Unnamaata

Unnamaata Part of the new Media initiative of veteran journalist , reputed Editor and author MVR Sastry.

29/09/2025

UNCUT VERSION: Seniour Journalist MVR Sastry About Constitution of India | Refl...

29/09/2025

నేతాజీ ఆడియో బుక్ మలిభాగంఎపిసోడ్- 25|| మారుపేరుతో అంత్యక్రియ! || ుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఎంతో వైవిధ్యం, కార్య...

మళ్లీ ఇన్నాళ్లకు ... .... !!నా పాత సహచరుడు, సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ పట్టుబట్టి నన్ను ఇంటర్వ్యూ చేసి సంవత్సరంగా మూల...
27/09/2025

మళ్లీ ఇన్నాళ్లకు ... .... !!
నా పాత సహచరుడు, సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ పట్టుబట్టి నన్ను ఇంటర్వ్యూ చేసి సంవత్సరంగా మూలపడిన నా చానెల్ ను మళ్లీ మొదలెట్టించాడు. అందులో మొదటి భాగమిది:

నేను రాసే ప్రతి పుస్తకంనా గుండెలపై కుంపటి PART 1|| ​

26/09/2025

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి "ఋషిపీఠం" మాసపత్రిక తాజా (అక్టోబర్) సంచికలో "కరుణాచల రమణ" పుస్తకం సమీక్ష.

18/09/2025
"ఇదం బ్రాహ్మం" ఏమిటి? ఎందుకు? ఎవరిది? ఎవరికోసం? బ్రాహ్మణ సంఘాలు లెక్కలేనన్ని ఉండగా మళ్లీ మీరు తీరికూర్చుని ఇంకో సంస్థ ఎం...
13/09/2025

"ఇదం బ్రాహ్మం" ఏమిటి? ఎందుకు? ఎవరిది? ఎవరికోసం?
బ్రాహ్మణ సంఘాలు లెక్కలేనన్ని ఉండగా మళ్లీ మీరు తీరికూర్చుని ఇంకో సంస్థ ఎందుకు పెట్టారు? ఇప్పటిదాకా ఏమి చేశారు? ఇకముందు ఏమి చేస్తారు?
ఇంతకీ అది 'బ్రాహ్మ'మా? "బ్రాహ్మ్యమా" ఏది కరక్టు?
ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఎవరో అడగక ముందే జవాబులు చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అని తలచి -

నేను "ఇదం బ్రాహ్మం సొసైటీ" అధ్యక్షుడిగా ఉండగా ఏణ్నర్థం కింద ఈ వీడియో చేశాను. అంతా అయ్యాక చూస్తే చేసినదాని నిడివి, స్టాండర్డు , మాటల్లో పునరుక్తి దోషాలు నాకే నచ్చలేదు. అందుకని - తీరుబడిగా ఇంకొకటి చేద్దాములెమ్మనుకుని తయారైన వీడియోను బహిరంగపరచకుండా పక్కన పడేశాను. ఆ తర్వాత కొత్త కమిటీ ఎన్నికై బాధ్యతలు చేపట్టింది. కొత్త అధ్యక్షుడికి బాధ్యత అప్పగించి నేను నా గ్రంథ రచన వ్యాసంగం లో పూర్తి కాలం నిమగ్నమయ్యాను. అలా దొరికించుకున్న తీరికవల్ల సంవత్సర కాలంలో రెండు ( దేవుడున్నాడు‌ జాగ్రత్త , కరుణాచల రమణ ) పుస్తకాలు రాయగలిగాను.

మళ్లీ ఇన్నాళ్లకు అమెరికాలోని ఒక బ్రాహ్మణ సంస్థ వారి కోరిక మేరకు "ఇదం బ్రాహ్మం" గురించి నాలుగు మాటలు చెప్పవలసి‌ వచ్చింది. కొత్తగా ఏదో చెప్పేందుకు బద్ధకించి అడుగున పడిఉన్న ఈ రెడీ మేడ్ వీడియోను యథాతథంగా వారికి పంపాను. ఎలాగూ బయటపెట్టా కదా అని మీతో కూడా పంచుకుంటున్నాను.

"ఇదం బ్రాహ్మం" సంస్థ లక్ష్యం, గమ్యం, మార్గం వివరిస్థూ‌ ఇదం బ్రాహ్మం సొసైటీ సంస్థాపకులు ఎం.వి.ఆర్. శాస్త్రి గారు ఏణ...

31/08/2025

ఎం.వి.అర్. శాస్త్రి గారి కొత్త పుస్తకం " " కరుణాచల రమణ" మీద "ఈనాడు" దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఈరోజు ప్రచురించిన సమీక్ష .

