ISM TV

ISM TV జర్నలిజం మా ఇజం...

19/05/2025

మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో అద్భుతమైన ఎగ్జిబిషన్

18/05/2025

మన దేవాలయ దర్శనంలో దాగి ఉన్న సాంకేతిక🥀

1.మూలవిరాట్..!
భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది.
ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

2. ప్రదక్షిణ..!
మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది.
గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు.
పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి.
యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.

3. ఆభరణాలతో దర్శనం..!
ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

4. కొబ్బరి కాయ..!
ఇది స్వచ్ఛతకు గుర్తు.
పై టెంక మన అహంకారాన్ని..
దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును..
అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

5. మంత్రాలు..!
ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం..
అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం..
అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరుస్తాయి.

6. గర్భగుడి..!!
గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది.
అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

7. అభిషేకం..!
విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి..
వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి.
అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

8. హారతి..!
పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు..
హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి..
దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

9. తీర్థం..!
ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు
ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.

10. మడి..!
తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది..
అందుకే మడి.!!

The Powerful History & Struggles of Women | International Women’s Day
07/03/2025

The Powerful History & Struggles of Women | International Women’s Day

💜 The Powerful History & Struggles of Women | International Women’s Day 💜March 8th is more than just a date—it's a symbol of strength, resilience, and the ...

ఏడు రోజుల్లో బరువు తగ్గండి..లెక్క కరెక్టేనా? ఇందులో మాయా మర్మం ఏమీ లేదుకదా? లేకపోతే అధిక కొవ్వును ఆపరేషన్‌ ద్వారా తొలగిస...
14/02/2025

ఏడు రోజుల్లో బరువు తగ్గండి..
లెక్క కరెక్టేనా?
ఇందులో మాయా మర్మం ఏమీ లేదుకదా?
లేకపోతే అధిక కొవ్వును ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తారా?
అసలు నెలలో ఇన్ని కిలోల బరువు తగ్గడం సాధ్యమయ్యే పనేనా?
ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయికదూ!
ఒక వారంలో మూడున్నర కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు.
కానీ, అదేమీ కష్టం కాదు అంటున్నారు నిపుణులు. తాము సూచించే వారం రోజుల డైట్‌ ప్లాన్‌ తూచా తప్పకుండా పాటిస్తే బరువు కచ్చితంగా తగ్గుతారంటున్నారు.
శరీరం మీద చిన్నపాటి గాటు కూడా పెట్టించుకోకుండా బరువు తగ్గేందుకు వారు చెబుతున్న వారం రోజుల డైట్‌ ప్లాన్‌ వివరాలు...
భోజనం చేయకూడదా?:
వారం రోజుల పాటు కూరగాయలు లేదా పళ్ళు తిని ఉండాలంటే కొద్దిగా కష్టమే!
అలా వుండలేని వారు కొద్దిమొత్తంలో అన్నాన్ని రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భోజనంలో కూడా పోషకాలతో పాటు ఫైబర్‌ అధికంగా వుండే విధంగా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కింద ఇచ్చిన డైట్‌ ప్లాన్‌లో ఆహారాన్ని రోజు మొత్తంమీద కొద్ది కొద్దిగా తీసుకోవాలని వారు చెబుతున్నారు.

1.సోమవారంపళ్ళతోవిందు
:శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపాలంటే పళ్ళతో విందు మంచి మార్గం.
ఇంకెందుకు ఆలస్యం? ఈ సోమవారాన్ని పళ్ళ డైట్‌తో ప్రారంభించండి.
పళ్ళ డైట్‌ అంటే బోలెడన్ని పళ్ళు తినేసి బ్రేవ్‌ మని తేన్చడం కాదు.
రోజు మొత్తం మీద నాలుగు ఆపిల్స్‌. నాలుగు ఆరంజ్‌లు, రెండు దానిమ్మ, ఒక వాటర్‌ మిలన్‌ పండు తినాలి.
అలా రోజును పూర్తి చేయండి.
పళ్ళు తింటే బోలెడంత సమయం పడుతుంది కదా, ఆ పళ్ళతో జ్యూస్‌లు తయారు చేసుకుని తాగితే బాగుంటుంది కదా అనుకునేరు. ఆ పని అస్సలు చేయకండి.
ఎట్టి పరిస్థితుల్లోనూపళ్ళ జ్యూస్‌లను దగ్గరకు రానీయకండి.
సరిపడా పళ్ళు తింటున్నాం కదా, నీరు ఎందుకు దండగ అనుకునేరు...

