Bottu Pavan

Bottu Pavan Bottu Pavan not only name it's a Brand

05/09/2024



10/07/2023

మగజాతి ఆణిముత్యం

🚩🚩-చీర కొని చూడు-🚩🚩♦️"అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేస...
10/07/2023

🚩🚩-చీర కొని చూడు-🚩🚩

♦️"అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో
పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి
కుశలమడిగింది.
"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"
"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"
"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.
చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో అనే భయ పడేలా వుండకూడదు.
బెనారస్ చీర, కంచి పట్టు చీర బరువుగా వుంటాయి. అలాంటి చీరలు కొనకమ్మా! జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తినట్టుగా రోజంతా అలా బరువైన చీరలు మోయలేనమ్మా.
కాంజీవరం, కుబేర పట్టు చీరలకు పెద్ద పెద్ద బోర్డర్లు ఉంటాయి. అలాంటివి కొనకమ్మా! ఈ వయసులో పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి బావుండదు కదమ్మా!? పైగా దిష్టి తగిలినా తగలచ్చు. అంటే చీరకు కాదమ్మా..., నాకూ....
ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట. అసలు అదేం పేరమ్మా? అప్పడం లాగా! వద్దమ్మా వద్దు అలాంటి చీరల జోలికి పోనే పోకు.
ఇక పోతే.... చీర అస్సలు పలచగా వుండకూడదు. లోపల పెటీకోట్ రంగు కూడా అసలు ఎవరికీ కనిపించకూడదు. మా చిన్నతనంలో చీర కొంచెం పలుచగా వుంటే చాలు.... దేవతా వస్త్రాలు అంటూ ఎగతాళి చేసే వారు. మరి నాలాంటి వాళ్ళు ఈ వయసులో ఇలా పల్చటి చీరలు కడితే చూడడానికి బావుండదు కదమ్మా!
అన్నట్టు మరచి పోయా... చీర అస్సలు గుచ్చుకో కూడదు. లంబాడీ వాళ్ళలాగా చీరకి అద్దాలు గానీ, పూసలు గానీ, అలాగే మెరిసి పోయే చెమ్కీలు గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ గానీ అస్సలు ఉండకూడదు. మే నెలలో మిట్ట మధ్యాహ్నం సూర్య భగవానుడి ఎండ లాగా చీర కట్టుకుంటే చెమటలు పట్టి వళ్ళంతా చిర చిర లాడుతూ చిరాగ్గా వుండకూడదు.
ఆర్గంజా చీర కానీ ఆర్గండీ చీర గానీ నెట్ చీర గానీ కోరా చీర గానీ నాకు అస్సలు నచ్చనే నచ్చవు.
తలబిరుసు తనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్లలా అవి పొగరుగా నిలబడి వుంటాయి ఒక పట్టాన లొంగవు.
అన్నట్టు కోడలు పిల్లా! షిఫాన్, జార్జెట్, టిష్యూ, సాటిన్ మోడల్ లో ఎలాంటి చీరా కొనకమ్మా! అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటే క్రిందకు ఎలా జారిపోతూ వుంటారో, అలాగే సిల్కీగా వున్న చీర కట్టుకుంటూ వుంటే చీర కుచ్చిళ్ళు జారిపోతూ వుంటాయి అలాంటి జారిపోతూ వుండే చీరలు కొనకమ్మా.
చీర రఫ్ గా మొరటుగా గరుక్కాయితంలా గరగర లాడుతూ వుండకూడదు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఉండే ఆడ విలన్ లా కనిపిస్తాను. అంత మోటుతనం రఫ్ నెస్ నేను క(త)ట్టుకోలేను.
చికెన్ వర్క్ చేసిన లక్నోచీర సంగతైతే నువు మర్చి పోవడమే మంచిది. అవి అస్సలు వద్దమ్మా! ఎందుకంటే, చీరకి అగరబత్తి కాల్చి కన్నాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.
చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూలతోటలో నిలబడితే బావుంటుంది గానీ మనమే పూలతోటలా కనిపించకూడదు కదా.
చీర మరీ డార్క్ కలర్స్ లో వుండకుండా చూసుకో. మనం కట్టుకున్న చీరని చూసి ఎదుటి వారు వాంతి చేసుకునేలా వుండకూడదు కదమ్మా.
చీర మరీ ప్లెయిన్ కలర్ ఉండకుండా చూడు. మరీ స్కూల్ యూనిఫామ్ లాగ వుంటుంది.
చీర మరీ చిన్నగా ఉండకూడదు. చీర కడితే కుచ్చీళ్ళు ఎక్కువ రావాలి, అలాగే పమిట కొంగు కూడా మోకాళ్ళు దాటేంత పెద్దగా రావాలి.