18/08/2025
10/08/2025

ఎం.వి.ఆర్. శాస్త్రి గారి కొత్త పుస్తకం "కరుణాచల రమణ" మీద చదివి చెన్నై లో ఉండే శ్రీ ఎం.ఎస్.చైతన్య గారి సమీక్ష:...
భగవాన్ గురించిన పుస్తకాలు కోకొల్లలు. కొన్నింట్లో ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలు, మహిమలు ఐతే ఇంకొన్ని రమణతత్వాన్ని లోతుగా విశ్లేషించేవి. తెలుగువాళ్ళ అదృష్టం కొద్దీ సూరి నాగమ్మగారు, మునగాల వెంకటరామయ్యగారు, కృష్ణభిక్షుగారు మొదలైనవారి రచనలవల్ల మనకు తిరువణ్ణామలై పరిచయమైంది. గత రెండు దశాబ్దాలుగా చాగంటి వారి పుణ్యమాని రమణాశ్రమం ఇంకాబాగా దగ్గరైంది. ఎంతగా అంటే అక్కడ అంగళ్ళలో అంతా తెలుగులో బేరాలు సాగేదాక.
'కరుణాచల రమణ 'ను శాస్త్రిగారు రాస్తాను అన్నప్పుడు సహజంగానే పాఠకులకు, అభిమానులకు ఉత్సాహం కలిగింది. రాజమౌళి వంటి వీరోచిత చిత్రాల దర్శకుడినుంచి విశ్వనాథ్ తరహా జీనర్ అంటే అది మాకొక సర్ప్రైజ్. శాస్త్రిగారు మనకోసం అనేకానేక గ్రంథాల్ని మథించి ఆణిముత్యాలను ఒకచోట పేర్చారు. మొత్తం 46 గ్రంథాలనుంచి (అందులో 33 ఆంగ్లం, 13 తెలుగు) 166 పేజీల సారాన్ని తీశారు.
ఎంతోమందిలానే వారుకూడా రమణుల మీద అనేకానేక అనుమానాలతో 2008లో మొదటిసారి ఆశ్రమానికి వెళ్ళినప్పటి అనుభవాలను 'ముందుమాట 'లో చెప్పిన దగ్గరినుంచి చివరిలో ప్రముఖుల నివాళుల వరకు శాస్త్రిగారి ట్రేడ్మార్క్ కనిపిస్తుంది.
ఏప్రిల్ 14 1950నాడు జరిగిన అద్భుతాన్ని చదివాక తరువాతి భాగానికి వెళ్లాలంటే కాస్త తమాయించుకోవాలి.ఇక అక్కడనుంచి సామాన్యప్రజానీకం నుంచి జగద్గురువుల వరకు భగవాన్ ఎలా మౌనంగానే జ్ఞానమార్గం చూపించారో తెలుపుతూ వస్తారు. ఇక్కడ మనం గమనించవల్సిన విషయం ఏమంటే తెలియని విషయాన్ని నేర్చుకొనేందుకు సాక్షాత్తు జగద్గురువులుకూడా జ్ణానగురువును వెతుక్కుంటూ వస్తారు; అనవసర అహంకారాలు, భేషజాలు వారికి ఉండవు అని.

ఇక 'కరుణాచల ' అని పుస్తకంపేరులోనే పెట్టి అందుకు తగినట్టుగానే భగవానుల కరుణను అపరిమితంగా పొందిన జంతువులకు సముచిత భాగం కల్పించారు. నెర్రెలిచ్చిన గుడ్డులోంచి పిల్ల బయటకు రావడాన్ని పరీక్షిత్తుతో పోల్చినప్పుడు కలిగే భావావేశం అక్షరాల్లో ఇమడ్చలేం.
గతంలో శాస్త్రిగారి పుస్తకాలను ఏకబిగిన చదివేసిన అభిమానులు దీనిని మాత్రం కొద్దికొద్దిగా చదువుతూ ముందుకెళ్ళాలని నాసలహా. ఈపుస్తకంలో ఉన్నవిషయాలను మనమనసు ఏకబిగిన జుర్రుకునే శక్తితక్కువ అని నాఅభిప్రాయం.
రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆర్భాటంగా పుస్తకాలు కొనేసి తీరా ఇంటికొచ్చాక వాటిని తెరవని నావంటివాళ్ళకు ఈపుస్తకం ఉపోద్గాతంగా పనికొస్తుంది. దీనిని చదివాక సూరినాగమ్మగారి 653పేజీల 273లేఖలు+28స్మృతులు, కృష్ణభిక్షుగారి శ్రీ రమణలీల మొదలైనవి చదువుకుంటూ ముందుకు సాగొచ్చు.
దీనికి రెండవభాగమైన 'జగద్గురు రమణ ' వీలైనంత ఆలస్యం కావాలని కోరుకుందాం.

సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన హద్దు దాటి ఏకంగా భారత రాష్ట్రపతికే డైరెక్షను ఇవ్వటాన్ని మాన్య ఉపరాష్ట్రపతి గారు బహిరంగంగా అధ...
23/05/2025

సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన హద్దు దాటి ఏకంగా భారత రాష్ట్రపతికే డైరెక్షను ఇవ్వటాన్ని మాన్య ఉపరాష్ట్రపతి గారు బహిరంగంగా అధిక్షపించిన నేపథ్యంలో రాజ్యాంగ మూల స్తంభాల నడుమ ఘర్షణలు, వాటి పూర్వాపరాల గురించి, ఈ సంఘర్షణలో ఇమిడి ఉన్న మౌలిక అంశాలు గురించి భక్తి వన్ చానెల్ తరఫున మదన్ గుప్తా గారు నెల కింద నాతో చేసిన ఇంటర్వ్యూ ఇది.

⚖️ An Honest Take on Indian Judiciary by MVR SastryIn this exclusive and thought-provoking interview, senior journalist and public intellectual MVR Sastry sp...

Address

Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when Unnamaata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share