్రయా యా మూలప్రకృతిర్గుణ త్రయవతీ
యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా
జయతు సా దుర్గా నవాకారిణీ..

ఎవరి యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవరు తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవరు నామరూపాలకు ఆశ్రయమో, ఎవరు మూడు గుణాలు గల మూల ప్రకృతియో, ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవరు నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయించుగాక.

*నవరాత్రి సమారాధ్యాo నవచక్ర నివాసినీo
నవరూప ధరాo శక్తిo, నవదుర్గాముపాశ్రయే*

నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.

దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే... వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహపురాణం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.

ప్రథమo శైలపుత్రీ చ ద్వితీయo బ్రహ్మచారిణీ |
తృతీయo చంద్రఘoటేతి కూష్మాoడేతి చతుర్థకమ్ ||
పoచమo స్కoదమాతేతి షష్ఠo కాత్యాయనీతి చ |
సప్తమo కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమo సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుoది.

నవ దుర్గలు :🙏

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచoలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.

ప్రథమo శైల పుత్రీతి ద్వితీయo బ్రహ్మచారిణీ!!
తృతీయo చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకo!
పంచమo స్కoదమాతేతి షష్ఠo కాత్యాయనీతి చ!
సప్తమo కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమo!
నవమo సిద్ధిదా ప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా!!
ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా!

ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది.

మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు.... _*మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి.*_ వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.

1. శైలపుత్రి : బాలా త్రిపుర సుందరి*

నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుక జన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.

2. బ్రహ్మచారిణి: గాయత్రీ దేవి*

దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.

3. చంద్రఘంట : అన్నపూర్ణ దేవి*

దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

4. కూష్మాండ : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి*

సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.

5. స్కందమాత : సరస్వతీదేవి*

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.

6. కాత్యాయని : మహాలక్ష్మి దేవి*

దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయని మాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.

7. కాళరాత్రి : దుర్గాదేవి*

దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : మహిషాసురమర్ధిని దేవి*

దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.

9. సిద్ధిదాత్రి : రాజరాజేశ్వరీ దేవి*

దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత.

ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరు పొందాడని దేవీ పురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.

ఓం శ్రీ మాత్రే నమః 🙏
ఓం నమః శివాయ 🙏

26/08/2025

🌿 వినాయక చవితి పూజా పత్రాల మహిమ 🌿

వినాయక చవితి పూజలో వినాయకుడికి 21 రకాల ఆకులను సమర్పించడం అత్యంత శ్రేష్ఠమైనది. ప్రతి ఆకు ఒక ప్రత్యేకమైన శక్తి, ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. 🌸
ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, విజయాన్ని ప్రసాదించే ఈ ఆకుల సమర్పణ వలన విఘ్నాలను తొలగించి, మనసుకు శాంతి కలుగుతుంది. 🕉️

🙏 ఈ వినాయక చవితి, మీరు కూడా 21 పత్రాలతో విఘ్ననాయకుడిని ఆరాధించి, ఆయన కృపకు పాత్రులు కావాలి. ✨

07/08/2025

Vedam !!

📚The origin of this word (Sanskrit Etymology):

Veda = Vid (विद) came from metal. "Wid" means to know, to acquire knowledge.

Veda = The book that gives knowledge

"Vedayati this is Vedayati"
- This is a book that preaches wisdom
So this is called Veda.

📖 Meaning of Veda (in summary):
Vedam is the source of knowledge of Sanatana Dharma. This is the uncivilized (not written by humans) knowledge given to us by the sages from God.

Sections of Veda:
Veda is divided into four parts:

Agvedam - Hymns, Chants (Mantras praising the gods)

Yajurvedam - Yagnapu Karmalas, methods

Samavedam - chanting mantras

Atharva Vedam - Household rituals, Medicine, Mental peace, Magic tricks

The philosophical/spiritual meaning of Veda:
Vedam teaches us how to achieve the four types of men called Dharma, Meaning, Lust, Moksham.

This is spirituality, supreme soul, creation of the world,
Provides knowledge on the ethics and ethics of life.

Vedas have eternal knowledge 👍👍

05/08/2025

Dharma -- A comprehensive overview.........!!
Dharma is not just a religion, it is a way of life. Its roots lie in the meaning of "understanding", meaning that sustains creation, society, and person. Although this varies according to the circumstances of the countries, its core principles remain eternal truths.

Common Dharma: Everyone should follow......

As you mentioned, ten qualities of Dharma are important to every person. They are:
* Courage (strength): No matter how many difficulties come, moving forward with self strength without being discouraged.
* Patience (forgiveness): forgiving others and facing adversity with patience.
*Mindfulness (guts): Keeping the mind on a task and controlling it from running around.
*laziness: not stealing, not expecting other people's belongings. (The fourth point you have given is related to 'asteyam').
* Cleanliness (toilet): Keeping the body, mind, thoughts and surroundings clean.
*Sensory Monitoring: Keeping the senses in check. He who conquers the mind conquers everything.
* Shame (hri): Being ashamed to do bad things.
* Truth: Always telling the truth. Lies only give short term happiness.
* Education: Learning education for a wise life. An uneducated person is equal to an animal.
* Lack of anger (offrage): Revenge, anger, violence etc. can lead a man to downfall. It is only by overcoming anger that we can achieve progress.
A person can lead a righteous life by practicing these ten qualities.
Special Dharmas: Dharmas that change based on characters
As you explained, Dharmas change depending on the character of the person. Just a few examples:
*Teacher: To teach without hiding the knowledge he has learned.
* Student: Learning education with fear of teacher.
* Soldier: Protecting the country and the people.
* Son/Daughter: Caring for and nurturing elderly parents.
* Husband: Earning fairly and nurturing the family.
* Wife: Managing husband's earnings properly and running the house.
*Friend: Not to harm a trusted friend.
* Humanity: Saving and donating to the helpless.
Charity and social justice
You have perfectly explained the deeper meaning behind the plea of "do the right thing". Sharing what we have with those who don't have is a social virtue. This will prevent hunger, suffering and anarchy in the society. The quote "Atithi Devobhava" also emphasizes the same thing.
The power of righteousness
The sentence "Dharma Rakshati Raksh*ta" clearly tells the power of Dharma. If we protect Dharma, it will protect us. People like Sri Rama, Yudhishthirudu walked in the path of righteousness and remained in history. Srikrishna also came to destroy injustice to establish dharma.
At the end, as you said, Dharma is not limited to human life. Seasonal dharma, time dharma, conjugal dharma etc are also an integral part of nature. It is an extensive and ongoing process.