నైలాన్, క్రేప్ చీర అయితే ఒకోసారి వంటికి చుట్టబెట్టుకు పోతుంది. అడుగు ముందుకు వేయడానికి రాదు. కాళ్ళకి అడ్డంపడి ముందుకు పడి ముఖం పగిలే ప్రమాదం ఉంటుందమ్మా...వద్దు మ్మా వద్దు.
బాందినీ చీర ఊసే వద్దు. పాత గుడ్డలా, మాసికలు పట్టినట్టు ముడతలు పడి ముడుచుకు పోయి ఉంటుంది..
చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టక్కర్లేకుండా, చీర ఐరన్ చేయక పోయినా కట్టుకునేలా ఉండాలి ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా.
చీర మరీ ఫేన్సీగా వుండకూడదు. గాజులకీ, మెడలో గొలుసులకీ, కాలి పట్టీలకీ తగులుకొని దారం పోగులు రాకుండా వుండేలా చూడమ్మా!.
కాటన్ చీరలు మాత్రం అసలు కొనకమ్మా! వాటికి గంజి పెట్టడం ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థి లాగ చాలా ఠీవిగా నిలబడి వుంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి లాగ డీలా పడిపోతుంది.
మరీ లేత రంగు చీర కొనకమ్మా! (మరక మంచిదే అది టి.వి.లో ప్రకటన వరకే) దాని మీద మరకలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఉతికితే ఒక పట్టాన మరకలు పోవు.
కలంకారీ ప్రింట్ చీర వద్దు. ఎందుకంటే అమ్మవారి ఫేస్ తో, బుద్ధుడు ఫేస్ తో, దేవుడి ఫేస్ తో వున్న చీర కట్టుకుంటే ఆ బొమ్మ కుచ్చీళ్ళు వున్న చోట కాళ్ళకి తగులుతూ ఉంటే దేవుడిని తన్నుతున్న ఫీలింగ్ తన్నుకొస్తుంది.. అది చాలా తప్పు అనిపిస్తుంది. అందుకని కలంకారీ గానీ, దేవుడి బొమ్మలతో వున్న ఏ చీరలు కొనకమ్మా!
చీరకి అడ్డ గళ్ళు వుంటే మాత్రం కొనకమ్మా! మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను.
అలాగే వెంకటగిరి చీర గానీ, ఖాదీలో గానీ, గుంటూరు నేత చీర గానీ అసలు ఎటువంటి నేత చీర గానీ కొనకమ్మా! మరీ వయసులో పెద్ద దానిలా కనిపిస్తానని మీ మామగారు అస్సలు కట్టనివ్వరు.
చీర కొంటే డ్రై వాష్ కి డబ్బులు పోసే అవసరం లేకుండా ఉండాలి.
అన్నట్టు మంజూ! నీతో అతి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.
చీరలో వాళ్లు ఎటాచ్ చేసిన జాకెట్ ముక్క కట్టు చెంగు వైపు వుండాలి. పమిట చెంగు వైపు వుండ కుండా చూసుకో.
ఎందుకంటే నేనూ చీరలో ఇచ్చిన జాకెట్ ముక్క కట్ చేయకుండా విడిగా మేచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టించు కుంటాను. దాని వలన చీర నిడివి పెరిగి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. అందుకని చీర రన్నింగులోనే జాకెట్ పీస్ కూడా వుండాలి.
అలా లేదనుకో నేను మళ్లీ దానిని కట్ చేసి కట్టు చెంగు దగ్గర అతుకు పెట్టి కుట్టించు కోవాలి. అలా చేస్తే మళ్లీ అది అతుకుల చీరలా అవుతుంది. 'అతుకుల చీర కట్టుకోకూడదు' అని మా అమ్మ చెప్పేది.
అర్థం..... అవుతోందా? మంజూ! అయినా నాదేముందమ్మా నేను షాపింగ్ కి వెళ్ళక్కర లేకుండా నేను ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేసి కొనేసేయి....
మంజూ! వింటున్నావా?.... నేను చెప్పింది అర్ధం అయిందా!?
ఎంతసేపూ నేను మాట్లాడడమే కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. హలో! హలో! నేను చెప్పింది విన్నావా?...
ఏమి కోడలో ఏమో!? "ఫోన్ పెట్టేస్తున్నాను అత్తయ్యా" అని చెప్పకుండానే మర్యాద లేకుండా ఫోన్ కట్ చేసింది.
అప్పుడే వియ్యపు రాలి నుండి ఫోన్ వచ్చింది...
"వదిన గారూ! ఇప్పటివరకూ మీ కోడలితో మీరేం మాట్లాడారో ఏమి షాకింగ్ న్యూస్ చెప్పారో గానీ మంజూ ఇక్కడ స్పృహ తప్పి పడిపోయింది.
అక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగానే వున్నారుగా?" ఆదుర్దాగా అడిగింది వియ్యపురాలు....
# # ------------ #