పది గ్లాసుల నీరు తాగడం మర్చిపోకండి.
పై పళ్ళు, పది గ్లాసుల నీరు సోమవారం డైట్‌లో తప్పనిసరిగా వుండాల్సిందే!

ఈ వారం రోజులూ ఉదయమే గోరువెచ్చని నీటిలో స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగండి.
ఈ నీరు తాగిన తరువాతే మీ డైట్‌ను మొదలుపెట్టండి.
వ్యాయామం:
నడకను మించిన వ్యాయామం లేదంటారు కదా? రోజూ అరగంట పాటు నడిచేవారు మరో పది నిమిషాలు పొడిగించుకోండి.
అదీ బ్రిస్క్‌ వాక్‌ చేస్తే మరీ మంచిది.

2.మంగళవారంకూరగాయలు మాత్రమే:
మీ వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్‌లో రెండవ రోజు వచ్చేసింది.
ఈ రోజు కూరగాయలు మాత్రమే తీసుకోండి. వాటిని పచ్చిగా తిన్నా సరే లేదా సలాడ్స్‌, అంతగా కాకపోతే ఉడకబెట్టినవి తినండి.
చప్పగా తినడం కష్టంగా వుంటే వాటి మీదచిటికెడు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని తినండి. ఆకలి అనిపించినప్పుడల్లా ఈ కూరగాయలను తినేయండి.
వీటికి వెన్న, క్రీమ్‌, పాలు, నూనె వంటివి అస్సలు కలుపుకోకండి.
ఉదయమే గ్లాసు గోరువెచ్చని నీరుతాగిన తరువాత ఉడికించిన బంగాళాదుంప తినండి.
అదే మీ బ్రేక్‌ఫాస్ట్‌ అయిపోతుంది.
లంచ్‌, డిన్నర్‌కి పచ్చి లేదా ఉడికించిన కూరగాయలు తీసుకోండి.

3.బుధవారంఅరటిపండు, పాలు:
ఈ రోజు మీ ఆహారం పది అరటిపండ్లు, మూడు గ్లాసుల పాలు, గిన్నెడు డైట్‌ సూప్‌.
ఈ కొద్దిపాటి ఆహారంతో ఆకలి తీరలేదు అనుకుంటే చాలా తక్కువ మొత్తంలో అన్నం తినండి.
అన్నానికి బదులు గోధుమ లేదా జొన్న రొట్టె తీసుకుంటే ఇంకా మంచిది వీటితో పాటు నీరు తాగే శాతాన్ని కొద్దిగా పెంచండి.
పది గ్లాసులు కాకుండా పన్నెండు గ్లాసుల నీరు తాగితే మంచిది.

4.గురువారంఈ రోజు మీకు ఇష్టమైనన్ని పళ్ళు కూరగాయలు తీసుకోండి. కూరగాయలను వెన్న లేదా నూనె వేసి తయారు చేసినవి మాత్రం తినకండి.
పచ్చివి తింటే మరీ మంచిది అలా కాకుండా ఉడకబెట్టినవి కూడా తీసుకోవచ్చు.
ఈ రోజు కూడా పన్నెండు గ్లాసులనీరు తాగడం మరిచిపోకండి.
వీటితో పాటు పళ్ళు, కూరగాయలు కలిపి తయారు చేసుకున్న సలాడ్‌ను తీసుకోండి.
పళ్ళ జ్యూస్‌లకు దూరంగా వుండండి