02/08/2025

Important Abbreviations You Must Know! 📝✨📱
CEO – Chief Executive Officer
CFO – Chief Financial Officer
HR – Human Resources
ATM – Automated Teller Machine
GPS – Global Positioning System
VIP – Very Important Person
PIN – Personal Identification Number
Wi-Fi – Wireless Fidelity
USB – Universal Serial Bus
ASAP – As Soon As Possible
PDF – Portable Document Format
LOL – Laugh Out Loud
RSVP – Répondez S'il Vous Plaît (Please respond)
ETA – Estimated Time of Arrival
DIY – Do It Yourself
FYI – For Your Information
BTW – By The Way
IDK – I Don’t Know
IMO – In My Opinion
FAQ – Frequently Asked Questions
PTO – Paid Time Off
ETA – Estimated Time of Arrival
BRB – Be Right Back
TTYL – Talk To You Later
OMG – Oh My God
RIP – Rest In Peace
BFF – Best Friends Forever
AKA – Also Known As
RSVP – Please Respond
ETA – Estimated Time of Arrival
MIA – Missing In Action
DIY – Do It Yourself
ICYMI – In Case You Missed It
TGIF – Thank God It’s Friday
FAQ – Frequently Asked Questions
RSVP – Please Respond
ETA – Estimated Time of Arrival
YOLO – You Only Live Once
FOMO – Fear Of Missing Out
IRL – In Real Life
LMK – Let Me Know
NSFW – Not Safe For Work
TBA – To Be Announced
TBD – To Be Decided

The four stages of detachment in life:At age 60, the office will fire you. No matter how successful or powerful you are ...
01/08/2025

The four stages of detachment in life:

At age 60, the office will fire you. No matter how successful or powerful you are in your career, you will return as a normal person. So, don't cling to a sense of mentality and superiority from your past job, give up your ego or you may lose your comfort!

At 70 years of age, society will gradually remove you. The friends and colleagues you meet and meet are very few and no one recognizes you in your former office. "I was once upon a time... " or " I once was... "Don't say, because the younger generation doesn't know about you and you shouldn't feel uncomfortable about it!

At 80 years of age, family will slowly remove you. Although you have a lot of children and grandchildren, most of the time you live with your spouse or on your own. When your children visit from time to time, it's an expression of affection, so don't blame them for coming less often as they are busy with their own lives!

At 90, the earth wants to remove you. Some people you know are already gone forever. At this point, don't be sad or sad, because it's the way of life, and everyone will eventually follow this path!

So, while our bodies are still able, live life to the fullest! Eat what you want, drink what you want, play and do what you love.

ముక్తి మార్గం - చిత్త (మనస్సు) నాశనమే ముక్తిఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు. ఈ చిత్తాన్ని నాశనం...
31/07/2025

ముక్తి మార్గం -

చిత్త (మనస్సు) నాశనమే ముక్తి

ఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు.

ఈ చిత్తాన్ని నాశనం చేస్తేనే మానవునికి ముక్తి.

శరీర నాశనంతో ఏదీ నాశనమవదు.

చిత్త నాశనమే సర్వ దుఃఖ నాశనం. అదే ముక్తి.

మరి చిత్తాన్ని ఎలా నాశనం చెయ్యాలి అంటే మానవుడు తన మనసులో ఏ విషయాలూ భావించకూడదు.

మనస్సులోకి విషయాలు రానివ్వకూడదు.

మనస్సును నిశ్చలంగా నిర్విషయ స్థితిలో నిరంతరం నిలుపి ఉంచుకోవడం సాధన చెయ్యాలి.

చిత్తంలో వున్న పాత విషయాలను ఈ మనస్సు అప్పుడప్పుడు వెనక్కు తీసికుని మననం చేస్తూ వుంటుంది.

వీటినే జ్ఞాపకాలు అని కూడా అంటాం.

అలా మననం చేయబడ్డ విషయాలు మరింత శక్తిని పుంజుకుని తిరిగి చిత్తంలో పై పై నే ఉంటూ మనస్సు భావించినప్పుడల్లా ఎగిరెగిరి మనస్సులోకి వచ్చి రకరకాల అనుభవాలను మనస్సుకు ఇచ్చి తిరిగి చిత్తం లోకి వెళ్లిపోతుంటాయి.

ఎప్పుడయితే మానవుడు ముక్తిని లక్ష్యంగా చేసుకుని విషయాలను మనస్సుతో స్మరించడం ఆపి వేస్తాడో అప్పుడు మనస్సు చిత్తంలోని పాత జ్ఞాపకాలను వెనక్కు తీసికుని మననం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది.ఆదిత్యయోగీ.

