08/06/2024
రామోజీరావు గారికి అశ్రునివాళి
****************************
మీడియా దిగ్గజం,ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారి అస్తమయం పత్రికరంగానికి తీరనిలోటు.. సామాన్యూడిగా ప్రారంభమైన అయన ప్రస్థానం అసమాన్యుడిగా ఎదిగిన విధానం,మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అద్భుతమైన విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ రావు గారు పత్రిక రంగానికి తెలుగు ప్రజలకు , దేశానికి చేసిన సేవలు స్లాగనీయం. ఈనాడు పత్రిక ద్వారా
తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వ్యక్తి శ్రీ రామోజీ రావు గారు. అయన మరణం పత్రికాలోకంతో పాటు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు,.దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అయన చేసిన సేవలు సదా అనుసరణీయం.మీడియా రంగంలో అయన ఉన్నత శిఖరం. ఓక వ్యక్తి ఈనాడులో గాని, అయన సంస్థలలో గాని పనిచేసి వచ్చారంటే ఎక్కడైనా పనిచేస్తారు అనేది శ్రీ రామోజీ గారు సంపాదించుకున్న పేరు. అది అయన బ్రాండ్. అయన దగ్గర పనిచేస్తే ఎంత కష్టమైన పని అయినా చేయగలుగుతారనే నమ్మకం.నేడు వివిధ మీడియా సంస్థలలో ఉన్న ప్రముఖ వ్యక్తులందరు కూడా అయన స్కూల్ నుంచి వచ్చిన వారే.
ఎన్నో సవాళ్లను,అటుపోట్లను ఎదుర్కొన్నా ఎవరికీ ఎక్కడా తలవంచకుండా తాను అనుకున్నది చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. బయటి వాళ్ళు అయనపై ఆరోపణలు చేశారు తప్ప ఆయనెప్పుడూ ఉన్నతమైన విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాలగా విలువలకు కట్టుబడి తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. మీడియా రంగంలో శిఖరంలా వెలుగొందిన రామోజీరావు గారు ఇక లేరు అనే విషయం నమ్మలేకపోతున్నాము.
రామోజీరావు గారి ఈనాడు పత్రిక నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు చదవడం అలవాటు. ఎంతలా అంటే ఇప్పటికి ఏదైనా విషయాన్నీ నిర్ధారించుకోవాలంటే అదే పత్రికలో చూసి నిర్ధారించుకునేంత. అంతలా ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై పత్రిక ద్వారా జాగృతం చేయడానికి జీవితాంతం కృషిచేసిన శ్రీ రామోజీ గారి అస్తమయం మీడియా రంగానికి, ముఖ్యంగా మాలాంటి వారికీ తీరని లోటు.వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
జోహార్ రామోజీరావు గారు... జోహార్.. జోహార్..
శోకతప్తహృదయంతో....
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్
ఎడిటర్, సలాం తెలంగాణ పత్రిక