శుభోదయం నేస్తం
02/06/2023

శుభోదయం నేస్తం

26/05/2023
చాలా మంది ఆడవాళ్లు నలుగురిలోఉన్నపుడు చీర పైట సర్దుకోవడంకుచ్చిళ్ళు సర్దుకోవడం చేస్తూ ఉంటారు...!!అది చూసి కొందరు మగవాళ్లు ...
19/03/2023

చాలా మంది ఆడవాళ్లు నలుగురిలో

ఉన్నపుడు చీర పైట సర్దుకోవడం

కుచ్చిళ్ళు సర్దుకోవడం చేస్తూ ఉంటారు...!!

అది చూసి కొందరు మగవాళ్లు తప్పుగా అనుకుంటున్నారు...!!

వాళ్లకు తెలియనిది ఏంటంటే... ముడ్డి వరకు ప్యాంటు వేసుకొని మొలతాడు తగిలించినంత ఈజీ కాదు..!!

చిరకట్టడం అంటే పని చేసేటపుడు పైట విసిగిస్తుంది...!!

నడిచేటప్పుడు కుచ్చిళ్ళు నరకం చూపిస్తాయి..!!

చీర చూసే వాడికి బాగానే ఉంటుంది...!!

కానీ మోసే వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ ఎంటో...

ఆడవారిని గౌరవిద్దాం 🙏

చీరకు ప్రాధాన్యత ఇచ్చే ప్రతి ఆడవారికి శతకోటి వందనాలు🙏
సదా మీ సేవలో......
🙏మీ బొట్టు పవన్

 #కుటుంబ_వ్యవస్థ_ఇక_నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడట...
19/03/2023

#కుటుంబ_వ్యవస్థ_ఇక_నిలబడదు.
అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు.*

*దౌర్భాగ్యకరమైన పరిస్థితి*

*ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.*

*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు:*

*1.అతి తెలివి*

*2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేవు.*

*3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).*

*4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.*

*5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.*

*6.చిన్నదానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.*

*7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.*

*8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.*

*9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.*

*అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.*

*అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30, 40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.*

