
14/04/2025
డాక్టర్. బి ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ....
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్.బి ఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం...
అంబేద్కర్ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు...దళిత ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్ గారు..
డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని దళిత ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్ గారు పేర్కొన్నారు. లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ గారికే దక్కిందన్నారు. భారత జాతిని జాగృత పరిచిన ఆదర్శమూర్తి , మహోన్నత వ్యక్తి అని అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాస్త్ర నిపుణుడు, ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, చరిత్ర కారుడు, రాజనీతి కోవిడుదుగా అంబేద్కర్ గారి పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. మహానీయులైన జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డా బి ఆర్ అంబేద్కర్ లు ఏప్రిల్ మాసంలో జన్మించారన్నారు. అంబేద్కర్ ఆశయాలను , సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. *గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు* విజయవాడ నగరం నడిబొడ్డున స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని19 ఎకరాల్లో రూ. 400 కోట్ల వ్యయంతో 206 అడుగులతో నిర్మించిన విగ్రహం ప్రపంచంలోనే ఇది ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావటం విశేషమన్నారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి,వారి ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని దళిత ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్ గారు అన్నారు.