అట్టి స్థితిలో మానవుడు తన బుద్ధి బలంతో మనస్సును కట్టడి చేసి చిత్తంలోని పాత విషయాలలోకి మనస్సును వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి.

అప్పుడు చిత్తంలోని పాత విషయాలన్నీ కూడా కొంత కాలానికి చిత్తంలో లేకుండాపోతాయి.

ఎప్పుడయితే చిత్తంలో విషయాలే లేకుండా పోతాయో అప్పుడు చిత్తమే లేకుండా పోతుంది.

ఎందుకంటే విషయాలకు మరొక పేరే చిత్తం.

విషయాలు, జ్ఞాపకాలు అంటూ లేని చిత్తం ఎక్కడా ఉండదు.

చిత్తం లేనట్టి అట్టి స్థితిలో మనస్సు తన స్వస్థానమయిన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది.

ఇంకా చెప్పాలంటే ఆత్మే అజ్ఞానమనే తనకంటే వేరుగాని మనస్సు అనే బ్రాంతి తనలో తొలగించుకుని “బ్రహ్మానంద” స్థితిలో ఉండిపోతుంది.

అట్టి స్థితిలో ఈ శరీరం జ్ఞప్తికి రాదు.

ఈ శరీరాన్ని ఈ శరీరం నేను అనుకునేది ఆత్మలోనుంచి ఏర్పడ్డ ఈ మనస్సే .

మనస్సు ఆత్మలో లీనమైపోయాక ఇక ఈ శరీరాన్నిగాని ఈ ప్రపంచాన్నిగాని చూసేది ఏముంటుంది.

ఆస్థితే మరణాన్ని జయించడం-ముక్తిని పొందడం అంటే..*

క్షమ (క్షమా) మరియు పగ — ఈ రెండు భావనలూ మన ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో కీలకమైనవి. వాటి మధ్య తేడా, వాటి ప్రభావాలు, ఆధ్యాత్మిక దృష్టిలో వాటి విలువ ఇప్పుడు వివరిస్తాను.

1. క్షమా అంటే ఏమిటి?

క్షమ అంటే క్షమించటం, మన హృదయంలో ఇతరుల తప్పులను మన్నించటానికి సిద్ధంగా ఉండటం. ఇది ఓ దివ్య గుణం, భగవత్ స్వభావం.

* ఆధ్యాత్మిక దృష్టిలో:

క్షమను భగవంతుని లక్షణంగా చూస్తారు.

పరమాత్మ అన్నిటిని అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమతో చూస్తాడు.

క్షమ వలె ఉన్నవాడు మనోనిగ్రహం కలవాడు, ద్వేషం లేనివాడు, శాంతి మార్గాన్ని అనుసరించేవాడు.

* ఉదాహరణ:

* రాముడు వాల్మీకి వచనాల ప్రకారం, శత్రువులు చేసిన తప్పులనూ క్షమించేవాడు. క్షమా మహత్యాన్ని జీవితం ద్వారా చూపాడు.

* 2. పగ అంటే ఏమిటి?

పగ అంటే ప్రతీకార భావన, ఎవరో చేసిన తప్పుకు మనం బాధపడి, వారిని నష్టపరచాలన్న కోరిక. ఇది మనస్సు యొక్క లోతైన అహంకార, ద్వేష భావాలకు చిహ్నం.

* ఆధ్యాత్మిక దృష్టిలో:

పగ మన ఆత్మకు భారం.

ఇది మన సత్స్వరూపాన్ని దూరం చేస్తుంది.

పగవల్ల మన చిత్తశుద్ధి చెడుతుంది, మనస్సు శాంతిని కోల్పోతుంది.

* భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెబుతాడు:

"క్రోధాత్ భవతి సమ్మోహః..." (క్రోధం నుంచి మోహం, మోహం నుంచి సంభ్రమం, సంభ్రమం నుంచి వినాశనం.)

* 3. క్షమ గుణం వల్ల లాభాలు:

* మనశ్శాంతి కలుగుతుంది
* హృదయ శుద్ధి పెరుగుతుంది
* పరలోక చైతన్యం పొందవచ్చు
* కర్మ బంధాలు విడిపోతాయి
* భగవంతునికి చేరువవుతాము

* 4. ఆధ్యాత్మిక దారిలో క్షమకు ప్రాధాన్యం

బుద్ధుడు మౌనంగా నిందలను ఎదుర్కొన్నాడు — ఎందుకంటే ఆయన క్షమామూర్తి.

ఈశ్వరుడు సృష్టిలోని ప్రతి ప్రాణిని దోషాలతో కూడినవారిగా చూచినా, తన అనుగ్రహం చూపిస్తాడు.ఆదిత్యయోగీ.

జ్ఞానమార్గం, భక్తిమార్గం రెండింటిలోనూ క్షమ ముఖ్యమైన అంగం.

క్షమ అంటే మోక్షానికి దారి,
పగ అంటే బంధనానికి మూలం.
క్షమను అలవాటు చేసుకున్నవాడే నిజమైన యోగి, ధ్యాతా, భక్తుడు.

క్షమ గుణం మణిపూస లాంటి దివ్యమే,
కోపపు కాంతిలో వెలసే శాంతియే.
నిను దూషించిన వాడిని క్షమించగలిగితే,
నీ హృదయం దేవతల మందిరం అవుతుంది.

పగ అనేది అగ్నిలాంటి భావన,
ఎదలో దాగుంటే శాంతి కరవైన.
పగ తీర్చుకుంటే శరీరం గెలిచినా,
ఆత్మ మాత్రం ఓడిపోతుంది నిశ్చయంగా.