*10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.*

*11.మనుష్యులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.*

*12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.*

*13.కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.*

*14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.*

*కుటుంబ విలువలు,కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు.*

15 *డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం*

*ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు*

‼️ *దీనికి అందరూ, అన్నీ కారణములే. ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామ చంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము.*‼️*
శుభోదయం🙏 శుభ ఆదివారం🌹
సదా మీ సేవలో.......
✍️మీ బొట్టు పవన్

*_జాతీయ పురుష కమీషన్ కావాలి మగవాళ్ళకు పెద్ద కష్టమే!!_*ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త డిమాండ్ వినిపిస్తుంది .మహిళలకే హక్కులు...
18/03/2023

*_జాతీయ పురుష కమీషన్ కావాలి మగవాళ్ళకు పెద్ద కష్టమే!!_*

ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త డిమాండ్ వినిపిస్తుంది .మహిళలకే హక్కులు, చట్టాలు, శాసన బద్ధ సంస్థలు ఉంటే మరి మమ్మల్ని పట్టించుకునే వారెవరు అంటూ మగవారు రోడ్డు ఎక్కుతున్నారు. మహిళలకేనా సమస్యలు మగవారికి లేవా అని ప్రశ్నిస్తున్నారు. మహిళలకేనా జాతీయ మహిళా కమిషన్.. మగవారి కోసం జాతీయ పురుష కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటుకు మగవాళ్ళ డిమాండ్
ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి తమ కోసం జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్లు దాఖలు చేస్తూ తమ డిమాండ్ ను దేశానికి తెలియజేస్తున్నారు భారతీయ పురుషులు. ఇప్పుడు భారతదేశంలో పురుషులకు పెద్ద కష్టమే వచ్చింది. ఒకప్పుడు మహిళలకు మాత్రమే పరిమితమైన హింస, ఇప్పుడు పురుషుల పైన కూడా కనిపిస్తుంది.
మగవాళ్ళని వేధిస్తున్న ఆడవాళ్లు, ఆడవాళ్ళ టార్చర్ తో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న మగవాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని, తమ హక్కుల కోసం చట్టాలను రూపొందించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు పురుష పుంగవులు.

*_సుప్రీం కోర్టులో పిటీషన్_*

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏకంగా పిటీషన్ దాఖలు చేశారు. పెళ్లి చేసుకున్న మగవాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, పురుషుల ఆత్మహత్యల కట్టడికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ ద్వారా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
జాతీయ నేర గణాంకాల ప్రకారం 2021లో 81,063 మంది పెళ్లయిన పురుషులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇందులో పేర్కొన్నారు. ఇక చాలామంది ఇందులో 4.8% వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలతో చనిపోయారని వెల్లడించారు.

పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య.. అందుకే జాతీయ పురుష కమీషన్
28,680 మంది వివాహితలు ఆత్మహత్య చేసుకుంటే పురుషులే 80 వేలకు పైగా అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి, మగవాళ్ళ సమస్యల సాధన కోసం, ఆత్మహత్యల కట్టడి కోసం జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మొత్తానికి పురుషులు సైతం తమకు జరుగుతున్న అన్యాయం పట్ల నోరు విప్పి జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

🔹డబ్బు శాశ్వతం  కాదు..🔹🔹డబ్బే జీవితమూ కాదు..🔹▪️ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇల...
18/03/2023

🔹డబ్బు శాశ్వతం కాదు..🔹
🔹డబ్బే జీవితమూ కాదు..🔹

▪️ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు…

▪️"లక్ష్మీ..! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.

▪️“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…

▪️"ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.

▪️"కొడుకుని పిలిచి “ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని అడిగాను.

▪️"మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.

▪️ఆ తండ్రి “అవును డబ్బుకు నాకు లోటులేదు, కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమ”ని అడిగాడు.