5.శుక్రవారంఈ రోజు పళ్ళు కూరగాయలతో పాటు చిన్న గిన్నెడు బ్రౌన్‌రైస్‌, చిన్న కప్పు పప్పుతో పాటు గ్లాసు పలుచని మజ్జిగాతీసుకోండి.
ఈ రోజు కనీసం ఆరు టమోటాలు, రెండు ఆపిల్స్‌, రెండు ఆరంజ్‌ పళ్ళు తీసుకోండి.
వీటితో పాటు ప్రతిరోజూ లాగే సలాడ్‌ను తీసుకోండి.
ఈ రోజు తాగే నీటి కోటాను ఇంకా కొద్దిగా పెంచండి.
మరో రెండుగ్లాసుల నీరు అదనంగా అంటే మొత్తం పధ్నాలుగు గ్లాసుల నీరు తాగండి.

6.శనివారంపై రోజుల్లో ఏదో ఒక రోజు డైట్‌ని ఈ రోజు ఫాలో అయిపోండి.
ఈ రోజు కూడా తాగే నీరు తగ్గకుండా చూసుకోండి.
అదనంగా ఓ కప్పు గ్రీన్‌ టీని అదనంగా చేర్చండి.
ఈరోజు వీలుంటే కాఫీ, టీలకు గుడ్‌బై చెప్పేయండి.
సలాడ్స్‌ షరా మామూలే!

7.ఆదివారంచిట్టచివరి రోజు. ఏడురోజుల డైట్‌ప్లాన్‌కి బైబై చెప్పేయాలని అనుకునే రోజు.
మీకిష్టమైన కూర గాయలను చిన్ని గిన్నె పప్పు, బ్రౌన్‌రైస్‌తో కలిపి ఉడి కించుకుని తీసుకోండి.
వీటితో పాటు గ్లాసు పలుచని పాలు, చిన్న గిన్నె సలాడ్‌ను కూడా తీసుకోండి.
ఈ రోజు మాత్రం ఓ గ్లాసు తాజా పళ్ళరసాన్ని చక్కెర లేకుండా తాగండి....

సేకరణ పోస్ట్

03/02/2025

రేపు రథసప్తమి...

మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి , ఎందుకు ?

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు ,
3. జ్యేష్టం - మిత్రుడు ,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం - వివస్వంతుడు ,
7. ఆశ్వయుజం - త్వష్ణ ,
8. కార్తీకం - విష్ణువు ,
9. మార్గశిరం - అంశుమంతుడు ,
10. పుష్యం - భగుడు ,
11. మాఘం - పూషుడు ,
12. ఫాల్గుణం - పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని *'యుగ సహస్ర యోజన పరాభాను'* అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే *'యుగం.. 12000 ఏళ్లు , సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.* ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి ,
2. త్రిష్ణుప్పు ,
3. అనుష్టుప్పు ,
4. జగతి ,
5. పంక్తి ,
6. బృహతి ,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని *'ఆదిత్య హృదయం'* ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు , రాత్రికి ప్రతీక అని , చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు , ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.
అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు , ఐశ్వర్యం , ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి , రోగము , శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

☘ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:☘

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!

పూజ విదానం:

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి , ఒక్కొక్క దళం చొప్పున రవి , భాను , వివస్వత , భాస్కర , సవిత , అర్క , సహస్రకిరణ , సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం , ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు , జిల్లేడు , రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు , రేగు , దూర్వాలు , ఆక్షతలు , చందనాలు కలిపిన నీటితోగాని , పాలతో గాని , రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు , వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే !
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ - ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని , ఐశ్వర్యాన్ని పొందుదాం.
చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం , సూర్య స్తోత్రం , నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం.

మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది , చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి.
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు , ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం.

1. ఈ జన్మలో చేసిన
2. గత జన్మలో చేసిన
3. మనస్సుతో
4. మాటతో
5. శరీరంతో
6. తెలిసీ
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది.

రోగ నివారణ , సంతాన ప్రాప్తి కోసం - రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు
చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి.
సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తున్నామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది.

04/12/2024
03/12/2024
25/11/2024
22/11/2024
21/11/2024
19/11/2024

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ISM TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share