ధర్మం చెబుతుంది – మన్నించు ఓ మనవా,
క్షమగుణం ధరించి నిలుచు తపస్విగా.
శత్రువులోనూ శివుని రూపం దర్శించు,
ద్వేష మాయ గుడిసెను శాంతితో కూల్చు.

క్షమించు - అదే శక్తి
క్షమించు - అదే భక్తి
క్షమించు - అదే మోక్షానికి మార్గం....*

Curse - Blessing - Lessons of Life ..........!!Indeed, curses and blessings teach us not only a spiritual aspect but a d...
30/07/2025

Curse - Blessing - Lessons of Life ..........!!
Indeed, curses and blessings teach us not only a spiritual aspect but a deep philosophy on how we can embrace difficulties and challenges in our lives and turn them into opportunities.

Story of Bheeshmudi: Curse is the worst medicine
The story of Ashta Vasuvas is a best example of the curse and the interrelation of the boon.

* Curse Reason: When the goddesses, known as Ashta Vasuvas, went to the Vashishtu Ashram with their wives, in the absence of Vashishtu, the Ashtama Vasuvu Prabhasu's wife was mesmerized by the brightness of the Homadhenu in the Ashram and encouraged Prabhasu to take it with them. Prabhas committed a mistake by taking that cow with the encouragement of other brothers.

* Curse of Vasishtu: After knowing what happened with the view of yoga, Vasishtu got angry and cursed Ashta Vasuvas to be born in the human world.

* Curse deliverance (grace): When the scared objects begged Muni, he was happy and said that seven objects will be freed immediately after birth, but the Prabhas who made a big mistake of taking a cow will live longer on earth and become childless.

*Vainam which is a curse: This Prabhas is born as the son of Ganga, Santanas and got the name Devavratudu. To fulfill his father's wish, Dasaraju's daughter Satyavati, he made a name as a bheeshmudi by promising to not marry her. Elder of Kuru dynasty, Bheeshma got fame as the father of the Kuru dynasty and worked hard for the development of Kuru Dynasty. Thus, infertility and long life, which came upon him as a curse, became an instrument for the establishment of righteousness, of keeping the Father’s word, and made him glorious. Prabhas became blessed by turning his curse into a boon.

Arjun's story: Curse that stood as a support in unknown residence
Arjun's story also clarifies the same thing:
* Curse reason: Urvashi was angry for denying her love, cursed Arjun's pedi form to Kamman.
*Vainam which is a blessing of curse: When Pandavas were living unknown, that curse has become a blessing to save their existence. Virataraju's daughter, Arjun became famous as a dancer and as Brihanna in the north. The curse helped him a lot in the unknown to hide his true form and live without any doubt.

Converting difficulties into opportunities.........
These stories give us a great message: life becomes happier if people turn the hardships and punishments that come to them in favor. Take negative situations as an opportunity, a lesson, learn the good from them, and make life better. Only then can we be blessed.

సృష్టిలో మొదటి తాంత్రికుడు ఎవరు..........!! హిందూ ధర్మం, ముఖ్యంగా శైవం మరియు శక్తి సంప్రదాయాలలో, "తాంత్రికుడు" అనే పదం క...
29/07/2025

సృష్టిలో మొదటి తాంత్రికుడు ఎవరు..........!!

హిందూ ధర్మం, ముఖ్యంగా శైవం మరియు శక్తి సంప్రదాయాలలో, "తాంత్రికుడు" అనే పదం కేవలం మంత్రాలు జపించే వ్యక్తిని సూచించదు, అది సృష్టి రహస్యాలను, దైవిక శక్తులను అర్థం చేసుకుని, వాటిని లోక కళ్యాణం కోసం వినియోగించగలిగే మహాజ్ఞానిని సూచిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు, సృష్టిలో మొదటి తాంత్రికుడు సాక్షాత్తు పరమేశ్వరుడే.

ఈ అంశాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి "యంత్రం, తంత్రం, మంత్రం, పత్రం కలిస్తే యజ్ఞం" అనే సూత్రాన్ని పరిశీలిద్దాం.
యంత్రం, తంత్రం, మంత్రం, పత్రం - యజ్ఞానికి మూలాలు...

ఈ నాలుగు అంశాలు పరస్పరం అనుసంధానమై, ఒక సమగ్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియను, అంటే యజ్ఞాన్ని ఏర్పరుస్తాయి. యజ్ఞం అనేది కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణమైన ఆరాధనా విధానం, సృష్టిలోని శక్తులతో అనుసంధానం చెందే మార్గం.

యంత్రం:
ఇది ఒక రేఖాచిత్రం లేదా జ్యామితీయ నమూనా. ఇది దైవిక శక్తిని ఆవాహనం చేయడానికి, కేంద్రీకరించడానికి ఉపయోగపడే ఒక సాధనం. ప్రతి యంత్రానికి ఒక నిర్దిష్టమైన దేవతా శక్తి ఉంటుంది. ఉదాహరణకు, శ్రీ చక్రం లలితా త్రిపుర సుందరి శక్తిని సూచిస్తుంది. యంత్రం ఒక భౌతికమైన లేదా మానసికమైన ఆధారంగా పనిచేస్తుంది.

తంత్రం:
“తాత్" మరియు "త్రాయతే" అనే పదాల నుండి వచ్చింది, అంటే "విస్తరించుట" మరియు "రక్షించుట". తంత్రం అనేది ఒక సమగ్రమైన జీవన విధానం, సాధనల సముదాయం. ఇది కేవలం మంత్రాలు, పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామం, ధ్యానం, కర్మకాండలు, మరియు సృష్టి తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఉంటాయి. తంత్రం ద్వారానే ఒకరు విశ్వశక్తితో ఐక్యం కావడానికి మార్గం ఏర్పడుతుంది. ఇది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తుంది.