▪️తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని

▪️”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ, వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం।” అని అన్నాడు.

▪️ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి.

▪️డబ్బే ప్రధానం అనుకుంటారు; అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసేవారుంటారు అని గుర్తించలేము.

▪️నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా కనిపిస్తుంది.

▪️మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు సరిపడా సంపాదన చాలు అనుకునే వారు.

▪️నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.

▪️అందుకే ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది .

▪️ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురుచూస్తుంటే పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తున్నారు

▪️అనురాగం ఆప్యాయత అందని ద్రాక్ష పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు.

సదా మీ సేవలో.....
✍️మీ బొట్టు పవన్

 #కూతురు_అంటే_గాజు_బొమ్మ_కాదు_మరో_అమ్మ☘️🌿☘️🌿☘️🌿ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలామాట్లాడుకుంటున్నారు..భార్య: ఏం అనుకుంటున్న...
18/03/2023

#కూతురు_అంటే_గాజు_బొమ్మ_కాదు_మరో_అమ్మ
☘️🌿☘️🌿☘️🌿

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
మా నాన్న నాకోసం
అది చేసాడు...
ఇది చేసాడు అనీ...

భార్య:

సో..అమ్మాయైతే ఇవన్నీ
చేస్తుంది...
అబ్బాయైతే
చేయడంటారు
అంతేగా..??

భర్త:

కాదు..
అబ్బాయైతే ఇవన్నీ
మనల్ని చూసి నేర్చుకుని
చేస్తాడు...

అమ్మాయికి
బై బర్త్ వచ్చేస్తాయ్...

భార్య:

అదేం
శాశ్వతంగా మనతోనే
ఉండిపోదు కదా..!

భర్త:

ఉండదు...
కానీ మనం దాని గుండెల్లో
ఉండిపోతాం...

అందుకని
అది ఎక్కడ ఉంది
అన్నది సమస్య కాదు..!

Daughters
are Angles...
Born with
unconditional
love and care forever...

అందుకని
ఆడపిల్లల
తల్లిదండ్రులు
అదృష్టవంతులు...

కూతురంటే కూడికల,
తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే
'తులసి మొక్క'...

కూతురంటే
దించేసుకొవలసిన
బరువు కాదు..
నీ ఇంట్లో వెలసిన
'కల్పతరువు'...

కూతురంటే
భద్రంగా చూడవలసిన
గాజు బొమ్మ కాదు...
నీ కడుపున పుట్టిన
మరో "అమ్మ"...

కూతురంటే
కష్టాలకు,కన్నీళ్ళకు
వీలునామా కాదు ...
కల్మషం లేని
'ప్రేమ' కు చిరునామా...

కళ్యాణమవగానే
నిన్ను విడిచివెళ్ళినా...
పరిగెత్తుకొస్తుంది నీకు
ఏ కష్టమెచ్చినా...

తన ఇంటి పేరు
మార్చుకున్న
కడదాక వదులుకోదు
పుట్టింటి పైన ప్రేమను...

కొడుకులా
కాటి వరకు
తోడురాకపోయినా...
అమ్మ అయి
నీకు ప్రసాదించగలదు
మరో జన్మ...

కూతురున్న
ఏ ఇల్లు అయినా
అవుతుంది..
దేవతలు
కొలువున్న కోవెల...

కూతురిని కన్న
ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని
కన్న మహారాజు లా..

Good luck my dear కూతుర్లు ని కన్న తల్లిదండ్రులారా!

17/03/2023

ఒక సాధారణ గవర్ణమెంట్ స్కూల్ టీచర్ సంపాదించుకున్న ఆస్తి🌹🙏
ఆచార్యదేవోభవ 🙏🙏🙏
Emotiinal movement

Address

Hyderabad
502286

Website

Alerts

Be the first to know and let us send you an email when Bottu Pavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share