మంత్రం:
“మననాత్ త్రాయతే ఇతి మంత్రః" – మననం చేయడం ద్వారా రక్షించేది మంత్రం. ఇది దైవిక శక్తులను ప్రార్థించడానికి, ఆవాహనం చేయడానికి ఉపయోగించే ఒక శబ్ద రూపం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ (కంపనం), ఒక దేవతా శక్తి ఉంటుంది. మంత్ర జపం ద్వారా అంతర్గత శక్తులు జాగృతమవుతాయి.

పత్రం:
సాధారణ అర్థంలో "ఆకు" లేదా "పత్రం" అని చెప్పినప్పటికీ, ఇక్కడ "పాత్రం" లేదా "ఆధారం" అనే విస్తృత అర్థాన్ని తీసుకోవచ్చు. ఇది కార్యరూపంలో పెట్టడానికి ఉపయోగించే మార్గం లేదా పూజా ద్రవ్యం. యజ్ఞంలో సమర్పించే ద్రవ్యాలు, పూజకు అవసరమైన ఉపకరణాలు, లేదా జ్ఞానాన్ని పొందేందుకు ఉపయోగపడే గ్రంథాలు కూడా పత్రం కిందకు వస్తాయి. జ్ఞానాన్ని గ్రహించే, ఆచరించే వ్యక్తి
కూడా ఒక పాత్రమే.

ఈ నాలుగింటి సమ్మేళనమే యజ్ఞం, ఇది
విశ్వశక్తితో సంభాషించే, అనుసంధానమయ్యే ప్రక్రియ.

యజ్ఞం :
అంటే సాక్షాత్తు అమ్మవారు ఆదిపరాశక్తి......
సృష్టికి మూలమైన ఆదిపరాశక్తియే సమస్త యజ్ఞాలకు అధిష్ఠాన దేవత. ఆమె శక్తి స్వరూపిణి, సమస్త సృష్టికి కారణభూతురాలు. యజ్ఞం ద్వారా ఆ ఆదిపరాశక్తిని ఆవాహనం చేసి, ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చని తాంత్రిక సంప్రదాయాలు చెబుతాయి. ఆమె నుండే సమస్త సృష్టి ఉద్భవించింది.

ఆదిపరాశక్తి :
నుండి త్రిమూర్తుల ఉద్భావం.......
ఆదిపరాశక్తి నుండే త్రిమూర్తులు – బ్రహ్మ (సృష్టికర్త), విష్ణువు (స్థితికర్త), మహేశ్వరుడు (సంహారకర్త) – ఉద్భవించారు. ఈ ముగ్గురు దేవతలు సృష్టి, స్థితి, లయ కారక శక్తిని అమ్మవారి నుండి పొందుతారు. ఇది సృష్టిలోని సమస్త శక్తికి ఆదిపరాశక్తియే మూలం అని స్పష్టం చేస్తుంది.

పరమేశ్వరుడు :
పంచభూతాల అధిపతి, మొదటి తాంత్రికుడు
ఆదిపరాశక్తి యొక్క అంశ మరియు భూతనాధుడు, పంచభూతాల అధిపతి అయిన మహాదేవుడు (శివుడు), యంత్ర, తంత్ర, మంత్రాలను తన అధీనంలో ఉంచుకున్న పరమేశ్వరుడు. ఆయనే తాంత్రిక జ్ఞానానికి, సాధనలకు మూల పురుషుడు.

సృష్టి లయకారుడు:
శివుడు కేవలం సంహారకుడు మాత్రమే కాదు,
ఆయన సృష్టి లయ తర్వాత పునఃసృష్టికి మార్గం సుగమం చేస్తాడు. ఈ ప్రక్రియ మొత్తం ఒక తాంత్రిక విధానమే.

జ్ఞాన స్వరూపుడు:
శివుడు జ్ఞానానికి, ధ్యానానికి, యోగానికి అధిపతి. తంత్రం అనేది జ్ఞానాన్ని, శక్తిని, ముక్తిని పొందడానికి ఒక మార్గం.

పంచభూతాలను
నియంత్రించేవాడు:
పృథ్వి, అప్, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకున్న శివుడు, ప్రకృతి శక్తులను నియంత్రించగల ఏకైక దైవం. తంత్రం కూడా ఈ ప్రకృతి శక్తులను అర్థం చేసుకుని, వాటిని ఉపయోగించుకోవడం గురించే చెబుతుంది.

ఆదిగురువు:
అనేక తాంత్రిక గ్రంథాలు శివుడిని ఆదిగురువుగా, పార్వతీదేవికి తాంత్రిక జ్ఞానాన్ని ఉపదేశించినవానిగా పేర్కొంటాయి. ఆయన జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాతే, అది లోకంలో వ్యాప్తి చెందింది.

కాబట్టి,
సృష్టిలోని సమస్త శక్తులపై అపారమైన నియంత్రణ, లోతైన జ్ఞానం, మరియు వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగించగల సామర్థ్యం కలిగిన పరమేశ్వరుడే సృష్టిలో మొదటి తాంత్రికుడుగా పరిగణించబడతాడు. ఆయన తాంత్రిక మార్గానికి ఆద్యుడు, అన్ని తాంత్రిక సాధనలకు ప్రకాశకుడు.

భగవద్గీత అనేది ధర్మం గురించి తెలియ చేసే ఒక పవిత్ర గ్రంథం, ఇది దాని ఆధ్యాత్మిక మరియు తాత్త్విక బోధనల కారణంగా ప్రపంచవ్యాప్...
27/07/2025

భగవద్గీత అనేది ధర్మం గురించి తెలియ చేసే ఒక పవిత్ర గ్రంథం, ఇది దాని ఆధ్యాత్మిక మరియు తాత్త్విక బోధనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విదేశీ శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు మరియు ప్రముఖులను ఆకర్షించింది. కొందరు విదేశీ శాస్త్రవేత్తలు మరియు ప్రముఖులు భగవద్గీతను అధ్యయనం చేసి దాని సారాంశాన్ని ప్రశంసించారు. క్రింద భగవద్గీతను అనుసరించిన లేదా దాని బోధనల పట్ల ఆసక్తి చూపిన కొందరు విదేశీ ప్రముఖుల గురించి సమాచారం ఇవ్వబడింది.

విదేశీ శాస్త్రవేత్తలు:
జె. రాబర్ట్ ఒపెన్‌హైమర్ (J. Robert Oppenheimer):
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మరియు అణు బాంబు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త.
ఒపెన్‌హైమర్ భగవద్గీతను లోతుగా అధ్యయనం చేశారు మరియు సంస్కృతంలోని ఒరిజినల్ గీతను చదివారు. అణు పరీక్ష (ట్రినిటీ టెస్ట్) విజయవంతం అయిన తర్వాత, అతను గీతలోని 11వ అధ్యాయంలోని ఒక శ్లోకాన్ని ఉటంకించారు: "కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో" (నేను కాలంను, లోకాలను నాశనం చేసే వాడిని). ఈ శ్లోకం అతనిపై గాఢమైన ప్రభావం చూపింది.

ఎర్విన్ ష్రోడింగర్ (Erwin Schrödinger):
ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం మెకానిక్స్‌లో తన సిద్ధాంతాలకు ప్రసిద్ధి చెందినవాడు.
ష్రోడింగర్ వేదాంతం మరియు భగవద్గీత బోధనల పట్ల ఆసక్తి చూపారు. అతను గీతలోని ఆత్మ మరియు బ్రహ్మం గురించిన తాత్త్విక ఆలోచనలను అధ్యయనం చేశారు మరియు దాని జ్ఞాన యోగాన్ని ప్రశంసించారు.

వెర్నర్ హైసెన్‌బర్గ్ (Werner Heisenberg):
జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం మెకానిక్స్‌లో అనిశ్చితి సూత్రం (Uncertainty Principle) కనుగొన్నవాడు.
హైసెన్‌బర్గ్ భగవద్గీత యొక్క తాత్త్విక దృక్పథం పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు దాని బోధనలు తన శాస్త్రీయ ఆలోచనలకు ప్రేరణగా ఉన్నాయని పేర్కొన్నాడు.

విదేశీ ప్రముఖులు (సెలబ్రిటీలు):
జార్జ్ హారిసన్ (George Harrison):
బీటిల్స్ సంగీత బృందంలో సభ్యుడు, బ్రిటిష్ గాయకుడు మరియు గిటారిస్ట్.
జార్జ్ హారిసన్ భగవద్గీతను లోతుగా అధ్యయనం చేశారు మరియు దాని ఆధ్యాత్మిక బోధనలు అతని సంగీతం మరియు జీవనశైలిపై గణనీయమైన ప్రభావం చూపాయి. అతని పాట "My Sweet Lord" గీత యొక్క భక్తి యోగ భావనల నుండి ప్రేరణ పొందింది.

మడోన్నా (Madonna):
అమెరికన్ పాప్ గాయని మరియు నటి.
మడోన్నా భగవద్గీత బోధనల పట్ల ఆసక్తి చూపింది మరియు యోగా మరియు హిందూ ఆధ్యాత్మికతను అనుసరించింది. ఆమె గీత యొక్క కర్మ యోగం మరియు ధ్యాన ఆలోచనలను తన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించింది.

స్టీవ్ జాబ్స్ (Steve Jobs):
యాపిల్ సహ వ్యవస్థాపకుడు మరియు టెక్ దిగ్గజం.
స్టీవ్ జాబ్స్ భగవద్గీతను తన యుక్తవయసులో చదివాడు మరియు దాని బోధనలు తన జీవిత దృష్టికోణంపై గాఢమైన ప్రభావం చూపాయని చెప్పాడు. అతను గీత యొక్క నిస్వార్థ కర్మ యోగ భావనను తన సృజనాత్మక పనిలో ఆచరించడానికి ప్రేరణగా తీసుకున్నాడు.

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (Ralph Waldo Emerson):
అమెరికన్ తత్త్వవేత్త మరియు రచయిత.
ఎమర్సన్ భగవద్గీతను అధ్యయనం చేశాడు మరియు దాని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన రచనలలో ప్రతిబింబించాడు. అతను గీతను "మానవ జ్ఞానం యొక్క రత్నం"గా పరిగణించాడు.

హెన్రీ డేవిడ్ థోరో (Henry David Thoreau):
అమెరికన్ రచయిత మరియు తత్త్వవేత్త.
థోరో భగవద్గీతను లోతుగా అధ్యయనం చేశాడు మరియు దాని బోధనలు అతని జీవనశైలి మరియు రచనలపై ప్రభావం చూపాయి, ముఖ్యంగా సరళ జీవనం మరియు ఆత్మశోధన గురించిన అతని ఆలోచనలలో.

భగవద్గీత యొక్క ప్రభావం:
భగవద్గీత యొక్క కర్మ యోగం, భక్తి యోగం మరియు జ్ఞాన యోగం వంటి బోధనలు విదేశీ ప్రముఖులను ఆకర్షించాయి, ఎందుకంటే ఇవి సార్వత్రిక సత్యాలను మరియు జీవన మార్గదర్శకాలను అందిస్తాయి.
ఈ గ్రంథం ఆధ్యాత్మికత, ధర్మం, మరియు ఆత్మసాక్షాత్కారం గురించిన లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది, ఇవి సాంస్కృతిక మరియు జాతీయ సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి...

24/07/2025

1 శ్రవణ,
2 మనన,
3 నిధిధ్యాసనం

ఇవి మూడు ప్రాముఖ్యమైన దశలు …,

ఆధ్యాత్మిక సాధన మార్గంలో
ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. …

1 శ్రవణము అంటే విని గ్రహించడం
ఇది వేదాంత జ్ఞానాన్ని గురువు నుండి వింటే కలిగే తొలి దశ. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవత గీత వంటి గ్రంథాల వల్ల పరబ్రహ్మం (అలౌకిక సత్యం) గురించి విన్న దశ. ఇందులో "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః" వంటి వాక్యాలపై గురువు వివరణను శ్రద్ధగా వింటారు. లక్ష్యం: తత్వ జ్ఞానాన్ని సూత్రంగా గ్రహించడం.

2. మననం
ఆలొచన శ్రవణంలో విన్న జ్ఞానాన్ని బలపరచడం. మనసులో ఎటువంటి సందేహాలైనా ఉంటే, వాటిని తర్కంగా పరిష్కరించుకుంటూ ఆ జ్ఞానాన్ని ధృఢంగా చేసుకోవడం. గురువు చెప్పిన విషయాలపై ధ్యానం చేసి, తార్కికంగా అర్థం చేసుకొని, "నిజంగానే నేను శరీరం కాదు... జీవాత్మే బ్రహ్మం" అనే జ్ఞానాన్ని లోపలికి తీసుకెళ్లే దశ.

3. నిధిధ్యాసనం
గాఢ ధ్యానం (వేగంగా స్థిరపడటం) శ్రవణం, మననం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని జీవనంలో బలంగా స్థిరపరచుకోవడం. ఇది సాధనాత్మక ధ్యానం — అంటే "అహం బ్రహ్మాస్మి" అనే భావనపై మౌనంగా, శాంతంగా తాపత్రయంలేని స్థితిలో దీర్ఘకాలం ధ్యానం చేయడం. ఇది "జ్ఞాన నిష్ఠ" స్థితికి తీసుకెళ్ళే దశ. తాత్కాలికంగా కాదు — పరిపూర్ణ స్థితప్రజ్ఞత సాధించడానికి ఇది అవసరం. సారాంశంగా: దశ అర్థం దేని కోసం శ్రవణం విని గ్రహించడం జ్ఞానం సేకరణ మననం తర్కంతో అన్వయించడం సందేహ నివృత్తి నిధిధ్యాసనం స్థిర ధ్యానం జ్ఞానం లోపలికి అంతర్నిహితం చేయడం

ఇవి మూడు దశలూ కలిసి ఆత్మజ్ఞానం, మోక్షం సాధించడానికి మార్గం చూపిస్తాయి.

జీవితంలో
చైతన్యం,
మాయ,
జగత్తత్వం అనే విశ్వ తత్వాలను అంతర్లీనంగా పరిశీలిస్తే అంత అవగతం అవుతుంది

ఒక గ్రామంలో రాఘవుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుండే "ఈ జీవితం ఎందుకంటే?" అనే సందేహం. ధనం, కుటుంబం, విద్య
ఇవన్నీ ఉన్నా అతడి మనసు అసంతృప్తిగా ఉండేది.

ఒకరోజు ఊరికి పక్కనే అరణ్యంలో ఉన్న ఓ ఋషి ఆశ్రమానికి వెళ్లి అడిగాడు

స్వామీ, నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది?
ఈ శరీరం నశించిపోతుంది, జీవితంలో ఏమి శాశ్వతం కాదు. అయితే శాశ్వతమైనది ఏది?"

శ్రవణం వినడం

ఆ ఋషి అతనికి వేదాంత జ్ఞానం ఇచ్చాడు. అతనికి శ్రవణం ప్రారంభమైంది.

"నీవు శరీరం వేషమే, కానీ నీవే శరీరం కాదు.
నీవు శుద్ధ చైతన్యం. నీవు బ్రహ్మమే. అది ఆత్మగా నీవుగా వ్యాపించి ఉంది

రాఘవుడు ఆశ్చర్యపోయాడు.
ఇతివరకు తాను శరీరం, పేరే తనంత భావించేవాడు. కానీ ఇవి విని కొంత ఆలోచన లోనయ్యాడు.

మననం ఆలోచన

ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన రాఘవుడు తన ఊరి పొలాల దగ్గర కూర్చుని:

"నిజంగా... శరీరం మారిపోతుంది.
బాల్యానికి యువావస్త, తర్వాత వృద్ధాప్యం. కానీ నాలో ఏమో మారడం లేదు. అదే నా నిజ రూపమై ఉండి ఉండొచ్చు!

అతడు తర్కించడం మొదలెట్టాడు. ఉపనిషత్తుల వాక్యాలను మదిలో తిరగేస్తూ, గురువు చెప్పినవాటిని లోతుగా తడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనికి నమ్మకం కలుగుతున్నది: "నేను శరీరం కాదు. నేను ఆత్మను!

నిధిధ్యాసనం (ధ్యానం)

ఆ తర్వాత ప్రతి రోజూ ఉదయాన్నే రాఘవుడు ఒక చెట్టు కింద కూర్చొని తన నిజ స్వరూపం పై ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతరులాంటి కోపం, మోహం, భయం అతడిని తాకకపోవడం మొదలయ్యింది.

ఎప్పుడైతే అతడు నిశ్శబ్దంగా తనలోకి చూసి — "నేనే బ్రహ్మం", "నాకు జననం మరణం లేవు", "నిర్గుణ స్వరూపాన్ని నేనే" — అనిపించిందో, అప్పటినుంచి అతడు శాంతమూర్తిగా మారిపోయాడు.

మొదట వినాడు
తర్వాత ఆలోచించాడు
చివరకు అంతరంగంలో స్థిరపడ్డాడు

ఇది శ్రవణం, మననం, నిధిధ్యాసం ప్రయాణం.
ఋషిని కలసి వచ్చిన రాఘవుడు ఒక రోజు అడిగాడు

"స్వామీ! ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను శరీరం కాదు. కానీ ఈ జగత్ (ప్రపంచం), ఈ ప్రకృతి, ఇతరుల బాధలు, ఈ సమాజం ఇవన్నీ ఎందుకు నన్ను కలవరపెడుతున్నాయి?

ఋషి నవ్వుతూ ఒక చిన్న కథ చెప్పాడు

ఒకరు చీకటి గదిలోకి వెళ్లాడు.
అక్కడ ఓ తాడు ఉంది. కానీ అతనికి అది తాడు కాదు, పాముగా కనిపించింది.
భయంతో అతడు అరవడంతో అందరూ వచ్చి టార్చ్ లైట్ వేశాడు. తాడు మాత్రమేనని తెలిసింది.

ఋషి:

తాడు నిజం — అది చైతన్యం
పాము అపోహ — అదే మాయ

తాడు మీద పాము కనిపించినట్టు — చైతన్యంలో జగత్ (ప్రపంచం) అనుభవమవుతుంది"

చైతన్యం
ఇది నిత్యం, నిర్గుణం, నిర్వికారం. అది ఏ స్వరూపం కాని స్వరూపం.

మనకు "నేను ఉన్నాను" అన్న బోధనే చైతన్యం. ఇది అహంకారానికి, శరీరానికి ముందు నుంచే ఉంటుంది. చైతన్యం వలననే మనం చూస్తాం, వింటాం, ఆలోచిస్తాం కానీ అది మన ఇంద్రియాలకు అవలంబించదు.

ఉదాహరణ:

విద్యుత్ శక్తి తో ఫ్యాన్ నడుస్తుంది
అలాగే మన దేహంలో చైతన్యం ఉన్నా మన జీవం నడుస్తుంది.

మాయ అనేది శక్తి — అదే అవిద్య, అదే అజ్ఞానం. ఇది చైతన్యాన్ని దాటి కాదు — చైతన్యంలోనే అది పని చేస్తుంది మాయ రెండు పనులు చేస్తుంది: ఆవరణం
నీవు బ్రహ్మస్వరూపుడివన్న విషయాన్ని కప్పిపెడుతుంది. అసలు లేనివాటిని చూపిస్తుంది

(పాము, భయం, శోకం, జగత్ మొదలైనవి).

మాయ నిబంధన

సత్యం + మాయ = జగత్
బ్రహ్మం + మాయ = ఈ ప్రపంచ అనుభవం

జగత్తు అనేది వ్యాప్తమైనది, కానీ శాశ్వతం కాదు.
ఇది రూపంలో ఉన్నది, మార్పులో ఉన్నది.
అందుకే అది "మిథ్య" అర్థం: సత్యం కాదూ, అసత్యం కాదూ. అనుభవించగలుగుతున్నాం, కానీ శాశ్వతంగా మనకి ఉండదు. జగత్తు బ్రహ్మంనే బేస్‌గా తీసుకొని మాయ శక్తి ద్వారా కనిపించే తాత్కాలిక చిత్రం.

ఉదాహరణ

సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు మారుతుంటాయి.
స్క్రీన్ మాత్రం ఎప్పుడూ మారదు.

అదే విధంగా

బ్రహ్మం = స్క్రీన్
మాయ = ప్రొజెక్టర్
జగత్ = సినిమా

చివరగా రాఘవుడు బోధను ఇలా గ్రహించాడు:

"నిజమైన నేను శుద్ధ చైతన్యం
ఈ జగత్తు నాకు కనిపిస్తోంది కాబట్టి మిథ్య
మాయ వల్లే ఈ అనుభవం జరుగుతోంది"

ఇప్పుడు అతడు ప్రపంచాన్ని చూస్తున్నా,
లోపల మాత్రం స్థిరంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు.

సారాంశం:

తత్వం అర్థం లక్షణం చైతన్యం నిజమైన స్వరూపం శాశ్వతం, నిర్వికారం

మాయ అజ్ఞానం వల్ల కలిగే దృష్టికొణం భ్రమ, విక్షేపం జగత్తు మాయ వల్ల ఏర్పడిన అనుభవికమైన ప్రపంచం మిథ్య (అసత్యం కాదు, సత్యం కాదు)

ఇది పూర్తిగా అద్వైత వేదాంత తత్వం. దీనిని జీవితం మీద అన్వయించుకోవాలంటే మళ్లీ

ఆ శ్రవణం మననం నిధిధ్యాసం అనే మార్గం అవసరం.

Address

Hyderabad

Telephone

+919618297377

Website

Alerts

Be the first to know and let us send you an email when Edi matter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Edi matter:

Share